మన ప్రాచీన శాస్త్రాలలో ఆవు: భారతీయ ధర్మ, సంస్కృతీ, సభ్యతల్లో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. పవిత్రత, స్వచ్ఛత, పరిశ్రమకు ఆవు ప్రత...
మన ప్రాచీన శాస్త్రాలలో ఆవు: భారతీయ ధర్మ, సంస్కృతీ, సభ్యతల్లో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. పవిత్రత, స్వచ్ఛత, పరిశ్రమకు ఆవు ప్రతీక. ఈనాటికీ హిందూ సంస్కృతిలో ప్రధాన శ్రద్ధా కేంద్రంగా ఆవు మన్ననలు అందుకుంటోంది. లోక కళ్యాణం కోసం భగవంతుడు ఆవును సృష్టించాడు. మనం చేసే సేవ, చూపే ప్రేమను గ్రహించి అంతకు రెట్టింపుగా మనకు తిరిగి ఇస్తుంది గోమాత అన్నారు ఆచార్య వినోబాభావే. ప్రేమ, త్యాగం, కరుణ, ఉదారత, ధర్మం, ధైర్యం, సంతోషాలకు ప్రతిరూపం ఆవు. ఆవు దయ, ధర్మం సాకార రూపం అన్నారు గాంధీ. నిజానికి ప్రపంచంలో మరే పశువు, లేదా జంతువు ఇంత ప్రముఖ స్థానాన్ని పొందలేదు. ప్రముఖ అమెరికా పశువైద్యుడు, మనిషి మేలు కోరే జంతువులు ఆవుకు మించినది లేదు. మన ఇంట్లో మిత్రుడిలా మెలిగే ఆవు వల్ల ఎప్పుడూ, ఎవరికీ కీడు జరుగదు. మన ఇంటిని, దేశాన్ని కూడా కాపాడుతుంది మిస్సోరీ డెయిరీ కమీషనర్, ఇ.జి బెనెట్ అన్నారు. ఆవు తన శ్వాస ద్వారా ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను మనకు అందిస్తుందని - జర్మనీ శాస్త్రవేత్త జులిషిస్ వెల్లడించారు. ఆవు శరీరం నుండి వెలువడే రసాయనాలు వాతావరణాన్ని శుభ్రపరుస్తాయి. గోసేవ గోరక్షణ ద్వారా ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్ధాలు నెరవేరుతాయి.
ధేను సదనం రజీణాం అని అధర్వణ వేదం (11-3-34) పేర్కొంది. అంటే ఆవు సర్వసంపదలకు మూలం.
యా యం గావో భేదయిథా కృషంచిద్ శ్రీరం చిత్ కృణుథా సుప్రతీకం భద్ర|
గృహం కృణుఢ భద్రంవాచో వృహద ఓవయి ఉచ్ఛతే సభాసు ||
ఓ గోమాత నువ్వు బలహీనుడిని కూడా బలవంతుడిని చేస్తావు. వర్చస్సు ను తెస్తావు. ఇంటిని సుఖసంతోషాలతో నింపుతావు. నీ అమృత ప్రాయమైన పాల గురించి అంతా చెప్పుకుంటారు (ఋగ్వేదం 6-28-6).
గృహం కృణుఢ భద్రంవాచో వృహద ఓవయి ఉచ్ఛతే సభాసు ||
ఓ గోమాత నువ్వు బలహీనుడిని కూడా బలవంతుడిని చేస్తావు. వర్చస్సు ను తెస్తావు. ఇంటిని సుఖసంతోషాలతో నింపుతావు. నీ అమృత ప్రాయమైన పాల గురించి అంతా చెప్పుకుంటారు (ఋగ్వేదం 6-28-6).
మాతా రుద్రాణం దుహితా వసూనా స్వసాదిత్యానాం మృతస్య నాభిః ప్ర ను బోచం చికితుషే మా జనాయ గామనాగా భాదితి వధిష్ట (ఋగ్వేదం 8-101-15) ఆవు రుద్రులకు మాత. వసువుల పుత్రిక. ఆదిత్యులు సహోదరి. పాలు, నెయ్యి వంటి అమృతతుల్యమైన పదార్థాలు అందిస్తుంది. అటువంటి అవును చంపరాదని బుద్ధిమంతులు, వివేకశీలురు తెలుసుకోవాలి.
మహాసేవ గోర్మహిమా అని శతపథ బ్రాహ్మణం (3-3-3-1) చెపుతోంది. అంటే గోవు మహిమ ఎంత వర్ణించినా తక్కువే అని అర్ధం. ఆవు సమస్త మానవ జాతిని తల్లిలా పాలించి, పోషిస్తుంది. అందుకే మన శాస్త్రాల్లో గావో విశ్వస్య మాతరః అని కీర్తించారు. సకల కోరికలను తీసుస్తుంది కాబట్టి కామధేనువు అని అంటారు.
విశ్వరూపా ధేనుః కామడుధా మేస్తు (అధర్వణ వేదం 4-34-8) ఆవు అతి తెలివైన, సున్నితమైన ప్రాణి. ఆవు మానసిక సమస్యల్ని తీరుస్తుంది అని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పశుసంవర్ధక విభాగపు అధిపతి డోనాల్డ్ బూమ్ అంటారు. యజ్ఞం, దానధర్మాలలో ఆవుదే ప్రథమస్థానం. దానాల్లో గోదానం గొప్పది. అందుకే ముఖ్యమైన పవిత్ర కార్యాలన్నింటిలో గోదానం ఉంటుంది.
గవాం శతసహస్తాణి దశ తబ్యో దదౌ నృపః వాల్మీకి రామాయణం (1-14-50) యజ్ఞం చేసినపుడు దశరథ మహారాజు పది లక్షల ఆవుల్ని దానం చేశాడు, కొమ్ములకు బంగారపు తాపడం చేసిన వెయ్యి ఆవుల్ని యాజ్ఞవల్క్య మునికి దానం ఇచ్చాడు జనక మహారాజు.
బ్రహ్మదేవుడు ఆవు మహిమను ఇంద్రుడికి వివరించాడు, ఆవు యజ్ఞ భాగమే కాదు, అదే యజ్ఞం. ఆవు పాలు, నెయ్యితో ప్రజల్ని పోషిస్తుంది. ఆవు సంతానం పొలాల్లో వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. (మహాభారతం అనుశాసనిక పర్వం 83/17-21).
ఆవును వేదాల్లో 'అఘన్య' (చంపరానిది), 'అహీ' (చంపరానిది), 'అదితి' (ముక్కలు చేయరానిది) అని వర్ణించారు. ఋగ్వేదం, యజుర్వేదం గోహత్యను హత్యతో సమానమని ఖండించాయి. గోవధ చేసినవారికి మరణ దండన విధించాలని చెప్పాలి
అరే గోవా నృహా వధు వో అస్తు (ఋగ్వేదం 7-56-17) ఆరే తే గోఘ్నముత పురుషఘ్నం (ఋగ్వేదం 1-114-10) అంతకాయ గోఘాతం (యజుర్వేదం 30-48)
గోవులను వధించే దుష్టులను రాజ్యం నుండి బహిష్కరించాలని ఋగ్వేదం స్పష్టం చేసింది. గోవధ చేసే వారిని కఠినాతి కరణం శిక్షించాలని యజుర్వేదం స్పష్టం చేసింది. రామాయణంలో కూడా గోరక్ష ప్రాధాన్యతను వివరించింది. మీ ఆదేశానుసారం నేను గోవులు, బ్రాహ్మణులు, దేశ రక్షణ కోసం తాటకను చంపేందుకు సిద్ధంగా ఉన్నాను అని రాముడు విశ్వామిత్రుడితో అంటాడు (వాల్మీకి రామాయణం 1-26-5).
మహాభారతం ఆవు గొప్పతనాన్ని ఇలా వర్ణించిన. గో సంతతి వధించేవాడు మహాపాపం చేస్తున్నాడు. గోవధ ఎంతో చేటు తెస్తుంది (శాంతి పర్వం 262 అధ్యాయం, 49 శ్లోకం). ఉపనిషత్తులు కూడా గోవు మహిమ గురించి చెప్పారు. కఠోపనిషత్తు గోవు పేరుతో ఒక అధ్యాయమే ఉంది. అందులో గోదానం గురించి విస్తారంగా ఉంటుంది. వాజశ్రవసుడు గోదానం చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న ఆయన కుమారుడు నచికేతుడు తండ్రీ! ఈ గోవులన్నీ నువ్వు దానం చేస్తున్నావు. మరి నన్నెవరికి ధారపోస్తావు అని అడిగాడు. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రశ్నలతో వేధిస్తున్న కొడుకును చూసి వాజశ్రవసుడు నిన్ను మృత్యు దేవత అయిన యముడికి దానం చేస్తున్నాను అన్నాడు దానితో నచికేతుడు మృత్యులోకానికి వెళ్ళి అక్కడ పట్టుపట్టి యమధర్మరాజు నుండి మృత్యురహస్యాన్ని, ఆత్మ పరమాత్మ జ్ఞానాన్ని పొందుతాడు.
ఇలా గోమాత గురించి మన ప్రాచీన శాస్త్రాలలో నిక్షిప్తమై వుంది. గోమాత సంరక్షణ మన బాధ్యత. జై గోమాత.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments