బడిలో ఉపాధ్యాయుడు స్కూల్ ఫీజు కట్టటానికి ఎల్లుండి చివరిరోజు ఆ రోజు లోపల చెల్లించనివారు పేరు పాఠశాలలో నుండి తీసి వేస్తారు అని హెచ్చరించార...
బడిలో ఉపాధ్యాయుడు స్కూల్ ఫీజు కట్టటానికి ఎల్లుండి చివరిరోజు ఆ రోజు లోపల చెల్లించనివారు పేరు పాఠశాలలో నుండి తీసి వేస్తారు అని హెచ్చరించారు. పిల్లలంతా ఆ మాటలు విన్నారు. వారిలో చాలామంది అప్పటికే ఫీజు చెల్లించారు. అందులోని ఒక పిల్లవాడు ఆ మాటలు విని ఉలిక్కి పడ్డాడు. అతడు చాలా బీద పిల్లవాడు.
వాళ్ళ ఇల్లు జరగటమే కష్టం! పైగా అతడి ఫీజు చెల్లించలేక తల్లిదండ్రులు సతమతమైపోతూ ఉండేవారు. ఆ పిల్లవాడు చదువులో దిట్ట ఎటువంటి వానికి ఫీజు కట్టటానికి డబ్బులు దొరకలేదు. బడి వదలగానే విచారంగా వస్తున్న ఆ బాలుడికి ఇదిగో అబ్బాయి! విచారించకు.. ఫలానా ఆయన్ను అర్థించావంటే నీకు కావలసిన ఫీజు డబ్బులు ఇట్లాగే వచ్చేస్తాయి. అని ఎవరో సలహా ఇచ్చారు.
మరునాడు ఆ అబ్బాయి ఆ ఫలానా ఆయన దగ్గరకు వెళ్లాడు, తన దీనస్థితిని గురించి వివరంగా చెప్పాడు. అది విన్న ఆయన మనసు బాధపడింది. జాలిగా ఆ అబ్బాయిని ఓదార్చాడు. బాగా చదువుకొమ్మని ఆశీర్వదించాడు. తన జేబులో నుండి ఒక నోటు తీసి ఆ అబ్బాయికి ఇచ్చాడు. ఆనందంలో ఆ అబ్బాయి నోటు చూచుకోలేదు. కొంత దూరం వెళ్లి చూచుకున్నాడు. అది వంద రూపాయల నోటు.
ఆయన పొరపాటున ఇచ్చాడేమోనని గబగబా పరుగెత్తుకు వెళ్లి వినయంగా విషయం వివరించి చెప్పాడు. ఆయన నవ్వుతూ.. నీ అదృష్టం వల్ల చేతికి వందరూపాయల నోటు వచ్చింది.. ఇంకేం! అది నీదే! ఫీజు కట్టు.. పుస్తకాలు కొనుక్కో అని అన్నాడు ఆయన దాతృత్వానికి ఆ విద్యార్థి ఆశ్చర్యపోయాడు. ఆ దాతయే విశ్వదాత గా పేరు పొందిన కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు.
ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments