Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

Inspirational freedom fighter Vasudev Balwant Phadke - వాసుదేవ బల్వంత ఫడ్కే భారత స్వాతంత్ర్య ఉద్యమం లో విప్లవానికి పునాది

ముస్లింల ఆధిపత్యానికి ఎదురులేని కాలంలో శివాజీ జననం నూతన శకానికి నాంది. ఆయన తోరణ దుర్గాన్ని స్వాధీనం చేసుకున్న రోజు హిందూ సామ్రాజ...


ముస్లింల ఆధిపత్యానికి ఎదురులేని కాలంలో శివాజీ జననం నూతన శకానికి నాంది. ఆయన తోరణ దుర్గాన్ని స్వాధీనం చేసుకున్న రోజు హిందూ సామ్రాజ్యానికి పునాదిపడ్డ శుభదినం. అలాగే క్రాంతికారుల జననానికి నాంది పలికిన రోజు స్వాతంత్ర్య సిద్ధికి పునాది అయిన శుభ దినం ఒకటుంది. అదే 'ఘా మారీ గ్రామ దోపిడీ రోజు 21.2.1871 న ఆంగ్లేయుల పాలనకు సవాలు. దోపిడీ చేసిన వాళ్ళు దొంగలు కారు. స్వదేశం కోసం సాహసం చేసిన డింభకులు. వాళ్ళ నేత వాసుదేవ బలవంత్ ఫడ్కే.

ఆంగ్ల దౌష్ట్యాల నుంచి భరతమాతను విముక్తం చేసే మహా యజ్ఞంలో అవసరమైన ధన సేకరణకు జరిపే ప్రయత్నాలీ దోపిడీలు, వీళ్ళు రాగానే ధనవంతులు స్వయంగా ధనాన్ని అందించిన సంఘటనలే ఎక్కువ. పైకి మాత్రం 'దోపిడీ' అని ఆంగ్ల ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసేవారట! తమ పాలక కేంద్రం పూనాలో వున్న ఆంగ్ల పాలకుల మనశ్శాంతి చెదిరిపోసాగింది. వాసుదేవ్ బలవంత ఫడ్కేను బంధించటానికి మేజర్ డేనియల్ ప్రత్యేకంగా నియమించబడ్డాడు. వాసుదేవ్ పట్టించిన వాళ్ళకు రూ. 50,000ల బహుమానం ప్రకటించబడింది.

మరుసటి రోజున పూనాలోని ముఖ్య కూడళ్ళ గోడల మీద కొత్త పత్రాలు అవతరించాయి శ్రీ శ్రీ నానాసాహెబ్ పీష్వా తరపున వాసుదేవ బలవంత్ అయిన నేను ఈ ప్రకటన చేస్తున్నాను. బొంబాయి గవర్నరు సర్ రిచర్డ్ టెంపుల్ తలను తెచ్చి ఇచ్చిన వారికి రూ.75,000- పారితోషకం ఇవ్వబడుతుంది. ప్రజలు విరగబడి ఆ పత్రాల్ని చదవ సాగారు. అందరిలో ఉత్సాహం పెల్లుబికిపోయింది. ఆంగ్ల అధికారులు హడలి పోసాగారు. గ్రామ గ్రామాల్లో వుండే ఆంగ్ల అధికారులు పూనాకు పరుగెత్తుక వచ్చారు.

ఇంతలో 1879, మే నెల 13వ తేదీన అర్ధరాత్రి ఒకే సమయంలో పూనాలోని బుధవార్ వాడ, విశ్రాం బాగ్ లోని ఆంగ్లేయుల కార్యాలయాలు పరశురామ ప్రీతి అయిపోయాయి. మరింతగా వణికి పోయింది ఆంగ్ల ప్రభుత్వం. తెల్ల సైన్యం సమీకరించబడింది. డేనియల్ నేతృత్వంలో 1800 మంది ఆంగ్ల సైనికులు, మరింత భారతీయ సైన్యం ఫడ్కే వెంటబడి తరమసాగారు. తప్పించుక తిరుగుతూ, రాత్రి పగళ్ళ భేదం తెలియక విశ్రామం అన్నది లేక నిరంతరంగా పరుగులెత్త సాగాడు ఫడ్కే.

