Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పల్లెకు పోదాం రైతుకు భరోసా ఇద్దాం, ఆరోగ్యంగా ఉందాం - గణేశ్ బాబు కుడితిపూడి. MegaMinds

కరోనా పాఠాలు: రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారి దరిచేరని కరోనా! సామాజిక సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలయిన  పట్టణాలలో  అధిక ప్రభ...

కరోనా పాఠాలు: రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారి దరిచేరని కరోనా! సామాజిక సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలయిన  పట్టణాలలో  అధిక ప్రభావం చూపిన కరోనా!  ఇదే కాకుండా, ఇలాంటి మరిన్ని మహమ్మారి వైరస్ లు ముందు ముందు  మానవాళి వెంటపడే అవకాశాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. 

కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న వేళల్లోనూ,  భారతీయులకు చక్కగా అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు, పండ్లు!  కరోనా సోకిన వారిని  క్వారంటిన్ లో పెట్టి,  రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు కావాల్సిన ఆహారం మరియూ ఆహార ఉత్పత్తులు అందించిన రైతు ధన్యుడు.
కానీ మున్ముందు గ్రామాలలో వరిచేను నాటడానికి 40 సం.లలోపు ఆడవారు లేరు. పల్లెటూరు వ్యవసాయం
చేయడానికి, కూలిపనికి యువకులులేరు. కొబ్బరి, తాటి చెట్టు ఎక్కేవారు లేరు. పశువులను పెంచడానికి రైతులు ఇష్టపడుట లేదు. వెరసి, తరువాత తరం వ్యవసాయానికి
సిద్ధంగా లేరు. కొన్ని సం.ల తరువాత రైతు ఉంటారా ఈదేశంలో!? అప్పుడు తెలుస్తుంది కూడు, పాలు, పెరుగు ఎక్కడనుండి వస్తుందో!  వస్తాయి. తప్పకుండా వస్తాయి. 
ప్రయోగశాలలో పండిస్తారు. డైరీ పరిశ్రమ పెట్టీ పాశ్చాత్యుల వలె "జీర్ణకోశము నకు మేలు చేసే బ్యాక్టీరియా(  ప్రోబయోటిక్ ఆహారం)" కోసం వెంపర్లాడటం కూడా చూస్తాం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు.

దీన్నిబట్టి భారతీయులు నేర్చుకోవాల్సినవి!  పెరుగుతున్న పట్టణ జనాభాను నియంత్రించాలి. దీనికోసం గ్రామీణ నేపథ్యం ఉండీ, గ్రామాలలో ఇంకనూ పెద్దల ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తులు కలవారు తిరిగి పల్లెబాట బట్టి పల్లెలలో లేక ఆయా మండల కేంద్రాల్లో  స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవచ్చును. ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ఆలోచించే వారిని ప్రోత్సహించ వచ్చును. 

అన్నం పెట్టే రైతుకు కూడా పట్టెడన్నం దొరికేవిధంగా చేయడానికి చంద్ర మండలంపైకి వెళ్లేంత శ్రమపడాల్సిన పనిలేదు. పొరుగు చేనులో కంటే తన చేనులో ఒక బస్తా ఎక్కువ పండించాలి అనే ఒక "అమాయకమైన పట్టుదల" తో ఉండే వాడే రైతు. ప్రభుత్వ విధానాలు, పాలకుల ఆలోచనలకు తోడు రైతులకు, శాస్త్ర సాంకేతిక చదువులు చదువుకున్న వారూ మరియు  అనుభవజ్ఞుల తోడు కూడా చాలా అవసరం. పొలం తీరుకు తగ్గ ఎరువులు ఎలా వాడటం, భీమా పథకాల నుంచి రైతుల సమస్యలను తీర్చడం.. మొదలగు కార్యక్రమాలు చదువుకున్న వారి తోనే సాధ్యం. సాగుచేస్తున్న పంటకే కాకుండా, నారుమడులకు, నూర్పిడి చేసిన తరువాత వచ్చే ధాన్యపు రాశులకు కూడా భీమా చేయించుకో వచ్చును ఈ రోజుల్లో. ఈ విషయాలే కాక, బ్యాంకింగ్ సహాయం వంటి ఎన్నో విషయాలపై అవగాహన కోసం  చదువుకున్నవారి అవసరం పల్లెవాసులకు చాలా ఉన్నది.  ‘‘మన దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయలేమా? కేంద్రం మరియూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేద్దాం. 2022 నాటి కల్లా దీన్ని సాధ్యం చేయగలం’’ అంటూ రాజ్యసభ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఇది.  పల్లెల్లో రూపాయి ఎక్కువగా తిరుగుతూ ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది.
పల్లెల్లో నివసించే వారికి స్వచ్ఛమైన గాలి, వెలుతురు,  ఆనందకరమైన ప్రకృతి, తాజా ఆహారపదార్ధములు లభించడమే కాకుండా మానవ సమాజం ప్రాథమిక సాపేక్ష సంబంధం (ప్రైమరీ రిలేషన్ షిప్) కలిగి ఉంటుంది. అదే నగరాలలో అయితే ద్వితీయ సాపేక్ష సంబంధం ( సెకండరీ రిలేషన్ షిప్) ఉంటుంది. ఉదాహరణకు మనం ఇలా చెప్పుకోవచ్చు. గ్రామాలలో రాత్రి వేళ పక్కింటి పసి బిడ్డ ఏడుపు వినబడితే, వెంటనే లేచి పాప ఎందుకు ఏడ్చింది అని అడుగుతారు. నగరాలలో అలా వినిపించే ఏడుపు వలన  కలిగే నిద్రాభంగం తో కించిత్ ఆవేదన చెందుతారు. 
గ్రామాలలో ఉన్న హిందూ దేవాలయాలు చాలా పురాతనమైనవి, చారిత్రాత్మక మైనవి, ఆగమశాస్త్ర నియమాల ప్రకారం నిర్మించినవి.  భూములు, ఆదాయం ఉన్నప్పటికీ భక్తుల ప్రోత్సాహం కొరవడి ఉంటున్నాయి. మరోప్రక్క నగరాలలో చిన్న చిన్న దేవాలయాలలో కూడా ఉద్రిక్త భరితమైన వాతావరణంలో దర్శనాలు చూస్తున్నాం.  మరో విషయం ఏమంటే పల్లెలలో ఈమధ్య మత మార్పిడి చేసే వారు ఆనాయాసంగా ప్రవేశించి "స్వామి కార్యం", తమ జీవన ప్రమాణాలను(అందిపుచ్చుకున్న స్వచ్చమైన ఆహారంతో)  పెంచుకుంటూ "స్వకార్యం"  తీర్చేసుకుంటున్నారు. ఈ హిందూ దేవాలయ వ్యవస్థ కూడా విశ్రాంత జీవనం గడిపే హిందూ సమాజం వారి చేయూతతో మరలా జీవం పొందగలుగుతుంది.

విజ్ఞులైన వారు ఇప్పటికైనా గ్రామాల వైపు దృష్టి మరల్చి, మీ తల్లదండ్రులను పల్లెలకు పంపండి వారికి ఆరోగ్య భరోసా ఇవ్వండి ప్రశాంతత ఇవ్వండి, పెద్దలూ మీరూ బ్రతికిన నాలుగురోజులు ప్రశాంతంగా బ్రతకడం తో బాటు, ఆయా గ్రామాల పూర్వవైభవం కొసమూ, తద్వారా దేశ వైభవానికి తోడ్పాటు అందించ గలరని ఆశిస్తున్నాను.

ఇట్లు... చదువులు చదివి, ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ, విశాఖ నగరాలలో డబ్బు మాధుర్యం తప్ప అన్నీ కోల్పోయి 50 వ యేటనే విశ్రాంత జీవనం పల్లెకు సమీపాన గడుపుతున్న.
గణేష్ బాబు కుడితిపూడి.,
బేతపూడి గ్రామం, రేపల్లె మండలం,
గుంటూరు జిల్లా. 

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

3 comments

  1. అద్బుతం గా ఉందండి...

    ReplyDelete
  2. వీలయిన వారంతా పల్లె ప్రగతికి తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నాను 🙏

    ReplyDelete
  3. ఆలోచనలు అద్భుతం

    ReplyDelete