Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పర్యావరణ నాశనం కావడానికి కారకులెవరో తెలుసా? - paryavarana parirakshana in telugu - MegaMind

పర్యావరణ దినోత్సవాన్ని  ఆయా దేశాల ప్రభుత్వాలు, కొంత మంది ప్రజలు  ప్రతి సంవత్సరం జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు. పర్యావరణానికి ...

పర్యావరణ దినోత్సవాన్ని  ఆయా దేశాల ప్రభుత్వాలు, కొంత మంది ప్రజలు  ప్రతి సంవత్సరం జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ద్వారా నడపబడుతుంది. ఈ రోజున మానవ, పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం ప్రారంభించింది. 
1972 జూన్ 5 వ తేది నుంచి 16 వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవమును జూన్ 5 తేదిన వేర్వేరు నగరాలలో విభిన్న రీతులలో అంతర్జాతీయ వైభవంగా జరుపుకుంటున్నారు.

పర్యావరణ దినోత్సవం రోజు ముఖ్యంగా చెట్లను పెంచండి అంటూ ప్రకటనలు చేస్తూ.. ప్రతి సంవత్సరం పెట్టిన చోటనే చెట్లను పెడుతూ ఫోటోలకు ఫోజులనిస్తూ  ఆ రోజుకు పర్యావరణ దినోత్సవం కార్యక్రమం పూర్తయిపోయింది అనుకుంటే కుదరదు. పర్యావరణము గాలి నీరు భూమి అగ్ని ఆకాశం ఇలా పంచభూతాలతో కూడుకున్న పృథ్వీమతల్లి.  ప్రకృతి మొత్తానికి మొత్తంగా అపరిశుభ్రమై పోతున్నది, అపవిత్రమై పోతున్నది.. కారణం ఎవరో వెతకుదాం. ఎందుకు ఇలా ప్రకృతిని నాశనం చేస్తున్నారో నిలదీద్దాంరండి. 

ప్రకృతిని నాశనం చేయడం సృష్టిలోని జీవరాశులలో దేనికీ సాధ్యం కాదు. కేవలం ఒక్క మానవుడికే సాధ్యమైంది. అసలు మానవుడెందుకు ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు.?
 పర్యావరణాన్ని నాశనం చేసిన దానికి పరిణామదుఃఖాన్ని అనుభవిస్తూ  కూడా అదే తప్పు మాటిమాటికీ ఎందుకు చేస్తున్నాడు.? మానవజాతి సహజసిద్ధమైన ప్రేమ కరుణ జాలిని మరిచి దారి తప్పుతున్నాడెందుకు.? ఘోరమైన తప్పును చేయడానికి పురికొల్పుతున్నది ఎవరు?మానవుని మస్తిష్కం నిండా మాలిన్యాన్ని కూరినది ఎవరు.?

సమస్యకు మూలాన్ని తెలుసుకుని ఆలోచనా సరళిని మార్చుకొని  వ్యవహరిస్తేనే, మానవాళి మస్తిష్కంలోని మాలిన్యాన్ని కడిగి వేస్తేనే భవిష్యత్తులో బ్రతుకు బండి సవ్యంగా సాగుతుంది. చెట్టుకు మంచి కాయలు రావాలని  నీళ్లను ఆకులకు, కొమ్మలకు త్రాగించడానికి ప్రయత్నం చేస్తే అది పాశ్చాత్య దేశాల పద్ధతులు గానే ఉంటాయి. పర్యావరణ అసంతులనానికి కారణం మనిషి అంటే  పైకి కనిపించే భౌతిక శరీరం మాత్రమే ఇవి మాత్రమే తెలుసుకోగలిగిన పాశ్చాత్యులు మనిషి అంటే  భౌతిక శరీరంతో పాటు మనసు  బుద్ధి ఆత్మ కలిగి ఉంటాడని  వీటన్నింటికీ వేరువేరుగా  భోగము సుఖము సంతోషము ఆనందము అందించవలసిన అవసరం ఉంటుంది. ఇది అనుభూతితో  మాత్రమే  అనుభవం లోకి వస్తుంది .

