Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పంజాబ్ లోని తెలుగు విద్యార్థులను ఇంటికి చేర్చిన ఆర్ ఎస్ ఎస్ - RSS helps Telugu students in Punjab to reach home - megaminds

లాక్ డౌన్ కారణంగా పంజాబ్ లోని జలంధర్ లో చిక్కుకు పోయిన సుమారు వేయి మంది తెలుగు విద్యార్థులు ఆర్ ఎస్ ఎస్ చొరవతో ఇంటికి చేరుకొన...



లాక్ డౌన్ కారణంగా పంజాబ్ లోని జలంధర్ లో చిక్కుకు పోయిన సుమారు వేయి మంది తెలుగు విద్యార్థులు ఆర్ ఎస్ ఎస్ చొరవతో ఇంటికి చేరుకొనే మార్గం ఏర్పడింది. వారిలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన 600 మంది విద్యార్థులు ఒక ప్రత్యేక రైలు ద్వారా ఈ సాయంత్రానికే  విజయవాడకు చేరుకోనున్నారు.

అయితే తెలంగాణకు చెందిన 400 మంది విద్యార్థులను సహితం మరో ప్రత్యేక రైలు ద్వారా తీసుకు రావడానికి రైల్వే శాఖ సిద్ధంగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో జాప్యం జరుగుతున్నది.  జలంధర్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 1000 మంది ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నారు. లాక్ డౌన్ కారణంగా మార్చ్ 22 నుండి హాస్టల్స్ మూసివేసి, బయటకు పంపివేయడంతో, రవాణా సదుపాయం లేక వారక్కడ చిక్కుకు పోయారు. వారిలో కొద్దీ మందికి స్థానిక ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు భోజనం, వసతి ఏర్పాట్లు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న సికింద్రాబాద్ ఆర్ ఎస్ ఎస్ విభాగ్ ప్రచారక్ ఎం యాదిరెడ్డి వారిని సంప్రదించగా మొత్తం 1000 మంది తెలుగు విద్యార్థులు అక్కడ దిక్కుతోచని స్థితిలో, తల ఒక చోట ఉండిపోయారని తెలుసుకున్నారు. వెంటనే బిజెపి ఎంపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, తెలంగాణ బిజెపి ఇంచార్జ్ కృష్ణ దాస్ ల ద్వారా కేంద్ర రైల్వే మంత్రిని సంప్రదించారు. వారికోసం ప్రత్యేక రైళ్లు నడపడానికి రైల్వే మంత్రి అంగీకరించారు. ఆ తర్వాత సంప్రదించగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ప్రత్యేక రైలులో వచ్చేవారిని వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దానితో ఒక ప్రత్యేక రైలులో బుధవారం 600 మంది బయలుదేరారు. ఆ రైలులో మరో 60 బెర్త్ లు ఖాళీగా ఉండగా, తెలంగాణకు చెందిన విద్యార్థులు సహితం కొద్దిమంది బయలుదేరారు. వారు వరంగల్ లో దిగుతారు. అక్కడి నుండి వారిని వారి వారి ప్రదేశాలకు వెళ్ళడానికి ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే తెలంగాణ విద్యార్థులు తిరిగి రావడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా తెలంగాణ ప్రభుత్వం నుండి స్పందన రావడం లేదు. ఆ విద్యార్థులు స్వయంగా మంత్రి కె టి ఆర్ కు, ఇతర ప్రముఖులకు  వాట్స్ యాప్ లో ఎన్ని సార్లు వినతులు పంపినా స్పందించడం లేదు. దానితో వారింకా అక్కడే ఉండిపోయారు. జలంధర్ లోనే రైలు ఎక్కే సమయంలోనే వైద్యుల బృందం వారికి ఆరోగ్య పరిక్షలు జరిపి, వారికి వైరస్ సోకలేదని నిర్ధారించుకున్న తర్వాతనే రైలులో ఎక్కించారు. రైలులో సహితం భౌతిక దూరం, మాస్క్ లు వంటి జాగ్రత్తలు తీసుకొంటున్నారు. అవసరం అనుకొంటూ రైలు దిగే సమయంలో సహితం స్థానిక అధికారులు వారికి మరోసారి ఆరోగ్య పరీక్షలు జరిపించి, వారిని స్వీయ నిర్బంధంలో ఉండేవిధంగా తమ తమ ఇళ్లకు పంపవచ్చని యాదిరెడ్డి తెలిపారు.

ఈ విద్యార్థులు అంతా చిన్నప్పటి నుండి హాస్టల్ లలో ఉంటూ చదువుకొంటున్న వారని, వారెవ్వరికి వంట చేయడం రాదని, అయితే హాస్టల్ నుండి పంపివేయడంతో ఎక్కడో ఒక చోట నీడ సంపాదించి, సొంతంగా వంట చేసుకొంటూ ఎన్నో కష్టాలకు పడ్డారని యాదిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. అయితే నెలన్నర రోజులకు పైగా అంతమంది తెలంగాణ విద్యార్థులు అక్కడ చిక్కుకు పోయిన విషయం ఇక్కడ ప్రభుత్వానికి, మరెవ్వరికీ తెలియక పోవడం విస్మయం కలిగిస్తుంది. విదేశాలలో ఉన్న తమ రాష్ట్రాలకు చెందిన వారిని రప్పించడం కోసం, వలస కార్మికులను పంపివేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాలలో చిక్కుకు పోయిన తమ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల గురించి అసలు పట్టించుకొనక పోవడం ఆందోళన కలిగిస్తుంది.


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments