కొల్హాపూరులో ఒక జడ్జిగా రు ఉండేవారు. ఆయన ఆ పదవి చేపట్టి ఎన్నో రోజులు కాలేదు, ఒక రోజు అయన తన ఇంట్లో ఏదో చదువుకుంటున్నా డు ఇంతలో అతడి తం...
కొల్హాపూరులో ఒక జడ్జిగారు ఉండేవారు. ఆయన ఆ పదవి చేపట్టి ఎన్నో రోజులు కాలేదు, ఒక రోజు అయన తన ఇంట్లో ఏదో చదువుకుంటున్నాడు ఇంతలో అతడి తండ్రి ఎవరినో వెంట బెట్టుకుని ఆ గదిలో ప్రవేశించాడు వచ్చిన వాళ్లకు జడ్జిగారు లేచి నిలబడి ఎంతో ఆదరణ చూపించారు. వాళ్లిద్దరూ కూర్చున్న తరువాత మాత్రమే జడ్జి గారు కూర్చున్నారు.
జడ్జి తండ్రి ఆ వచ్చిన ఇంకొక వ్యక్తిని చూపిస్తూ నీకేదో చెప్పాలని ఈయన వచ్చారు. దయచేసి విను అని అన్నారు జడ్డిగారు మాట్లాడలేదు. మౌనం దాల్చారు ఆ వచ్చిన వ్యక్తి నేను ఇవాళ కేసుకు సంబంధించిన కాగితాలు తీసుకురాలేదు నా గురించి శ్రద్ధ తీసుకుంటే ఆ కాగితాలు పంపిస్తాను అని అన్నాడు. ప్రస్తుతం నాకు చాలా పని ఉన్నది, నాకు ఎప్పుడు వీలు దొరుకుతుందో! అప్పుడే మీ విషయం చూస్తాను. అని జవాబు ఇచ్చారు జడ్జీ గారు ఆ వచ్చిన పెద్దమనిషి లేచి వెళ్ళిపోయాడు.
దానితో జడ్జి తండ్రిగారు కూడా లేచి వెళ్లబోయాడు. జడ్జిగారి లేచి తండ్రిని అనుసరించారు నేను ఇక్కడ నా విధి నిర్వహించడానికి వచ్చాను. కొల్హాపూర్ లో వారంతా మీకు తెలిసిన వారు! ఎవరైనా మీ దగ్గరకు వచ్చి వాళ్ళ కేసు విషయంలో మిమ్మల్ని సహాయపడమని అడగవచ్చు. వారికి మీరు దూరంగా ఉండటం మంచిది. లేకపోతే అది ఎప్పుడు మీకు బాధ కలిగిస్తూ ఉంటుంది. నేను ఇక్కడి నుండి బదిలీనే కోరుకోవచ్చు. వాదులు ఎవరైనా ఇంటికి వచ్చి వారి సమస్యలు వినిపించటం కాని, వారి కాగితాలు చూడమనిగాని అడిగితే నేను అంగీకరించను.
ఇది నేను విధించుకున్న నియమం, నా నియమాన్ని నిర్వర్తించడం లో మీ సహాయాన్ని కోరుతున్నాను అని తండ్రితో నిర్మొహమాటంగా చెప్పాడు న్యాయపాలనలో హితుల్ని అహితుల్ని అయినవారినీ కాని వారినీ సమ దృష్టికతో చూచిన ఆ జడ్జి గారు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆయనే మహదేవ గోవింద రనడే. భారతీయ పండితుడు, సామాజిక సంస్కర్త, న్యాయమూర్తి మరియు రచయిత. అతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు
ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments