Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కెరే కామె గౌడ జీవిత చరిత్ర - Kere Kame Gowda Life Story - MegaMinds

భారత ప్రధాని 28 ఆదివారం జూన్ 2020 రోజున మన్ కీ బాత్ లో ప్రస్తావించిన ఒక గొర్రెల కాపరి కథ ఇది. కర్ణాటకలోనీ మలవల్లి, కుండినిబెట్ట ...

భారత ప్రధాని 28 ఆదివారం జూన్ 2020 రోజున మన్ కీ బాత్ లో ప్రస్తావించిన ఒక గొర్రెల కాపరి కథ ఇది. కర్ణాటకలోనీ మలవల్లి, కుండినిబెట్ట అనే చిన్న గ్రామంలో 16 చెరువులను ఒంటరిగా తవ్వించిన పర్యావరణ శాస్త్రవేత్త కామెగౌడ కథ ఇది.

‘కేరే’ (సరస్సు) సహజంగానే అతని పేరుకు ముందే ఉండేది. ఈ మధ్యకాలంలో అతను వివిధ అవార్డుల ద్వారా వచ్చిన ధనాన్ని కూడా అతను దానిని వ్యక్తిగత వినియోగానికి ఖర్చు పెట్టడానికి బదులు, కార్మికులకు మరియు ఆధునిక పరికరాలను తీసుకోవడానికి ఉపయోగించి మరెన్నో సరస్సులను తవ్వించాడు. ఇలా వచ్చిన ధనంతో పర్యాటకులను కొండకు తీసుకెళ్లడానికి ఒక చిన్న రహదారిని కూడా నిర్మించాడు. అతని పిల్లలు ఇప్పటికీ ఎటువంటి సౌకర్యాలు లేకుండా చిన్న హట్టిలలో(గుడిసెలు) ఉంటారు, మరియు వారి జీవనోపాధి కోసం గొర్రెలను మేపుతారు. పూరి గుడిసెల్లో ఉంటూ కూడా కొండకు రక్షణగా నిలబడ్డారు ఎందుకంటే తనకు కొండలన్నా పర్యావరణమన్నా అమితమైన ఇష్టం.

కామెగౌడ మొదట ఈ కొండపై 40 సంవత్సరాల క్రితం చెరువులను తవ్వడం ప్రారంభించాడు. అతను సహజంగా గొర్రెల కాపరి కావడం వలన గొర్రెలను మేకలను కొండపైకి తీసుకెళ్లేవాడు గొర్రెలకు మేకలకు నీళ్ల కోసం చూస్తే ఎక్కడా నీటి గుంటలు కనిపించలేదు ఆ విధంగా మేకలకు గొర్రెలకు ఏదో రకంగా నీళ్లు అందించి దాహం తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఇక అప్పటినుండి గొర్రెలను మేస్తున్న సమయంలో తన దగ్గర ఉండే కర్రతో నీటి జాడలు ఉన్న ప్రదేశంలో తవ్వడం ప్రారంభించారు అలా తవ్వి తవ్వి అలసిపోయాడు ఎన్నో రోజులకు ఒక ఒక గంటలో నీరు రావడం జరిగింది. అలా వచ్చిన నీటితో మేకలకు గొర్రెలకు మొదట దాహం తీర్చాడు. ఆ గుంట లో నీరు రాగానే తనకు అనిపించింది ఇక్కడ నీటి జాడలు ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్ద చెరువులు తవ్వుతూ ఒకదానికి ఒకటి అనుసంధానం చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ తన దగ్గరున్న కర్రతో తవ్వడం వలన ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి అతను తవ్వే పరికరాన్ని మార్చాలని అనుకున్నాడు వెంటనే తన గొర్రెల్లో ని రెండు గొర్రెలు అమ్మి ఇనుప వస్తువులు తీసుకొచ్చారు వాటితో మరలా గుంతను పెద్దగా చేశారు.

అలా ఒక చెరువు తవ్విన కామె గౌడ మనసులో లో కొండ పైన ఉన్నటువంటి జంతువులు జీవరాశులు గుర్తుకు వచ్చాయి ఇలా అనేక చెరువులు తవ్వడం వల్ల జంతువులు అన్నిటికీ దాహం తీర్చాలని ఆలోచన వచ్చింది వెంటనే తవ్వినా చెరువుకు అనుసంధానం చేస్తూ ఇంకో చెరువు తవ్వడం మొదలు పెట్టాడు. ఇలా 2017 వరకు ఒక చెరువుకి ఇంకొక చెరువుని అనుసంధానిస్తూ ఆరు చెరువు తవ్వాడు అదే సమయంలో సినిమా హీరో కిచ్చా సుదీప్ తనకు ఆర్థిక సహాయం చేశాడు. ఆ ఆర్థిక సహాయం మొత్తాన్ని కూడా కామె గౌడ మరో ఆరు చెరువులు తవ్వడానికి ధనాన్ని వినియోగించాడు చూడండి ఒక పేదవాడు అయివుండి కూడా గొర్రెల కాపరి తనకున్న డబ్బునంతా తనకు సహాయం చేసిన డబ్బునంతా కొండ మీద ఉన్నటువంటి జంతువుల కోసం పక్షుల కోసం అలాగే కొండ సంరక్షణ కోసం గుంతలు తవ్వి చెరువులు నిర్మించి ఒక దానికొకటి అనుసంధానిస్తూ 16 చెరువులు తవ్వాడు. కొండపైకి వెళ్లడానికి ఒంటరిగా రహదారిని కూడా నిర్మించాడు. 2018 కాలంలో అక్కడే రెండు వేల పైబడి మర్రి చెట్లను నాటాడు. 

కామె గౌడ చదువుకోనప్పటికీ భారత పురాణాలు ఇతిహాసాల పై లోతైన అధ్యయనం కలవాడు అందుకే అనుకుంటా మొదట తవ్విన చెరువుకు గోకర్ణ అని అనుసంధానం చేసిన చెరువులకు రామ లక్ష్మణ్ పేర్లు కూడా పెట్టాడు. 84 సంవత్సరాల వయస్సులో కూడా, కెరె కామెగౌడ ఆరోగ్యంగా ఉన్నాడు, కొండపైకి మరియు క్రిందికి సులభంగా ఎక్కి దిగుతాడు.  అతను రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. కొండపై గత నలభై సంవత్సరాలుగా కనీసం 12 గంటల పైన గడుపుతాడు, రాత్రి మాత్రమే పడుకునే సమయంలో గుడిసె కు వస్తాడు. తన కుమారుడు శ్రీకృష్ణుడు పదవ తరగతి తర్వాత తండ్రి బాటలోనే నడుస్తూ కొండను సంరక్షిస్తూ గొర్రెలను కాసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మైసూరుకు చెందిన సామాజిక కార్యకర్త జయరామ్ పాటిల్ కంటి శుక్లాల ఆపరేషన్కు సహాయం చేశారు.

కేరె కామెగౌడను ప్రత్యేకత ఏమిటంటే, అతను తన సంపాదన మొత్తాన్ని చెట్లు, సరస్సులు మరియు కొండపై ఖర్చు చేసాడు.  మానవులు డబ్బు కోసం మరింత అత్యాశతో మారుతున్నప్పుడు, అతను మనకు నిజమైన మార్గాన్ని చూపుతున్నాడు అంటారు ఆ ప్రాంత ప్రజలు అలాగే కెరే అంటే సరస్సు అని ముద్దుగా ఈ ప్రాంత ప్రజలంతా పిలుచుకుంటారు కామె గౌడ్ ను.

కెరె ఎప్పుడూ చొక్కా, చడ్డీ మరియు శాలువతో కొండ మీద చూడవచ్చు.  సాధారణంగా అతను ఇతరులు దానం చేసిన దుస్తులను ధరిస్తాడు. గడ్డం తో ఉంటాడు. అతను సపోర్ట్ స్టిక్ తో నడుస్తాడు. కంటిశుక్లం తప్ప కేరే కామెగౌడ కు ఎటువంటి ఇబ్బందులు లేవు ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉన్నాడు. కేరె కామెగౌడకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను తన పెద్ద కుమారుడు కృష్ణుడితో కలిసి ఉంటున్నాడు. కెరె కామెగౌడ తన మనవరాళ్ల సహాయంతో కొండ మీద రాతి స్తంభాలపై అటవీ, జీవావరణ శాస్త్రం, సరస్సు రక్షణకు సంబంధించిన సామెతలు రాశారు.  అతను తన మనవడికి ఒక సరస్సు పేరు పెట్టాడు. ముడ్డే, అంబాలి మరియు రోటీలతో సహా వేలి మిల్లెట్ తయారు చేసిన ఆహార పదార్థాలను కేరె కామెగౌడ ఇష్టపడతారు. ఇదండీ పెద్ద మనసున్న  కామె గౌడ కథ. పర్యావరణాన్ని రక్షించడమే మన బాధ్యత గా తీసుకుందాం. జై హింద్.
ఇలాంటి జీవిత చరిత్రల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

2 comments