ఫడ్కేను జ్వరం బాధించసాగింది. కడుపులో ఆధరువు లేదు తల తిరిగిపోతోంది. ఆ స్థితిలో ఓ దేవాలయంలోని యాత్రికుల మధ్య ఒరిగిపోయాడతను, కొద్ది విశ్రాంతి కోసం. వెంటబడ్డ సైన్యం చుట్టూ చక్రబంధం వేసింది. యాత్రికుల మీద వేటలో ఉపయోగించే సెర్చిలైటును ప్రసారం చేయించాడు డేనియల్, వెతుకుతూ ఆఖరుకు ఫడ్కేని గుర్తించారు ఆంగ్లేయులు. వందల తుపాకులు అతనిమీద గురిపెట్టబడ్డాయి. తన కత్తిని గొంతు మీదుంచి డేనియల్, ఫడ్కే గుండెల మీద కూర్చున్నాడు. ఒక్క ఉదుటున లేచి అంత జ్వరంలోను ద్వంద్వ యుద్ధానికి సవాలు చేసి పిలిచాడు ఫడ్కే డేనియల్ ను. వీరత్వం శౌర్యాలు, ద్వంద్వ యుద్ధాలు వున్నాయా - వ్యాపారం పేరుతో వచ్చి దొంగ పద్ధతిలో పరస్పరం తగాదాలు పెట్టి పాలనాధికారాన్ని చేజిక్కించుకున్న ఆంగ్లేయుల చరిత్రలో? అలా 20.7.1879న గంగాపూర్ దగ్గరుండే దేవరనామగీ అనే గ్రామంలో ఆంగ్లేయుల వాతబడ్డాడు తొలి క్రాంతికారుడు బల్వంత ఫడ్కే.

కదలటానిక్కూడా లేకుండా కాళ్ళూ, చేతులూ, నడుమూ సంకెళ్ళతో బిగించారు ఫడ్కేని ఆంగ్లేయులు పూనాలో అతనిమీద కేసు సాగింది. సంకెళ్ళలో కూడా చిరునవ్వులు చిందిస్తూ సగర్వంగా తలెత్తుకుని కూర్చున్నాడా వీరసింహం, విచారణ సమయంలో, నాల్గోరోజు అతనిచ్చిన వాజ్మూలం చారిత్రాత్మకమైంది. భావి క్రాంతి కారులకు స్ఫూర్తిదాయకంగా శాశ్వత స్మరణలో నిలిచిపోయింది.

పొట్టలు పోసుకోవడానికి వర్తకపు జాతి మా మీద వచ్చి పడింది. కుక్కల్లా పొంచి మా వ్యవహారాల్లో తలదూర్చింది. దీన్ని నేను సహించలేదు. అందుకోసమే బ్రిటీషు ప్రభుత్వానికి విరుద్ధంగా విప్లవం లేవదీశాను. మా పథకం సఫలమైతే అతి చమత్కారంగా ఆంగ్లేయుల్ని వెళ్ళగొట్టి భారతీయ ప్రభుత్వాన్ని స్థాపించాలనే నా ఆశయం కూడా సఫలమవుతుంది. అప్పుడు 'పరలోకమందున్న తండ్రి' మాత్రమే ఆంగ్లేయుల్ని రక్షించగలడు.

కానీ (దురదృష్టవశాత్తు) అది జరుగలేదు. నాకు అపజయం ఎదురైంది. నేనిదంతా నా స్వదేశం కోసం చేశానని ఆ భగవంతుడికి తెలుసు. ఓ హిందూస్థాన నివాసులారా! నేను మీకు ఎటువంటి లాభమూ చేకూర్చలేకపోయాను. నేను నా ధ్యేయాన్ని సాధించలేకపోయాను. దీనికి నన్ను మన్నించండి. కానీ భారతీయులకు, భగవంతుడికి తెలుసు - వాసుదేవుడు భారతీయ యువకుల హృదయాల్లో సరికొత్త ఆవేశాన్ని రగిలించాడని. అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించి ఏడెన్ కు తీసుకు వెళ్లారు ఇంగ్లీష్ లో. జైలు నుంచి పారిపోయి భారత్ చేరే ప్రయత్నం విఫలం కాదా 17.2.1883 న సాయంకాలం 4.20 గంటలకు భారతమాత స్మరణలో కన్ను మూశాడా త్యాగమూర్తి. ఫడ్కే జ్వలించిన క్రాంతి హోమగుండం ఆ తర్వాత నిరంతరం ప్రజ్వరిల్లింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment