ఆంగ్లేయ పాలకుల మార్గంలోనే భారతీయ పాలకులు: ఈ జగత్తులో ఆవులు, ఎద్దులు మున్నగు వాటిని మానవుని కోసం అతడికి పాలు సమృద్ధిగా అందివ...
ఆంగ్లేయ పాలకుల మార్గంలోనే భారతీయ పాలకులు: ఈ జగత్తులో ఆవులు, ఎద్దులు మున్నగు వాటిని మానవుని కోసం అతడికి పాలు సమృద్ధిగా అందివ్వాలని, వ్యవసాయంలో సాయపడాలని పరమేశ్వరుడు సృష్టించాడు. వాటిని హత్యకు గురికావించడం స్వయంగా తమ కాళ్ళను తాము నరుక్కోవడమే అవుతుంది. గోవంశము యొక్క సమస్య ముఖ్యంగా ఆర్థిక సమస్యకాదు. ప్రధానమైన సామాజిక సమస్య. ఏదైనా అది సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ సమస్యగానే ఉంటుంది తప్ప ఆర్థిక సమస్యగా కాదు. సమస్యంతా పశువుల సంఖ్యను గురించే. పశువుల సంఖ్య తగినంత తక్కువగా ఉంటే లభ్యమయ్యే పశువుల మేత యావత్తు అర్థశాస్త్రజ్ఞులు, శాసనకర్తలు నచ్చి, సూచించే పశుసముదాయానికి సరిపోగా అవి కావలసినంత పాలను ఉత్పత్తి చేయగలవు.
ప్రస్తుతం గోవంశపు సంఖ్య అతి తక్కువగానే ఉంది. దీన్ని ఇంకా తగ్గిస్తే సాధారణ రైతు తన ఎద్దులు కోల్పోవలసి వస్తుంది. ఎక్కువ సంఖ్యలో ఉండే చిన్న రైతుల ప్రాణాధారాలైన బక్క చిక్కిన ఎడ్లను తగ్గించివేస్తే ఇక చిన్నరకం వ్యవసాయం కూడా లుప్తమైపోతాయి. కేవలం భారీ యంత్రాలు సాగే పెద్ద వ్యవసాయం మిగులుతాయి. అవి ఆధునిక పారిశ్రామిక క్షేత్రం యొక్క భారీ వ్యవసాయ విభాగంగా నడుస్తాయి. గోవంశపు సంఖ్య తగ్గిపోతే మరోవైపు చిన్నరైతులంతా తమ జీవనాధారం కోల్పోయి బజారు పాలవుతారు. భారీ యంత్రాలు, పెట్టుబడులతోను సాగే పరిశ్రమలు భారత్ లో మానవ శ్రమ శక్తిని నిరుపయోగం చేసి, అట్టి శ్రమ శక్తి ఆధారంగా నడిచే పరిశ్రమలను దివాలా తీయించి నిరుద్యోగాన్ని పెంచుతాయి. "ఆపరేషన్ ప్లడ్" వంటి జాతీయ పాడి అభివృద్ధి యోజనలు మరియు సంకరజాతి పశువుల వృద్ధి ఆధారంగా నడిచే పశు సంవర్థక, పశు రక్షణ యోజనలన్నీ గోవంశ హత్యా విధానానికి మరింత ప్రోత్సాహాన్ని కల్పిస్తూ చిన్న రైతులకు కావల్సిన ఎద్దులు, ఎరువులు, పొయ్యిలోకి పిడకలు కూడా లభించని పరిస్థితిని తెచ్చి పెడతాయి.
ఇ.వి.బార్ వ్రాసిన పుస్తకం 'ది లివింగ్ సాయిల్ లో వృద్ధ బలహీన పశువుల పేడతో పొలాలలో పంటలను వృద్ధి పరిచే విషయంలోను, తూర్పు జర్మనీకి చెందిన ఒక డాక్టరు ఎలార్ట్ బాల్చి వ్రాసిన 'రోమాంస్ ఆఫ్ కేటెల్' మరియు హర్బన్స్ సింప్, వై.యం. వ్రాసిన 'బేసిక్ ఫ్యాక్ట్స్ అబవుట్ వెల్త్ అండ్ అలైడ్ మ్యాటర్స్' అన్న గ్రంథాలలో పేడ ఎరువు యొక్క వైశిష్ట్యము విపులంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మహాభారతంలోని ఒక ప్రసిద్ధ శ్లోకం 'అష్టశ్వర్యమయీ లక్ష్మీ వసతే గోమయే సదా" అంటే ఎనిమిది రకాల ఐశ్వర్యాలతో లక్ష్మీదేవి గోమూత్రం -గోమయంలో ఉందని అర్థం. 'ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్' కు చెందిన శ్రీ సురేంద్ర బత్రా వ్రాసిన పరిశోధన 'ఈ దేశం నుండి గోమాంసం కాక, ఎక్కువగా ఉన్న గోసంతతినే నేరుగా విదేశాలకు పంపేయాలని ఇంకా నైతిక చర్యగా పశువుల మేతను కూడా ఆ దేశాలకు ఎగుమతి చేయాలని వ్రాశారు. ఈ రోజుల్లో పెరుగుతున్న విస్తృత మోసాల యొక్క ఆధునిక రీతులు ఆలోచనలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
నేడు భారతీయ పాలకులకు ధృఢమైన సంకల్పం లేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నాయి. ఉన్నదాన్ని ఊడ్చిపారేయడంలోనే దానికున్న ఆసక్తి అంతా, గోహత్యను సమాజం యావత్తూ ఒక్కుమ్మడిగా వ్యతిరేకిస్తేనే గోహత్య ఏ రూపంలోనూ జరగకుండా నిరోధించగలిగిన ప్రభుత్వ విధానం రూపు దిద్దుకొంటుంది. ధర్మబద్ధమైన ఆలోచనలు, కర్తవ్య శక్తి పై ఆధారపడిన అహింసను ఆరాధించే సమాజమే అహింసపై అక్షరశః విశ్వాసం ఉన్న పరిపాలన వ్యవస్థ నిర్మాణం చేసుకోగలుగుతుంది. అట్టి ప్రభుత్వ విధా సర్వసమ్మతితో గోవంశ రక్షణ విషయంలో పటిష్టమైన చర్యలు ఏవైనా చేపట్టగలుగుతుంది. కనుక గోవంశ హత్యను సంపూర్ణంగా నిరోధించడమనేది సాంస్కృతిక సాంఘిక - రాజకీయ సమస్యే. ఇది ఆర్థికంగా కంటే భావనాత్మక సమస్య. దయా, సానుభూతికంటే న్యాయపరమైన సమస్య. గోజాతి సంరక్షణకంటే వాటితో కలిసి మనం జీవించవలసిన సహజీవన సమస్య నిజానికి భారత్ లో గోసంతతి అవసరానికి మించి లేనే లేదు. మన దేశంలో ఎక్కువగా ఉంది వ్యవసాయానుకూలమైన భూమి 14 కోట్ల హెక్టార్లు ఉంది. గోచరాలు ఇతర ఉపయోగాలకై కేటాయించిన భూమిని కలిపితే అది 19 కోట్ల హెక్టారు అవుతుంది.
అప్పుడు మొత్తం గోసంతతి కూడా దాదాపు 18.52 కోట్లు ఉంది. బ్రిటన్కంటే భారత్ 3 రెట్ల కన్న ఎక్కువ విశాలమైంది. బ్రిటన్ లో నగర జనాభా 91% అయితే భారత్ లో అది కేవలం 22% మాత్రమే. బ్రిటన్ పారిశ్రామికంగా వృద్ధి భారత వ్యవసాయ, గ్రామీణ రంగంలో వృద్ధి చెందింది. 1965 నుండి 1975 ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియాలో 78.64%, అమెరికాలో 27.89%, బ్రెజిల్లో 54.6%, కొలంబియాలో 46.72%, మెక్సికోలో 34.88%, పాకిస్తాన్లో 28.67%, బర్మాలో 25.84% పశు సంతతి వృద్ధి చెందితే భారత్ లో మాత్రం ఇదే కాలంలో కేవలం 2.59% వృద్ధి జరిగింది. 1975లో మనదేశంలో 18కోట్ల 2 లక్షల గోసంతతి ఉంది. అలాగే బ్రిటన్ లో వాటి సంఖ్య 1 కోటి 47 లక్షలు. అయితే దేశ జనాభాతో లో ఈ సంఖ్య అతిస్వల్పం అని తేలుతుంది. ఎందుకంటే 5 కోట్ల 60 లక్షల జనాభా కలిగిన పారిశ్రామిక దేశం బ్రిటన్లో పశుసంఖ్య 1 కోటి 47 లక్షలు, అలాగే 5 కోట్ల 60 లక్షల జనాభా కలిగిన పారిశ్రామిక సంయుక్త రాష్ట్రాలు అమెరికాలో పశుసంఖ్య 13 కోట్ల 18 లక్షలు. అయినప్పుడు 90 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో కనీసం 40 కోట్ల గో సంతతి అయినా ఉండాలి.
గత సంవత్సరాలలో మన దేశంలో భారీ సంఖ్యలో పశువులను హత్యచేయడం జరిగింది. ఇది దేశానికి తగిలిన ఓ పెద్ద దెబ్బ. అలాగే ఈ మద్య గోవులపై అత్యాచారాలు కూడా పెద్ద సంఖ్య లో జరుగుతున్నవి. పైన పేర్కొన్న వాస్తవాల ఆధారంగా భారతీయ ఆర్థిక వ్యవస్థకు భారతీయ గోవంశమే ఆధారమనేది స్పష్టమవుతున్నది. భారతీయ గోసంతతిని రక్షించడం మన సాంస్కృతిక, సామాజిక కర్తవ్యమేకాక అది రాజకీయ, ఆర్థిక ఆవశ్యకత అన్నది కూడా సుస్పష్టం. భారతీయ అర్థనీతిపై మన దేశాన్ని సమృద్ధం చేయాలంటే భారతీయ గోసంతతిని రక్షించడం, పోషించడం, వాటిని వృద్ధి పరచడం తప్పనిసరి కర్తవ్యమని చెప్పక తప్పదు. పశ్చిమ దేశాలు గుడ్డిగా అనుకరిస్తూ పోవడం మన దేశాన్ని ప్రగతి దిశలో గాక అధోగతికి, ఆత్మనాశనానికి గురిచేయడమే అవుతుంది. సమయం మించిపోకముందే మనం జాగృతులమై, చైతన్యవంతులమై, క్రియాశీలురమైతే మంచిది. ఈ మార్గంలో పయనిస్తే మన భవిష్యత్తు సాంస్కృతికంగా సామాజికంగా, రాజకీయంగా అంతేకాక ఆర్థికంగాను ఉజ్జ్వల ప్రగతి పథంలో ముందుకు సాగగలదని దేశహితైషులైన పెద్దలందరి పరిపూర్ణ విశ్వాసము.
super article very very nice
ReplyDelete