కేవలం విగ్రహా రాధన చేసే వాళ్ళే నిజమైన హిందువులా? అది ఎంత మేరకు నిజం? (1 ) ధర్మం లో విగ్రహాలు నిగ్రహ ఏకాగ్రతకు ప్రతిరూపం. దేవాలయ...
కేవలం విగ్రహా రాధన చేసే వాళ్ళే నిజమైన హిందువులా? అది ఎంత మేరకు నిజం?
(1 ) ధర్మం లో విగ్రహాలు నిగ్రహ ఏకాగ్రతకు ప్రతిరూపం. దేవాలయాల నిర్మాణం కూడా పాజిటివ్ ఎనర్జీ నీ ఒక స్థలం లో నిర్బంధించేల పూర్తి వేద గణిత ప్రకారం నిర్మిస్తారు. మనం గుడికి వెళ్ళడం, అక్కడ గల పూజ విధానం వెనుక పూర్తి శాస్త్రీయ మైన కారణాలు వుంటాయి. అందుకే మనం గుడికి వెళ్తాం.
(2) కొందరు యజ్ఞ, యాగాలు చేస్తారు దానిలో వాడే సమిధలు నుంచి వెలువడే వాయువులు, కాలుష్యాన్ని నిర్మూలించి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
(3) కొందరు నీటిని పూజిస్తారు, చెట్లను పూజిస్తారు. జంతువులను పూజిస్తారు. ఈ తత్వం పూర్తి ప్రకృతి తత్వానికి మనుషులకు మధ్య గల సబందాన్ని ద్విగునీకృతం చేస్తాయి.
(4) యోగ, జపం అనేది పూర్తి వాయు శక్తికి ప్రతిరూపం. వాటిని సాధన చేయడం ద్వారా మన ఆరోగ్యం మెరుగు పడటమే కాదు పూర్తి పరమతత్వ భావాన్ని అనుగ్రహించవచ్చును. అందుకే చూడండి ప్రముఖ కాలజ్ఞాని వీర బ్రహమేంద్రస్వామి క్రియా యోగ నిష్టీతులు, మహా అవతార్ బాబాజీ హట యోగ నిష్టీతులు. యోగ సాధన ద్వారా కాల జ్ఞానాన్ని రచించి అంత నైపుణ్యం సంపాదించారు కాలజ్ఞాని వీర బ్రహమేంద్రస్వామి.
నేటికీ యోగ సాధన ద్వారా హిమాలయాలలో ఆహారం లేకుండ వందల సంవత్సరాలు గాలినే ఆహారంగా తీసుకునీ జీవిస్తున్నా యోగులు ఇప్పటికీ వున్నారు.
విగ్రహారాధన భూమికి, యజ్ఞ యాగాలు సూర్యునికి, పుష్కరాలు, కుంభమేల, నదీ తీర పూజ యాత్రలు నీటికి, యోగ, జపాలు గాలికి, ధ్యానం పూర్తి నిశబ్దంతో ఆకాశానికి సంకేతాలు. ప్రకృతి పట్ల సభంధంతో విధేయతను పెంచేది మన ధర్మం.
నాస్తికత్వంకి, వేదాంతానికి చాలా కొద్ది వ్యాసి లోనే సంభంధం వుంటుంది. ఒక్కసారి మీరు వేదాంతాన్ని చేదిస్తే నాస్తికులకు సైతం పూర్తి అపారకమైన శాస్త్రీయ దృక్పధం అలవడుతుంది.
కొంతమంది విగ్రహాలను పూజించరు, యోగ, జప, ధ్యాన సాధన చేస్తారు. మరి కొందరు చెట్లను, జంతువులను, పూజిస్తారు. మరి కొందరు యజ్ఞ యాగాలు చేస్తారు. ఇందులో ఏది ఒక్కటి ఎవరు చేసినా అది పూర్తి ధర్మం లోని త్వత్వమే. ప్రతి ఒక్కరూ విగ్రహారాధన మాత్రమే చెయ్యాలి అనే బోధన లేదు.
కాబట్టి యోగ యొక్క అంతిమ లక్ష్యం పూర్తి శాస్త్రీయ నైపుణ్యంతో ఆ పరమాత్మ తత్వాన్ని పొందడమే. -పనాస రాజబాబు వర్మ.
No comments