స్వాతంత్ర్య ఉద్యమంలో గోవు: స్వాతంత్ర్యోద్యమంలో గోవు ప్రధాన అంశమైంది. గోవు, గోసంరక్షణ ప్రముఖ అంశాలు భారతీయ స్వతంత్ర ఉద్యమ నే...
స్వాతంత్ర్య ఉద్యమంలో గోవు: స్వాతంత్ర్యోద్యమంలో గోవు ప్రధాన అంశమైంది. గోవు, గోసంరక్షణ ప్రముఖ అంశాలు భారతీయ స్వతంత్ర ఉద్యమ నేతలు పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో గోసంరక్షణకై అన్ని చర్యలు చేపడతామని హామీలు ఇచ్చారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో మన జాతీయ నాయకుల లేమన్నారు? వారి మాటల్లోనే.
స్వాతంత్ర్యం వచ్చిన 5 నిమిషాలలోనే ఒక కలముపోటుతో (శాసనముతో) గోహత్య నిలిపి వేయబడును. -లోకమాన్య బాలగంగాధర తిలక్.
భారత రాజ్యాంగంలో గోహత్యా నిషేధమే మొదటి అంశంగా ఉంటుంది. -పండిత్ మదన్ మోహన్ మాలవ్యా.
నా ఆలోచన ఏమనగా ప్రజల ధార్మిక మృదు భావనలను అవహేళన చేయుట ఎంతమాత్రము సభ్యాచారము కాదు. భారతీయ మస్తిష్కంలో గోవు పట్ల పూజ్య భావము కలదు. గోహత్యా నిషేధమే వైజ్ఞానికం. హేతుబద్ధం అని నా అభిమతము. గోవధ నిషేధమునకు గొప్ప ప్రజాభిప్రాయమును కూడగట్టవలసి ఉంది. గోరక్షణయే మన జీవన ఆదర్శము. దీనికి దూరమగుట మన బలహీనతే. ఎన్నికల్లో ఎవరు గోరక్షణకు ప్రతిజ్ఞ చేస్తారో వారికే ఓటు వేయాలి. ఇలాగే గోవధ కొనసాగితే ప్రభుత్వము నిలువలేదు. -రాజర్షి పురుషోత్తమదాస్ టాండన్
నేను ఆవును సౌభాగ్యాన్ని, ఆర్థిక సమృద్ధిని కల్గించే తల్లిగా భావిస్తాను. ఆవు వల్ల లభించే వివిధ ఉత్పత్తుల (పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం గోమయం) ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. ఇతరులకు తెలియ చెప్పాలి. నా దృష్టిలో గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఎంతమాత్రం తక్కువ కాదు. -మహాత్మా గాంధీ
మన సంస్కృతికి ఆధారము వ్యవసాయమే! ఈ వ్యవసాయ సంస్కృతికి ఆధారమైన గోసంతతిని ఎంత శ్రమించైనా రక్షించుకోవాలి. గో సమృద్ధి కొరకు ప్రయత్నాలు కొనసాగించాల్సిందే. గోసంతతికి నష్టం కలిగితే వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది. -సర్దార్ వల్లభ్ భాయి పటేల్
సంపూర్ణ గోహత్యా నిరోధమే ప్రజల ఆజ్ఞ. దీనిని ప్రధానమంత్రి అంగీకరించక తప్పదు. మనము గోవులను రక్షింపలేకున్న స్వాతంత్ర్య ఫలసారము పోగొట్టుకున్న వారు అగుదురు. -ఆచార్య వినోబాభావే
స్వతంత్ర భారతంలో గోరక్షను గురించిని మన కల్పన, మన కార్యము కొంతవరకు మహాత్మాగాంధీ వెలిబుచ్చిన అభిప్రాయాలతో తేటతెల్లమవుతుంది. గోరక్షణ పట్ల విశ్వాసం లేని వ్యక్తి హిందువుగా భావించలేము అని అంటుండేవారు. గోరక్షణను వారు స్వాతంత్ర్య సాధన కన్నా ముఖ్యమైనదిగా భావిస్తుండేవారు. భారత రాజ్యాంగంలో గోరక్షణను గురించి ఆదేశిక సూత్రాలలో ప్రస్తావించినప్పటికీ ప్రప్రథమ భారత ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి కారణంగా అది అంటే గోరక్ష ఒక ఆర్థికపరమైన సమస్య గానే భావించబడింది. ముస్లింలు, బ్రిటిష్ వారి వంటి విదేశీ పరిపాలకులు సైతం హిందూ సంస్కృతిలో భాగంగా గుర్తించిన గోరక్షను స్వతంత్ర భారత ప్రభుత్వం శాసనకర్తలు దానిని కేవలమొక ఆర్థిక సమస్యగా భావిస్తూ సంస్కృతికి తీరని ద్రోహం చేశారు.
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలైనా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వీరుల మాటలు గౌరవించి గోవును జాతియ ప్రాణిగా గుర్తించి.. రక్షించే చట్టాలు తీసుకురావాలి. స్వాతంత్ర్య వీరులకు శ్రద్దాంజలి ఘటించాలి.
No comments