మనిషి యొక్క భోగము, సుఖము, సంతోషము, ఆనందము అనే భావనలను, అనుభూతులను...(ఈ భావనలు, అనుభూతులను అనుభవించని వారు, తెలియని వారు), కేవలం పదాలుగానే యెంచి పాశ్చాత్య దేశాలవారు తమకు తోచిన  విధంగా  నిర్వచనాలివ్వడంతోనే సమస్య ప్రారంభమైందంటాను నేను.

విదేశీయులు అంటే అంత తెలివి లేని వాళ్ళా.? ఒకసారి అవలోకిద్దాం: ఆ మధ్య ఒక మిత్రుడు 'కొందరు' రాజకీయ నాయకులను రాబందులతో పోల్చాడు. అన్నట్టు రాబందులు చచ్చిన  పశువులను  అప్పటికప్పుడే  అక్కడికక్కడే పీక్కు తింటాయి చచ్చిన జంతు కళేబరాల వలన దుర్గంధం వ్యాపించకుండా,రోగాలుసోకకుండా చేసి మానవాళిని రక్షిస్తాయి. అలాంటి మనకుమేలుచేసే బంధువులైనట్టి 'రాబందులు' ఈ మధ్యకాలంలో కనబడక పోవడానికి కారణం. అత్యాశకు పోయిన మానవుడు ఆవులను 'హెవీ మిల్కర్స్' గా మార్చి అత్యధికంగా పాలను పొందడానికి   రసాయన ఇంజెక్షన్లు ఇచ్చి చేసిన ప్రయత్నం కారణంగా విషపూరితమైన ఈ పశువుల కళేబరాలు తిన్న రాబంధులు ప్రత్యుత్పత్తి సామర్థ్యం కోల్పోయాయని తెలిసింది రాబందులు లేకపోతే ప్రకృతిలో మరో కొత్త సమస్య వస్తుంది.

అత్యధిక పాలదిగుబడిని సాధించినారు అని రసాయన ఇంజక్షన్లు తయారుచేసిన మేధావులకు , మరియు సృష్టిలో అత్యధిక సంతానాన్ని కని తమ సంతానానికి అత్యధికంగా పాలను ఇచ్చే పందుల నుండి,ఎలుకల నుండి కణాలను తీసి ఆవుకు కలిపి జెర్సీ ఆవులు, హోలిస్టీన్ ఆవులనీ , సాధారణ గేదెలకు  మరో జంతువు యొక్క కణాన్ని కలిపి గౌడి,ముర్రా జాతి అంటూ జంతువులను  సృష్టించారు.
అవును అవి ఆవులు, గేదెలు  కానే కావు  అవి కేవలం జంతువులే  అంటాను నేను .

అటువంటి హైబ్రిడ్ జంతువుల పాలు తాగిన వారు ఏ లక్షణాలు సంతరించుకుంటారో ఒకసారి ఆలోచించండి. ఇటువంటి కొత్త ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలకు అవార్డులిచ్చి సన్మానాలు చేసిన విదేశీ శాస్త్రవేత్తలకు వాటి అనంతర పరిణామాలు తెలియవా.? కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట అన్న చందంగా పాల ఉత్పత్తి పెరిగిందని సంబర పడితే ఆవుకు పంది కణాన్ని కలిపితే పుట్టిన జంతువుల పాలుత్రాగి ఆయా పాలిచ్చిన జంతువుల మాంసాలే తిన్న మనుషుల శరీరాలు బద్దకించాయీ, మనస్సులు మాయమయి రాక్షసులయ్యారు,  బుద్ధులు వక్రీకరించి పెడదారిపట్టిన సైంటిస్టుయ్యారు, ఇక ఇటువంటి  వారికి ఆత్మతత్వం గురించిన అవగాహన, దివ్యమైన అనుభూతి  ఈ జన్మలో అర్థం అవుతుందా..!

ఆహారం కోసం  బ్రాయిలర్  కోళ్లను  తయారుచేసినా, వస్తువుల తయారీకోసం ప్లాస్టిక్ ను తయారు చేసినా, తుపాకీని, ఆటంబాంబును తయారుచేసినా, ఇల్లు కట్టుకోవడానికి సిమెంటు,రసాయనాలు, ఎయిర్ కండీషనర్ లు, రసాయనిక పొగలను కక్కే ఫ్యాక్టరీలు, వాహనాలు తయారుచేసినా,  పంటలు పండించడానికి రసాయన ఎరువులు తయారు చేసినా, ఈ ఎరువుల కారణంగానే పంటచేనులన్నీ బీడులుగా మారి నదులు, చెరువులన్నీ రసాయన కాసారాలుగా మారినా వాటికి కారణం పాశ్చాత్య శాస్త్రవేత్తల యొక్క ఆవిష్కరణలే అంటాను నేను. మిగతా వారి ప్రమేయం లేదా అని అడగవచ్చు ఉంది అది కూడా వీరిఊదరగొట్టే ప్రచారాల ప్రభావానికి లోనైన ప్రపంచం వీరిని అనుసరించడం జరిగింది అంటానునేను.

ప్రపంచ విజ్ఞానం ముద్రణ పరికరం కని పెట్టిన తర్వాతనే వేగం అందిపుచ్చుకున్నది అనే మాట వందకు వందశాతం తప్పు. ముఖే ముఖే సరస్వతి అని జ్ఞానము- విజ్ఞానము మనుషుల మాధ్యమంగానే ప్రసారం అయ్యే పద్ధతికి చరమగీతం పాడిన ముద్రణా పరికరం, కాగితపు పరిశ్రమ మానవ సహజ పరిణామ విజ్ఞాన ప్రాభవాన్ని  నేలమాళిగల లోన భూస్థాపితం చేసింది అంటాను నేను. 
వేదాలు రామాయణం వంటి వేలాది కావ్యాలను, లక్షల కొద్దీ  సంస్కృత శ్లోకాలను మన అలవోకగా చెప్పగలిగే  జ్ఞాపకశక్తి మన పూర్వీకులకు ఉండేది. ఆధునిక కంప్యూటర్లలో వాడుతున్న  'చిప్'ల కన్నా వేల రెట్లు అధిక సామర్థ్యం నిక్షిప్తమై ఉన్న మానవ మస్తిష్కం యొక్క పనితనాన్ని మందగించేటట్లు, క్రమంగా పతనం అయ్యేటట్లు చేసిందీ ఈ పాశ్చాత్యులే అంటాను నేను.

ఈ పాశ్చాత్యుల పోకడలకు దారిని చూపి ప్రోత్సాహం ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తే, ఈ భూమి, ఈ భూమి పైన ఉన్న సర్వసంపదలు, సర్వ జీవరాశి నీవు తినడానికి, నీ భోగానికి, నీ సుఖానికి భగవంతుడు ఏర్పాటు చేశాడు అని ఎప్పుడైతే అనంతమైన విజ్ఞానాన్ని తోసివేసి ఒక 'పుస్తకాన్ని' ఉదాహరిస్తూ ప్రచారం చేయడం ప్రారంభం చేశారో అప్పటినుండీ ఈ వికృతులకు తెరలేసింది అంటాను.

లక్షల సంవత్సరాల క్రితమే  'యత్ పిండే  బ్రహ్మాండే' పిండములో ఉండేదే బ్రహ్మాండంలో ఉంటుంది, అండము పిండము బ్రహ్మాండము ఈ మూడు ఉండగానే ఉంటాయి  ఇక భూగోళము అంటాం  అంటే భూమి గోళాకారంలో ఉంది అనిగానీ, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని గాని ప్రాథమిక విద్య నేర్చుకుంటున్నప్పుడే చెప్పే ఈ పాఠాలను ఈమధ్యనే కొన్ని  వందల సంవత్సరాల క్రితం గెలీలియో బ్రూనో వంటి కొంతమంది కొన్ని సత్యాలను తెలుసుకొని ప్రకటిస్తే..

ఈ పుస్తకాన్ని చూపి ఇందులో ఆ విషయాలు లేవు అంటూ , వారిని జైలుపాలు చేయడం, చంపడం వంటివి చేశారు...
 ఇలా సత్య మార్గాన్ని మూసి వేసి వక్ర మార్గాన్ని తెరిచారు. కాదన్న వారిని పశు బలంతో నిర్ధాక్షిణ్యంగా తొక్కి వేశారు, హత్యలు చేశారు, సత్యాన్ని సమాధి చేశారు.
మొన్నటికి మొన్న  క్రైస్తవ సేవిక థెరిస్సా గారు కనీసం ఆధునిక సైన్స్ ను కూడా నమ్మను, ఈ పుస్తకమే నాకు ప్రామాణికం అంటూ ప్రకటించారు..., నరసింహా రానికి పాల్పడిన  అనేకమందికి  క్షమాభిక్ష ప్రసాదించాలని  కోరిన ఈవిడకు ప్రపంచంలో అత్యున్నత మైన అవార్డుగా ప్రచారమైన నోబెల్ శాంతి పురస్కారమునిచ్చారు. ఇలా ఉంటాయి పవిత్ర పుస్తకాన్ని నమ్మిన వారి యొక్క పనులు.

ఇటువంటి పనులు  ఇటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు  ప్రకృతి మాకోసం కాదు మేము కూడా  జంతు జీవరాశులతో పాటు ప్రకృతిలో భాగము అని భావించి పాలిచ్చే ఆవు తన లేగదూడ కు ఇచ్చిన తర్వాతనే మిగిలిన పాలను పితుక్కోవాలి, ఆవుపేడతో  వంట చేసుకోవడానికి పొయ్యిలోకి పిడకలను తయారు చేసుకోవాలి, ఈ మధ్య రామాయణం సీరియల్ చూసిన వారికి  సీతమ్మ తల్లి  వంట చెరుకు కోసం రాలిన చెట్టు కొమ్మలే  వాడుకోవాలి  తప్ప చెట్టును నరకకూడదు అని చెప్పిన సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది ఇది మన జీవన పద్ధతి దీనిని దూరం చేశారు.
మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః (ఈ పుడమి నా తల్లి నేను ఆమె పుత్రుడను)

यस्याम् समुद्र उत सिंधुरापो,
यस्यामन्नं कृष्टय: संबभूव:
यस्यामिदं जिन्वति प्राणदेजत्
सा नो भूमि: पूर्वपेये दधातु

'जहां समुद्र और सरिताओं की 
विशाल जल राशि है, 
जहां कृषि से अन्न पैदा होता है, 
जहां विविध जीव जीवन पाते हैं, 
वह धरती 
हमें जीवन का अमृत प्रदान करे।'
- पृथ्वी सूक्त : अथर्ववेद 
ఎక్కడైతే సముద్రము మరియు నదులు విశాల జలరాశి ఉంటుందో ఎక్కడైతే వ్యవసాయం వలన ఆహారం సమకూరుతుంది ఎక్కడైతే వివిధ రకాలైన జీవరాశి పరిఢవిల్లుతుందో అటువంటి స్థలంలో మాకు జీవనాన్ని ప్రసాదించు తండ్రీ అని అధర్వ వేదంలోని పృథ్వి సూక్తం తెలియజేస్తున్నది.

ఇంత గొప్ప ఆవిష్కరణలను వదిలి, తమ మూర్ఖత్వం కారణంగా 'విలాసాలు' అనే మాటకు అర్థాలు మార్చి  గర్భంతో ఉన్న జంతువు యొక్క  పిండాన్ని  తీసి ఆ పదార్థంతో   తయారుచేసిన పేస్టు ముఖానికి పులుముకుంటే అందమని, లిప్స్టిక్  రంగులు పెదవులకు పూసుకుంటే  విలాసం అనీ ఇలా కొత్త నిర్వచనం ఇచ్చి వైజ్ఞానికత పేరుతో అమానవీయతను పెంచే వైఖరిని వెంటనే విడనాడాలి అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది.

మానవ మస్తిష్కంలో 'పవిత్ర పుస్తకాన్ని'..? చూపిస్తూ మలినాన్ని కూరారు. అందుకే ఇది తప్పంటాను, పాప పంకిలమైన మస్తిష్కాలలోని మలినాన్ని కడిగి వేసి భూమిపైన  ప్రకృతి పైన భక్తి భావనతో పవిత్రం చేద్దాం. విశాల హృదయులై రండి అనంతమైన విజ్ఞానాన్ని ఒడిసి పట్టుకున్న భారత రుషులు, వారు ఆవిష్కరించిన పద్ధతులు వేదాలలో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుంటేనే, అనుసరిస్తేనే, ఆచరిస్తేనే ప్రపంచ ప్రజల బ్రతుకు బండి సవ్యంగా సాగుతుంది. - ఆకారపు కేశవరాజు. పాట్నా, బీహార్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments