మహారాష్ట్రలో ఒక పల్లెటూరు ఆది ఎండాకాలం, ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా వున్న ది, కొంతమంది కడ జా తివాళ్లు మం చి నీ ళ్ల కోసం కుండలు పట్టుకొని ...
మహారాష్ట్రలో ఒక పల్లెటూరు ఆది ఎండాకాలం, ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా వున్నది, కొంతమంది కడజాతివాళ్లు మంచినీళ్ల కోసం కుండలు పట్టుకొని ఒక బావివద్ద నిలబడ్డారు. ఆ రోజుల్లో వాళ్ళు నివసించే ప్రాంతంలో బావులు ఎక్కువగా ఉండేవి కావు. అదీగాక ఊరిలోని బావుల్లో వాళ్లను నీళ్లు తోడుకోనిచ్చేవారు కాదు ఎవరైనా దయ తలచి తోడిపోస్తేనే వాళ్లకు నీళ్లు దొరికేవి, ఆ రోజు ఎంతసేపు ఎండలో నిలుచున్న ఎవరు నీళ్లు పోయలేదు. ఎండకు వారికి చెమటలు కారుతున్నాయి.
ఇంతలో ఒక వ్యక్తి ఆ దారిన రావడం తటస్థించింది. ఆయన నీళ్ల కోసం నిలుచున్న హరిజనుల్ని చూశాడు, వాళ్ళ దీనావస్థలు అంచనా వేశారు. ఆయన కడుపు తరుక్కు పోయింది గబగబా ఒకరి దగ్గరకు వెళ్లి బిందె తీసుకున్నాడు. బావిలోకి చేదవేసి నీళ్లు తోడి ఆ పేదవారి కుండలను నీళ్లతో నింపసాగాడు ఆ దృశ్యం చూచిన ఊరి వారికి ఒళ్లు మండింది. కాని ఆయన్ని ఏమి అనలేకపోయారు.
ఎప్పటినుండో నీళ్ల కోసం ఎండలో నిలబడిన హరిజనుల కళ్లల్లో ఆనందాశ్ళవులురాలాయి. నీళ్లుతోడి పోస్తున్న ఆయన వంక కృతజ్ఞతతో చూశారు నీళ్లు పోయడం అయిపోయింది ఆయన వెళ్తూ వెళ్తూ అదిగో ఆ కనబడుతున్న ఇల్లు నాదే! మీకెప్పుడు మంచి నీళ్లు కావాలన్నా మా బావిలో నుండి తోడుకోవచ్చు అన్నాడు ఆదరణ పూర్వకంగా హరిజనుల సంతోషించారు.
ఆయన చెప్పినట్టుగానే ఆయన ఇంటి దగ్గర బావికి నీళ్లకు వెళ్లేవారు. కానీ బావిలో చేద వేయటానికి భయపడేవారు. అటువంటి వారికి ఆయనే నీళ్లు తోడి పోసేవాడు అంటరానివారంటే ఆదరణ చూపిన ఆయనే జ్యోతిరావు పూలే ప్రముఖ సంఘసేవకుడుగా పేరు పొందాడు. మహాత్ముడని ప్రజలు ఆయన్ను పిలిచేవారు.
ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments