కరోనా వైరస్ విజృంభిస్తోన్న దశలో మహమ్మారిని ఎదుర్కోవడానికి స్వీయ జాగ్రత్తలతోపాటు, రోగ నిరోధకశక్తిని పెంపొందించుకోవడమూ ముఖ్యమే. అ...
ద్రవ పదార్థాలు
తగినంత నీరు శరీరంలో ఉంటే విషతుల్యాలను శరీరం వెలుపలికి పంపించడం సులభమవుతుంది. ముక్కు, శ్వాస నాళాల్లో జిగురు పదార్థం నిలకడగా ఉండి, వైరస్‌ను లోనికి వెళ్లకుండా అడ్డుకుంటుంది.
తీసుకోవాల్సినవి: తాగునీరు, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, గ్రీన్ టీ, హెర్బల్ టీ, సూప్‌లు, పాలు, మజ్జిగ, తీపి, ఉప్పు లేని ద్రావణాలు, పండ్లు, కూరగాయలు.
ప్రొటీన్లు
ఇవి మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి.
తీసుకోవాల్సినవి: సోయా ఉత్పత్తులు, ఉప్పు కలపని గింజలు, విత్తనాలు, బీన్స్, పప్పు దినుసులు, గుడ్లు, చికెన్, మటన్, చేప, పాలు, పాల ఉత్పత్తులు.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్
రోగ నిరోధక కణాల పనితీరును మెరుగుపరుస్తాయి
తీసుకోవాల్సినవి: వాల్‌నట్స్, గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు విత్తనాలు, చేపలు.
విటమిన్ ఎ
నోరు, జీర్ణాశయం, పేగులు, శ్వాసకోశ వ్యవస్థలోని చర్మాన్ని, కణజాలాన్ని రక్షిస్తుంది.
తీసుకోవాల్సినవి: చిలగడదుంప(స్వీట్ పొటాటో), క్యారట్, మామిడి, బొప్పాయి, గుడ్లు, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తులు.
విటమిన్ డి
హానికారక అతి సూక్ష్మక్రిముల సంహారానికి, శరీరానికి మేలు చేసే సూక్ష్మక్రిముల వృద్ధికి దోహదపడుతుంది.
తీసుకోవాల్సినవి: పాలు, పాల ఉత్పత్తులు. ఉదయం వేళల్లో శరీరంలోని 18 శాతం భాగాన్ని సూర్యరశ్మి స్పృశించేలా చూసుకోవడం. కొవ్వున్న చేపలు, గుడ్లు, మాంసంలో కాలేయం.
విటమిన్ ఇ
యాంటీ ఆక్సిడెంటుగా పనిచేస్తుంది. ముఖ్యంగా వృద్ధుల్లో రోగ నిరోధకతను పెంపొందించడంలో దోహదం చేస్తుంది.
తీసుకోవాల్సినవి: పొద్దు తిరుగుడు, కుసుంభ, అవిసె గింజలు, బాదం, పిస్తా.
విటమిన్ బి6
జీర్ణకోశ రోగ నిరోధకతను క్రమబద్ధీకరిస్తుంది. విషపూరిత చర్యల్ని తగ్గిస్తుంది.
తీసుకోవాల్సినవి: సోయాబీన్, పప్పులు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అరటి, మునగ, మెంతి ఆకులు, కరివేపాకు, ఉప్పుడు రవ్వ.
విటమిన్ బి12
రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
తీసుకోవాల్సినవి: చేపలు, మాంసం, చికెన్, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు.
విటమిన్ సి
యాంటీబాడీస్‌ను ప్రేరేపిస్తుంది. కణాల పనితీరును మెరుగుపరుస్తుంది.
తీసుకోవాల్సినవి: ఆకుపచ్చని కూరగాయలు, జామ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష తదితర పుల్లని పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్, నిమ్మ.
ఖనిజ లవణాలు (మినరల్స్)
జింకు, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి వైరస్ ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
తీసుకోవాల్సినవి: అన్ని రకాల గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, సోయాబీన్, పుచ్చకాయ విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, చికెన్, గుడ్లు, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, చేపలు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments