విష్ణు శ్రీధర్ (హరిబావు) వాకంకర్ ను 1975లో పద్మశ్రీతో భారత ప్రభుత్వం సత్కరించింది, స్వచ్ఛంద సేవకుడు సామాజిక రంగంలో పనిచేశారు...
విష్ణు శ్రీధర్ (హరిబావు) వాకంకర్ ను 1975లో పద్మశ్రీతో భారత ప్రభుత్వం సత్కరించింది, స్వచ్ఛంద సేవకుడు సామాజిక రంగంలో పనిచేశారు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో పనిచేశారు మరియు 1981 లో సంస్కార భారతి అధ్యక్షుడిగా ఉన్నారు.
డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్:
భారతీయ నాగరికత లక్షల సంవత్సరాల పురాతనమైనది మరియు చాలా సంపన్నమైనది. మన నాగరికత మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి, ప్రపంచం నలుమూలల నుండి పరిశోధకలు భారతదేశాన్ని సందర్శించి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిశోధిస్తున్నారు విదేశీయులు. భారతదేశపు ప్రాచీన నాగరికతను ప్రపంచానికి పరిచయం చేయడంలో విష్ణు శ్రీధర్ (హరిభావు) వాకంకర్ పేరు చెప్పుకోదగినది. భోపాల్ నుండి 46 కిలోమీటర్ల దూరంలో, దక్షిణాన భింబట్కా గుహలు ఉన్నాయి. దీని చుట్టూ నాలుగు వైపుల నుండి వింధ్య పర్వత శ్రేణులు ఉన్నాయి. భీంబట్కా గుహలు మహాభారతం లో భీముడికి సంబంధించినవని విశ్వాసం. ఈ కారణంగా, దీనికి భీంబట్కా అనే పేరు కూడా వచ్చింది. వాటిని 1957-1958 సంవత్సరంలో డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ కనుగొన్నారు. ఇందుకోసం ఆయనకు పద్మశ్రీ లభించింది.
భారతీయ నాగరికత లక్షల సంవత్సరాల పురాతనమైనది మరియు చాలా సంపన్నమైనది. మన నాగరికత మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి, ప్రపంచం నలుమూలల నుండి పరిశోధకలు భారతదేశాన్ని సందర్శించి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిశోధిస్తున్నారు విదేశీయులు. భారతదేశపు ప్రాచీన నాగరికతను ప్రపంచానికి పరిచయం చేయడంలో విష్ణు శ్రీధర్ (హరిభావు) వాకంకర్ పేరు చెప్పుకోదగినది. భోపాల్ నుండి 46 కిలోమీటర్ల దూరంలో, దక్షిణాన భింబట్కా గుహలు ఉన్నాయి. దీని చుట్టూ నాలుగు వైపుల నుండి వింధ్య పర్వత శ్రేణులు ఉన్నాయి. భీంబట్కా గుహలు మహాభారతం లో భీముడికి సంబంధించినవని విశ్వాసం. ఈ కారణంగా, దీనికి భీంబట్కా అనే పేరు కూడా వచ్చింది. వాటిని 1957-1958 సంవత్సరంలో డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ కనుగొన్నారు. ఇందుకోసం ఆయనకు పద్మశ్రీ లభించింది.
హరిభావు వాకంకర్ మే 4, 1919న నీముచ్ (మాండ్సౌర్ జిల్లా) మధ్యప్రదేశ్ లో జన్మించారు. వాకాంకర్ కుటుంబం పేరున్న, ప్రసిద్ధ మరియు గౌరవనీయమైన కుటుంబం. వారు 8 తరాలకు పైగా చరిత్రను కలిగి ఉన్నారు. వాకంకర్ కు చరిత్ర, పురావస్తు శాస్త్రం మరియు చిత్రలేఖనంపై ప్రత్యేక ఆసక్తి ఉన్నందున, అతను తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తరువాత ఉజ్జయిని వద్దకు వచ్చి విక్రమశిలా విశ్వవిద్యాలయం నుండి చదువు పూర్తి చేశారు. తరువాత అక్కడే ప్రొఫెసర్ అయ్యారు. జె జె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో ఫైన్ ఆర్ట్స్ పి.జి చదివారు. ఉజ్జయిని సమీపంలోని దంతేవాడ గ్రామంలో పురావస్తు తవ్వకాలలో ఆయన ఎంతో శ్రమించారు. అతను 1958 లో ఒకసారి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అతను ఆ మార్గంలో కొన్ని గుహలు మరియు రాళ్ళను చేశారు. తోటి ప్రయాణికులను అడిగినప్పుడు, ఇది భీంబట్కా (భీమా సిట్కా) అని పిలువబడే ప్రాంతం అని మరియు గుహ గోడలపై కొన్ని చిత్రాలు ఉన్నాయని తేలింది, కాని అడవి జంతువులకు భయపడి ప్రజలు అక్కడికి వెళ్లరు.
ఇది విన్న హరిభావు కళ్ళలో ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తి మొదలయ్యింది. రైలు నెమ్మదించినప్పుడు, అతను కదిలే రైలు నుండి దూకి, ఆ కొండలను చేరుకోవడానికి గంటల తరబడి ఎక్కారు. అక్కడ ఉన్న చిత్రాలను ఆయన ప్రపంచానికి పరిచయం చేయడం మొదటిసారి. ఈ ఆవిష్కరణ అతనికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది మరియు భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
బీంబట్కా గుహలు పాలియోలిథిక్ మానవుల జీవితాన్ని వర్ణిస్తాయి, హరిభావు కనుగొన్న ఈ గుహలలోని చిత్రాలు రాతియుగం మానవుల జీవితాన్ని వర్ణిస్తాయి. ఇక్కడ సుమారు 500 గుహలు ఉన్నాయి. భీంబట్కా గుహలలోని చాలా ఛాయాచిత్రాలు ఎరుపు మరియు తెలుపు రంగులతో చిత్రీకరించబడ్డాయి. కొన్ని ప్రదేశాలలో పసుపు మరియు ఆకుపచ్చ చుక్కలు కూడా ఉపయోగించబడ్డాయి. వన్యప్రాణుల వేట దృశ్యాలు కాకుండా, గుర్రాలు, ఏనుగులు, పులులు మొదలైన చిత్రాలను గుహలలో చెక్కారు. ముఖ్యమైన సమాచారం రాళ్ళపై వ్రాయబడింది.
మొత్తం 750 గుహలు ఉన్నాయి, వీటిలో 500 గుహలు చిత్రాలతో అలంకరించబడ్డాయి. ఈ ప్రదేశం రాతి యుగం నుండి మధ్య చారిత్రక కాలం వరకు మానవ కార్యకలాపాల కేంద్రంగా ఉంది. ఈ విలువైన వారసత్వం ఇప్పుడు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. భీంబట్కా ప్రాంతంలోకి ప్రవేశిస్తే, రాళ్ళపై రాసిన అత్యంత విలువైన సమాచారం పురాతత్వ శాఖకు లభించింది మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ రాక్ పెయింటింగ్స్ యొక్క అంశాలు ప్రధానంగా సమూహ నృత్యాలు, అండర్లైన్డ్ హ్యూమనిజం, వేట, జంతు-పక్షులు, యుద్ధం మరియు ప్రాచీన మానవ జీవితపు రోజువారీ కార్యకలాపాలకు సంబంధించినవి. చిత్రాలలో ఉపయోగించే ఖనిజ రంగులు ప్రధానంగా ఎరుపు మరియు తెలుపు మరియు కొన్నిసార్లు పసుపు మరియు ఆకుపచ్చ రంగులు కూడా ఉపయోగించబడ్డాయి. ఇక్కడ గోడలు మతపరమైన చిహ్నాలతో అలంకరించబడి ఉన్నవి, ఇవి చాలా పూర్వకాలపు చారిత్రక కళాకారులతో ప్రసిద్ది చెందాయి. ఈ విధంగా భీమా సిట్కా యొక్క ప్రాచీన మానవుల విజ్ఞాన వికాసం యొక్క కాలక్రమం ప్రపంచంలోని ఇతర పురాతన ప్రదేశాలకు వేల సంవత్సరాల ముందు జరిగింది. అందువలన ఈ పూరాతత్వ బీంబట్కా ప్రదేశం మానవ అభివృద్ధికి ప్రారంభ బిందువుగా కూడా పరిగణించబడుతుంది. దీనిని మన హరిబావు వాకంకర్ ప్రపంచంకు పరిచయం చేయడం జరిగింది.
ఇంతే కాకుండా వారు కాళ్ళకు చక్రాలు ధరించి దేశం అంతా తిరిగి భారతదేశ నిజమైన చరిత్రను వెలికితీశారు. మృదు స్వభావి మాటాల్లో తియ్యదనం ఉట్టిపడేది. తన హృదయంలో దేశం కోసం ఎదో చేయాలనే తపన ఒక అగ్నిలా ప్రజ్వరిల్లేది. సామాజిక రంగంలో కూడా చురుకుగా ఉండేవారు, శ్రీధర్ వాకాంకర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ స్వయంసేవక్ కావడంతో సామాజిక రంగంలో కూడా చురుకుగా పనిచేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్ కౌన్సిల్, మధ్యప్రదేశ్. అధ్యక్షుడిగా ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ స్థాపించిన తరువాత 1966 లో ప్రయాగ్‌లో మొదటి ప్రపంచ హిందూ సమావేశం జరిగినప్పుడు, శ్రీ ఏక్ నాథ్ రణడే అతన్ని అక్కడికి పంపారు. తరువాత హరిభావు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్ళారు. భారతీయ సంస్కృతి, కళ, చరిత్ర, సైన్స్ మొదలైన వాటిపై ఉపన్యాసాలు ఇచ్చారు. 1981 లో సంస్కార భారతి స్థాపించబడినప్పుడు, ఆయనను దానికి ప్రధాన కార్యదర్శిగా నియమించారు, ఆర్ ఎస్ ఎస్ వారు. భారత దేశం స్వాతంత్ర్యం సాధించిన తరువాత మన చరిత్రను వ్రాసే పనిలో కమ్యునిష్ట్ లు ఉన్నందువలన మన చరిత్ర వక్రీకరిణ జరిగింది అనే విషయం అందరీకీ తెలుసు, వాస్తవ చరిత్రను వెలికితీయడానికి ఇతిహాస సంకలన సమితి పని చేస్తుంది. దీనికి వాకంకర్ గారి ప్రేరణ ఎంతో ఉంది.
వాకాంకర్ 1983 లో కురుక్షేత్రంలో ఆర్ఎస్ఎస్ అనుభవజ్ఞుడైన మొరోపంత్ పింగళేతో కలిసి 18 మంది బృందంతో సరస్వతి శోధ్ అభియాన్‌ను ప్రారంభించారు. వారు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలు ప్రయాణించి, సరస్వతి నది అంతర్వాహినిగా ఇందని తేల్చారు, ఇది ఇతర నది కంటే చాలా చరిత్ర కలిగిన నది అని సింధు లోయ నాగరికతకు ‘సర-స్వత్ నాగరికత’ అని పేరు మార్చాలని ఆయన సూచించారు.
1988 ఏప్రిల్ 3వ తేదీనా ఒక సమ్మిట్ లో పాల్గొనడానికి సింగపూర్ వెళ్ళారు, అక్కడ ఉపన్యాసం తరువాత కూర్చిలో ఒక్కసారిగా కూలపడిపోయారు, ఆఖరిశ్వాస వరకు దేశం గురించే ఆలోచన చేస్తూ అక్కడిక్కడే మరణించారు. ఆ తరువాత పద్మశ్రీ డాక్టర్ వి.ఎస్.వాకంకర్ పేరిట జాతీయ అవార్డు ఏర్పాటు చేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. 2003 లో వాజ్ పాయ్ గారు సరస్వతి నదికి సంబంధిత పరిశోధనలు జరపడానికి కూడా వాకంకర్ గారే ప్రేరణ. చివరగా వారి గురించి ఒక గొప్ప మాట ఏ ఇందిరాగాంధీ అయితే ఆర్ ఎస్ ఎస్ ని నిషేదించిందో ఆమె చేతులమీదుగా ఆర్ ఎస్ ఎస్ గణవేషలో బాగమైన నల్ల టోపీ ధరించి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు..
No comments