అరేబియా సముద్ర తీరంలో పుదుచ్చేరి అనే ప్రదేశం ఉన్నది. ఆంగ్లేయు లు మన దేశాన్ని పాలించే రోజుల్లో ఆ ప్రదేశం ఫ్రెంచి వారి క్రింద ఉండేది. ...
అరేబియా సముద్ర తీరంలో పుదుచ్చేరి అనే ప్రదేశం ఉన్నది. ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించే రోజుల్లో ఆ ప్రదేశం ఫ్రెంచి వారి క్రింద ఉండేది. ఆ రోజుల్లో చాలామంది స్వరాజ్యం కోసం పోరాడుతూ ఉండేవారు. వాళ్ళను జాతీయవాదులు అనే వారు.
వాళ్ళను ఆంగ్ల పాలకులు నానా బాధలు పెడుతూ ఉండేవారు, అందుకని కొందరు పుదుచ్చేరి చేరి తమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉండేవారు. అలాంటి జాతీయవాది ఒకాయన ఆంగ్లేయులు పెట్టే తిప్పలు భరించలేక పుదుచ్చేరి చేరాడు. ఆయన మంచి కవి, ఉత్తమ రచయిత. స్వదేశ మిత్రన్ అనే పత్రిక ఆ రోజుల్లో వస్తూ ఉండేది. జాతీయ భావాలను ఆ పత్రిక ప్రచారం చేసేది, ఆ పత్రిక లో వేడి వేడి రచనలు చేస్తుండేవాడు ఆ జాతీయ కవి.
ఒకనాడు తన ఇంటి వసారాలో కూర్చొని ఏదో వ్యాసం వ్రాసుకుంటున్నాడు. ఆయన భార్య చెల్లమ్మ. బియ్యం చేటలో పోసుకు వచ్చి ఏరుతూ ప్రక్కనే కూర్చున్నది కొంత సేపయ్యాక ఆమె చేట అక్కడే పెట్టి ఇంట్లోకి వెళ్లింది. బిలబిలలాడుతూ పిచ్చుకలు వచ్చాయి. బియ్యాన్ని చెల్లాచెదరు చేస్తూ తినడం సాగించాయి. చెల్లమ్మ తిరిగి వచ్చి ఆ దృశ్యం చూచింది భర్త పైన మండిపడింది.
ఆయన నిర్లిప్తంగా రాసుకుంటున్నాడు. ఏమండీ! అసలే మనం కష్టాల్లో ఉన్నాం! బియ్యం పిచ్చుకలు పాడుచేస్తుంటే చూస్తూ కూర్చున్నారా? అని అన్నది. అసలే గడ్డు రోజులు. ఉన్న బియ్యాన్ని ఇలా వృధా చేసుకుంటే పిల్లలకు తిండి ఎట్లా? అని దుఃఖంతో మాట్లాడలేకపోయింది చూడు చెల్లమ్మా! అవి కూడా మనలాంటి ప్రాణులేకదా? పాపం చిన్న ప్రాణులు ఎంతని తింటాయి. అని ఆమెను ఓదార్చబోయాడు. ఆమె దుఃఖం ఆగలేదు. ఆయన మనస్సు బాధపడింది. కుమార్తెను వెంటబెట్టుకొని వాహ్యాళికి వెళ్లాడు. అక్కడ స్వేచ్ఛగా విహరిస్తున్న పిచ్చుకలను చూచి ఒక గీతం అల్లాడు. చిన్న జీవుల పైన కారుణ్యం చూపిన ఆయనే ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి.
ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments