మహారాష్ట్రలో సతారా అనే ఊరు ఉన్నది. పూర్వం అక్కడొక పాఠశాల ఉండేది. ఒక రోజు క్లాసులో ఉపాధ్యాయుడు లెక్కల పాఠం చెబుతున్నారు. ఒక లెక్క ను చెప...
మహారాష్ట్రలో సతారా అనే ఊరు ఉన్నది. పూర్వం అక్కడొక పాఠశాల ఉండేది. ఒక రోజు క్లాసులో ఉపాధ్యాయుడు లెక్కల పాఠం చెబుతున్నారు. ఒక లెక్కను చెప్పి విద్యార్థులను నల్లబల్ల మీద చేసి చూపించమన్నాడు. ఎవరికి వారే మాకు రాదంటే మాకు రాదు అని అన్నారు.
ఉపాధ్యాయుడి దృష్టి క్లాసులో ఓ పిల్లవాడి మీద పడింది. నల్లబల్లమీద లెక్క చేయమని ఆ అబ్బాయిని అడిగాడు. ఆ అబ్బాయి లెక్క చేయగలరని ఆయనకు నమ్మకం ఉంది. నిజంగా ఆ అబ్బాయి లెక్క చేయగలడు. ఆ అబ్బాయి ఉత్పాహంతో లెక్క చేయటానికి బల్లవైపు పోసాగాడు ఇంతలో క్లాసులోని పిల్లలంతా గగ్గోలుగా అరిచారు. వాళ్ళ అన్నపు గిన్నెలు ఆ నల్ల బల్ల వెనుక ఉన్నాయి. లెక్క చేయబోతున్న అబ్బాయి మహర్ కులస్థులు. (దళిత వర్గానికి చెందిన కులం) మహర్ ల గాలి తగిలితే చాలు అన్నీ మైల పడిపోతాయి. అని అగ్ర వర్ణాలవారు అనుకునే వారు. అందుకే ఆ అబ్బాయి. నల్లబల వైపు పోకుండా నిరోధించారు.
ఉపాధ్యాయుడికి ఏమి పాలుపోలేదు. పిల్లలందరకూ భయపడి ఊరుకున్నాడు. లెక్కచేయబోయిన అబ్బాయి బాధపడ్డాడు. అవమానాన్ని భరించలేకపోయాడు. చేసేదేమీ లేక తన చోటికి వచ్చి కూర్చున్నాడు. తరువాత ఉపాధ్యాయుడు ఆ అబ్బాయిని ఓదార్చాడు. అంతే కాకుండా చాలాసార్లు కష్టాల్లో ఆ అబ్బాయిని ఆదుకున్నాడు. ఆనాటి పరిస్థితులను ఎదిరించలేక చాటుగా ఆ అబ్బాయి కి ఎంతో సహాయం చేశాడు. బాగా చదువుకోమని ప్రోత్సహించాడు. ఆ అబ్బాయి ఆయనమాట పాటించి బాగా చదువుకున్నాడు. ఉపాధ్యాయుడి పేరు అంబేద్కర్ ఆ అబ్బాయి పేరు భీమ్ రాంజీ అంబావడేకర్.... పేరులోని చివరి వాక్యం మార్చి తనను చాలాసార్లు ఆదుకున్న ఉపాధ్యాయుడి పేరు నిలుపుకున్నాడు. ఇలా తన కృతజ్ఞతలు చూపుకున్నాడు. ఆ అబ్బాయే పెద్దవాడై భారత రాజ్యాంగాన్ని వ్రాశాడు. దళిత జాతుల వైతాళికుడుగా పేరుపొందాడు. ఆయనే డా : బి.ఆర్. అంబేద్కర్.
ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
9912888259 add me
ReplyDelete