Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మదన్ లాల్ ధీంగ్రా జీవిత చరిత్ర - about madan lal dhingra in telugu - megaminds

లండన్‌లో సావర్కర్ తీర్చిదిద్దిన చిచ్చరపిడుగు మదన్ లాల్ ధీంగ్రా. ఒక హిందువుగా నేను నా దేశానికి జరిగిన హానిని భగవంతుని కి జరిగిన అవమానంగా...


లండన్‌లో సావర్కర్ తీర్చిదిద్దిన చిచ్చరపిడుగు మదన్ లాల్ ధీంగ్రా. ఒక హిందువుగా నేను నా దేశానికి జరిగిన హానిని భగవంతుని కి జరిగిన అవమానంగా భావిస్తాను. దేశమాత కార్యమంటే శ్రీ రాముడి కార్యమే! ఆమెకు చేసే సేవ అంటే శ్రీకృష్ణుడు కి చేసే సేవయే అని నమ్మిన వ్యక్తి ధీంగ్రా. 1883 సమయంలో పంజాబ్ అమృత్‌సర్ లో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న పంజాబ్ ఖత్రీ కుటుంబీకులలో గొప్ప సివిల్ సర్జన్ డాక్టర్ గీతా మాల్‌ ధీంగ్రా. డాక్టర్ గీతా మాల్ యొక్క ఏడుగురు సంతానం లో మదన్ లాల్ ధింగ్రా ఆరవవాడు ధీంగ్రా సెప్టెంబర్ 18 1983 న జన్మించాడు, పుట్టుకతోనే శ్రీమంతుడు. గీతా మాల్ ఆరుగురు కుమారులు విదేశాలలో చదువుకున్నారు వారిలో ధీంగ్రా ఒకడు.
పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ పై పైశాచికంగా లాఠీ చార్జి చేసిన లార్డ్ కర్జన్ విల్లే వలన ఆరోగ్యం క్షీణించి భారతమాత విముక్తికై ప్రాణాలర్పించిన లజపత్ రాయ్ మరణం మదన్ లాల్ ధీంగ్రా ను కలిచివేసింది. ప్రతీకారంగా కర్జన్ ను ఎలాగైనా చంపడానికి నిర్ణయించుకు‌‌న్న ధీంగ్రా చదువు నెపంతో జూన్ 1906 లో,  ధింగ్రా అమృత్సర్ నుండి బ్రిటన్ బయలుదేరాడు. ఇంజనీరింగ్ చదువుకోవడానికి లండన్‌లోని యూనివర్శిటీ కాలేజీలో చేరాడు. శ్యామాజీ కృష్ణవర్మ ఇండియా హౌస్ స్థాపించిన ఏడాది తరువాత ధింగ్రా లండన్ వచ్చాడు. హైగేట్‌లోని ఈ సంస్థ భారతీయ విప్లవ వీరులకు సమావేశ స్థలం. వీరంతా వారం వారం సమావేశాలను నిర్వహించుకొనేవారు, ధింగ్రా తరచుగా హాజరవుతూ ఉండేవాడు. సావర్కర్ అప్పుడు ఇండియా హౌస్ మేనేజర్ గా ఉన్నారు.
ఆ సమయంలో సావర్కర్ మాటలు తనకు ప్రేరణ ఇచ్చాయి. కర్జన్ ను చంపే అవకాశం కోసం ఇండియా హౌస్ ఎదురు చూస్తూ వుంది, అదే సమయంలో ఒక అవకాశం రానే వచ్చింది, సావర్కర్ మాటలు తూటాల రూపంలో కర్జన్ గుండెల్లో దించడానికి యువకులంతా సిద్దంగా ఉన్నారు. సావర్కర్ కోరిక మేరకు కర్జన్ ను ధీంగ్రా చంపవలసిందింగా పిలుపు. అప్పుడు మదన్ లాల్ ధీంగ్రా టోటెన్హామ్ కోర్ట్ రోడ్ లోని ఒక పరిధిలో పిస్టల్ షూటింగ్ ప్రాక్టీస్ చేపట్టాడు. లార్డ్ కర్జన్ సన్మాన సభ. ఇదే మంచి అదునుగా భావించి అందుకోసమై తన దగ్గర ఉన్న లా పుస్తకాన్ని  పిస్టల్ పట్టేవిదంగా మధ్య పేజీలు కత్తిరించి ఆపుస్తకలో  ఆయుధాన్ని దాచి జూలై 1, 1909 న, ఇంపీరియల్ ఇనిస్టిట్యూట్‌లో నేషనల్ ఇండియన్ అసోసియేషన్ నిర్వహించిన 'ఎట్ హోమ్' కు హాజరయ్యాడు. ఈవెంట్ ముగింపులో, అతిథులు బయలుదేరుతుండగా, ధింగ్రా ఇండియా ఆఫీస్ అధికారి సర్ కర్జన్-విల్లీని దగ్గర్లో కాల్చి చంపాడు. అతని బుల్లెట్లు పార్సీ వైద్యుడు డాక్టర్ లాల్కాకాకు కూడా తగిలింది. ధీంగ్రా అక్కడి నుండి పారిపొకుండా అక్కడ నిలబడ్డాడు కావాలని అరెస్టు అయ్యాడు. వెంటనే ధింగ్రాను అరెస్టు చేశారు లండన్ పోలీసులు. తన విచారణలో, ధింగ్రా తనను తాను ప్రాతినిధ్యం వహించాడు, ప్రపంచానికి ఒక భారతీయుడు ఇంగ్లాండ్ అధికారిని కాల్చిచంపాడు అనే సందేశం యావత్ ప్రపంచానికి తెలిపాడు. అతను కర్జన్-విల్లీని దేశభక్తి చర్యగా హత్య చేశాడని మరియు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులను అమానుషంగా హత్య చేసినందుకు ప్రతీకారంగా ఉందని పేర్కొన్నాడు. కానీ అతన్ని కోర్టు దోషిగా తేల్చింది మరియు మరణశిక్ష విధించింది.
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి .అదేమీ టంటే చిన్నప్పటి నుండి చాలా నీట్ గా డ్రస్ వేసుకోవడం, తల చెరగ కుండా దువ్వుకోవడం ఎప్పుడూ చలాకీగా సంతోషంగా అందరిని పలకరించటం అతని అలవాటు. ఉరిశిక్ష అమలు జరిగే సమయంలో కూడా అదే పలకరింపు అదే సంతోషం అదే చెలాకి తనం ,జైలు అధికారులు ఆశ్చర్యపోయారు. ఇంకో గంటలో ఉరితీస్తారని తెలిసి ఇంత ఆనందంగా, ఎటువంటి చింత లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడో మాకు అర్ధం కావడంలేదు అని ఉరి కొయ్యదగ్గర అందరూ ఆశ్చర్యపోయారు. తలారీ తలపై నల్లగుడ్డ కప్ప బోతే ఆగమని జేబులోంచి దువ్వెన తీసి తలచక్కగా దువ్వుకొని అటు తర్వాత తానే ఆనల్ల గుడ్డ తలపై కప్పుకొని ఉరి తాడు మెడకు తగిలించుకొన్నాడు. ఆగష్టు17 1909 న దేశం కోసం బలిదానం అయ్యాడు మదన్‌ లాల్ ధీంగ్రా. అక్కడి అధికారులు, తలారి కంట తడి పెట్టారు. అతడి ధీరత్వానికి, ఆశ్చర్యపోయి అతడి పార్థివ దేహానికి సెల్యూట్ చేశారు. ఎందరో దేశ భక్తులు నూనూగు మీసాల వయస్సులో ప్రాణాలు అర్పిస్తే దేశానికి స్వాతంత్రం వచ్చింది. అటువంటి వారిలో మదన్ లాల్ ధీంగ్రా ఒకరు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

2 comments

  1. దేశభక్త విప్లవ వీరునికి పాదాభివాదనం 🙏🙏🙏🙏🙏

    ReplyDelete