ఆ గదిని చూడగానే ఒక విద్యార్థిదని తెలుస్తుంది. అతడు యం.యస్.సి. విద్యార్థి. పేరు మాధవరావు, జబ్బుపడి లేచిన వాడిలా ఉన్నాడు. ముఖలలో నీరసంగా...
ఆ గదిని చూడగానే ఒక విద్యార్థిదని తెలుస్తుంది. అతడు యం.యస్.సి. విద్యార్థి. పేరు మాధవరావు, జబ్బుపడి లేచిన వాడిలా ఉన్నాడు. ముఖలలో నీరసంగా ఉన్న ఛాయలు ఉన్నాయి, దీక్షగా చదువుచున్నాడు. పరీక్షలు ఇంకా పన్నెండు రోజులు ఉన్నాయి.
జబ్బుపడిన కారణం చేత పరీక్షలకు కూర్చోకూడదనుకున్నాడు. మిత్రులు హితులు అలా చేయవద్దని కోరారు వారి కోరికను కాదనలేక పరీక్షలకు చదవటం సాగించాడు మాధవరావు రాత్రి, పగలు ఏక దీక్షగా చదువుతున్నాడు. అనారోగ్యాన్ని కూడా లెక్క చేయటం లేదు. దీక్షగా చదువుతున్న అతని కాలికి ఏదో కుట్టినట్లు అనిపించింది. తీరా చూస్తే అది తేలు. విషం పైకి ఎక్కుతున్నది. ఆ విద్యార్థి బాధ భరించలేక పోయాడు.
ఒకవైపు చదువుకు ఆటంకం కలుగకూడదు. ఒక వైపున కాలి బాధ. అతడికి ఓ ఆలోచన కలిగింది. వెంటనే తేలు కుట్టిన చోట చాకుతో గాయం చేశాడు. దాని మీద ఏదో మందు వేశాడు. ఆ కాలిని నీళ్ల బాల్చీలో పెట్టి పుస్తకం పైన ఏకాగ్రత నిలిపాడు. బాధ విషయం మరచిపోయి పాఠంలో లీనమయ్యారు. మిత్రులకు ఈ విషయం తెలిసింది. మాధవరావు గదికి వచ్చారు.
శరీరాన్ని కష్టపెట్టి చదవటం వలన ప్రయోజనం ఏమిటి? విశ్రాంతి తీసుకో! మళ్లీ చదవవచ్చు అని సలహా ఇచ్చారు. మాధవరావు చిరునవ్వు నవ్వాడు. కాలి మీద తేలు కుట్టింది. అంతేకానీ తలలో కాదు. చదువుతున్నది తల కాని కాలుకాదుగదా! అని అన్నాడు. మిత్రులు ఆయనలోని సంయమన శక్తికి ఆశ్చర్యపోయారు. అలా చదివిన మాధవరావు పరీక్షలో ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు. ఆయనే గురూజీ గా పేరు పొందిన మాధవరావ్ సదాశివరావ్ గోళ్వల్కర్.
ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments