Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గోసేవ - గోసేవ చేస్తున్న ప్రముఖ సంస్థలు - Go seva and Organizations - MegaMinds

గోసేవ: అవును సేవించేవారికి అతి దుర్లభమైన వరాలు కూడా నెరవేరుతాయి. క్రూరత్వం, కోపం చూపకుండా ఎప్పుడూ జాగ్రత్తగా సంరక్షిస్తే ఆవు అన...


గోసేవ: అవును సేవించేవారికి అతి దుర్లభమైన వరాలు కూడా నెరవేరుతాయి. క్రూరత్వం, కోపం చూపకుండా ఎప్పుడూ జాగ్రత్తగా సంరక్షిస్తే ఆవు అన్ని కోర్కెలు తీరుస్తుంది. జితేంద్రియుడై, ప్రసన్నచిత్తంతో నిత్యం గోసేవ చేస్తే పుణ్యం దక్కుతుంది అని మహాభారతం అనుశాసన పర్వం 21/33-35 శ్లోకాలలో ఉంది.

మహర్షి వశిష్ఠుడు ఆచరించిన గోపాలన, గోసేవ చాలా ప్రసిద్ధమైనది. గోతత్వాన్ని తెలుసుకున్న వారిలో ఆయన ప్రథముడు అనవచ్చు. ఆయన దగ్గర శబల అనే విశిష్టమైన ఆవు ఉండేది. ఆ శబల సంతానమైన నందిని గురించి సంస్కృత సాహిత్యంలో చాలా ప్రస్తావన ఉంది. మహాభారతంలో వశిష్ఠుడు గోసేవ మహత్తు గురించి రాజా సౌదాసునికి వివరించాడు - గావః ప్రతిష్టా భూతానాం గావః స్వస్యయనం మహత్ | గావో భూతం చ భవంచ గావః పుష్ట సనాతనీ || (మహాభారతం-అనుశాసన పర్వం - 78/5-6) - "ఓ రాజా! ఆవు మనుష్యులతోపాటు సమస్త జీవులకు ఆధారం. గోకళ్యాణం మంగళకరం. సంపదలకు మూలం" ఆవు ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని, ఆవు శరీరం సర్వదేవతల నివాసస్థానమని" వేదవ్యాసుడు వివరించాడు.

శ్రీకృష్ణునికి గోపాలుడు' అనే పేరు వచ్చింది. ఆయన ఎంతో ప్రీతితో గోసేవ చేసేవాడు. కృష్ణభక్తుడు రసఖాన్ కూడా గోమహత్యాన్ని అనేక విధాలుగా వర్ణించారు. సత్యకామ జాబలి గో సేవ ద్వారా దైవ చింతన అలవడి మోక్షాన్ని సాధించాడని కఠోపనిషత్తు పేర్కొంది. దిలీప మహారాజు చూపిన గో భక్తి అనన్య సామాన్యమైనది. రఘువంశం' కావ్యంలో మహాకవి కాళిదాసు దిలీప మహారాజు గో భక్తి వర్ణించాడు. దిలీపుడు ఎప్పుడూ గోసేవలోనే ఉండేవాడు. నీడలా గోవుల వెన్నంటి ఉండేవాడు. ఆవుకు ఆహారపానీయాలు అందించనిదే తాను కూడా ఏదీ తీసుకునేవాడు కాదు.

వీలు ఉంటే ప్రతి ఇంటా కనీసం ఒక ఆవును ఉంచుకోవాలి. 'రాజు నిర్వర్తించవలసిన ప్రధాన కర్తవ్యాలలో గోసంరక్షణ కూడా ఒకటి' అని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో (2-6-48) పేర్కొన్నాడు. మన దేశంలో ప్రముఖ గోసేవ సంస్థ ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గోసంరక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. జైన సమాజ్ ద్వారా ఏర్పాటైన గోశాలలు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోసేవా కేంద్రాలు. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల. అఖిల భారతీయ గోసేవ సమాజ్, ఢిల్లీ. శ్రీ కృష్ణ గోపాల సంస్థాన్, గోవింద గఢ్, జయపూర్, రాజస్థాన్. కామధేను విశ్వవిద్యాపీఠం, ఝాన్సీ, ఉత్తర ప్రదేశ్. భారతీయ గోవంశ రక్షణ, సంవర్ధన పరిషత్, సంకటమోచన ఆశ్రమం, ఢిల్లీ. భారత్ సేవక్ సమాజ్, ఢిల్లీ. రాష్ట్రీయ గోధన మహాసంఘ్, ఢిల్లీ. ఇలా అనేక సంస్థలు గోసేవ చేస్తున్నాయి. 2009 లో భారత దేశం మొత్తం విశ్వ మంగళ గో గ్రామ యాత్ర తరువాత చైతన్యం పెరిగి వేలల్లో గోసేవా కేంద్రాలు మొదలయ్యాయి. అలాగే సినిమా హీరోలు సైతం గో సేవ లో తరిస్తున్నారు కొంతమంది వారిలో అర్జున్, అలాగే పవన్ కళ్యాణ్ కూడా గోసేవను... గో సంరక్షణ వైపు అడుగులేస్తున్నాడు.. ఇది శుభపరిణామంగా మనమంతా భావించవచ్చు. జై గోమాత. 

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments