మతం మారడానికి కారకులెవరు? స్వధర్మంలోకి తీసుకురావడమెలా? కూలంకషంగా విశ్లేషణ చేసి మీ ముందు ఉంచుతున్నాను చైతన్యవంతమైన హిందువుగా ఆలో...
మతం మారడానికి కారకులెవరు? స్వధర్మంలోకి తీసుకురావడమెలా? కూలంకషంగా విశ్లేషణ చేసి మీ ముందు ఉంచుతున్నాను చైతన్యవంతమైన హిందువుగా ఆలోచించి హిందూ ధర్మ రక్షణకై పనిచేస్తారని మనవి.
మతం మారడానికి కారకులెవరు?: భారతదేశంలో క్రైస్తవ మత మార్పిడులు జరగడానికి ముఖ్య కారణం సాటి హిందువులే, ఆపదలో ఉన్న హిందువుకి తోడుగా ఉండటం పక్కన పెట్టి, సాటి హిందువుని అంటరాని వాడిగా చూసిందెవరు, గుడులలోకి రానివ్వకుండా అడ్డుపడిందెవరు ఈ హిందూ సమాజం కాదా చెప్పండి మీరు కాదనే అంటారు ఎందుకంటే అప్పుడెప్పుడో జరిగింది అలా ఇప్పుడు జరగడం లేదుగా గుడులలోకి రావచ్చుగా ఎవరొద్దన్నారు అంటారు లేదా బ్రిటీష్ వాళ్ళు లేదా మహమ్మదీయులు ఈ అంటరానితనం తీసుకు వచ్చారు అది మాకు తెలువదు అని తప్పుకుంటారు తప్ప ఒక్కసారి కూడా ఆలోచన చేయరు.
సాటి హిందువు తెలుసో తెలియక మతం మారాడు ఓసారి అతనితో మాట్లాడి మరల వెనక్కు తీసుకురావాలనే ఆలోచన రాపోగా పొద్దున లేస్తే ఎర్రిమొహాలు, గొర్రెలు, బొట్టు లేకుండా మొగుడు చచ్చిన దానిలాగా తిరుగుతారు, ఇంకేదో ఇంకేదో మాటలతో తెలిసో తెలియక మతం మారిన వాళ్ళని హేళన రోజూ చేస్తూనే ఉన్నాము ఇది హిందూ సమాజం తప్పుకాదా? మన హిందూ సమాజం లో మన అక్క చెల్లెళ్ళు మాత్రం ఫాష్ కల్చర్ పేరుతో బొట్టు పెట్టుకోకుండా ఊళ్ళ మీద పడితిరుగుతుంటే గమ్మున ఉంటాం ఎందుకు?
హా మేము అలా తిట్టకుండా ఉంటే వాళ్ళు మరలా తిరిగి తల్లి ఒడికి చేరతారని నమ్మకం ఉందా? అని మరలా తిడతారు ఏ మతం మరితే తిరిగి మరలా మతం మారే అవకాశం ఇవ్వరా లేదా సమాజం నుండి ఈ పేరుతో ఒక జాతిని మొత్తం దూరం చేయడం హిందూ సమాజం తప్పుకాదా? మనమంతా హిందువులం అంటూ ఉంటారు ఏనాడన్న ఈ సాటి సమాజం లో ఓ అట్టడుగు ప్రజా సముదాయం లోకి వెళ్ళి వారింట భోజనం చేశారా లేదా వాళ్ళనే పిలిచి భోజనం పెట్టారా లేదే కానీ వాళ్ళను మాత్రం ఎర్రిమొహాలు, మతం మారిన ఎదవలు అని తిడతారు.
ఇదేనా హిందుత్వ నేర్పింది మనకు సాటి హిందువు ఒకప్పుడు ఇంటికొస్తే అంటరానివాడిగా చూశావు అది నీవు కాదు నీ పూర్వులు మరి నివ్విప్పుడు చైతన్యం కలిగిన హిందువువి కదా మరి కనీసం నీ ఇంటికొచ్చిన పేదవాడికి డిస్పోసల్ గ్లాస్ లో నీరెందుకిస్తున్నావ్ నువ్ తాగే బాటిల్ నే ఇవ్వొచ్చుగా అలా చేయవు కానీ నీవు చైతన్యం కలిగిన హిందువువి మరలా తిడతావు మతం మారారు మతం మారారు అని గొల్లున రోజుకి పది పోస్ట్ లు పెడతావు సోషల్ మీడియాలో ఇంక మనసులో ఏముందో ఆ భగవంతునికే తెలియాలి.
ఒక చైతన్యం కలిగిన నాగరిక సమాజం లో జీవిస్తూ సాటి హిందూ సమాజం లో పేద పిల్లలతో, మన ఇంటి పని మనిషి అనికూడా చూడకుండా ఆ పిల్లని గొడ్డులా మీద పడి ఆగమాగం చేస్తావు కాని ఆ పిల్లను పెళ్ళి చేసుకోని మంచి హిందువుగా భార్యగా స్వీకరించలేవు ఎందుకు నీవు కూడా చైతన్యం కలిగిన సమాజం లో జీవిస్తున్న హిందువువేగా ఏం సంసారానికి అడ్డురాని కులం పెళ్ళి కి అడ్డు వచ్చిందా? తప్పంతా మన దగ్గర హిందూ సమాజం లో పెట్టుకుని మతం మారిన సాటి హిందువు మీద ఎందుకింత కక్ష?
ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మత మార్పిడీలకు విదేశాల నుండి డబ్బులు వస్తున్నాయి అని వాదిస్తారు, అసలు విదేశాల నుండి వచ్చే డబ్బులు కన్నా కూడా మన దేశం లో ఉన్న మిషనరీ స్కూళ్ళ లో మనం కట్టే ఫీజులే కోట్లలో ఉన్నవి. అలాగే మనం ఇంకోటి రోజు గొల్లున మొత్తుకుంటాం మిషనరీ స్కూల్ లో మా పిల్లని బొట్టు పెట్టుకోనివ్వడంలేదు, గాజులేసుకోనివ్వడం లేదు, మాల వేసుకోనివ్వడం లేదు అని మరలా హిందూ సమాజమే వాపోతుంది, తప్పులు చేసేది హిందూ సమాజం లో ఉన్న మనం కాని నిందలు వాళ్ళమీదా? తిరిగి హిందూ ధర్మం లోకి రాకుండా మరియు మతం మార్పిడీలకు ముఖ్య కారణం హిందూ సమాజమే కాదని చెప్పగలరా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి.
స్వధర్మంలోకి తీసుకురావడమెలా?: ఒక్కసారి ఆలోచన చేయండి, తిట్టడం మానండి, ఎక్కడో ఒక మారు మూలన గ్రామాలలో, కొండ కోనలలో, అడవులలో, పర్వతాలలో నివసిస్తున్న వారిని మతం మార్చడం కోసం వందల సంవత్సరాల నుండి ఈ దేశం లో అనేకమంది క్రైస్తవ మూకలు, ఫాదరీలు వచ్చి పైన చెప్పిన ప్రదేశాలలో ఏళ్ళ తరబడి ప్రయత్నం చేసి మతం మారుస్తున్నారు. మన సాటి అమాయక హిందువులని ఎదో ఒక నెపంతో మన బలహీన క్షణాలను ఆసరా చేసుకొని మనసాటి హిందువులను మనకు కాకుండా చేస్తున్నారు.
కానీ మనం ఏ మాయ మాటలు చెప్పాల్సిన పనిలేదు మన భారత సనాతన హిందూ ధర్మం లో చెప్పబడిన శ్లోకాలను అనుసరించి ఆత్మవత్ సర్వభూతానీ, సర్వేజనా సుఖినో భవంతు అనే వాటిని అర్దము చేసుకుని సాటి హిందువులను గౌరవిస్తూ, మనం గౌరవం గా ఉంటూ ఎవరైతే మత మార్పిడీలకు గురి కాబడ్డారో, కాబడుతున్నారో వారిని గుర్తించి సరైన పద్దతిని ఎంచుకుని మతం మారిన వారికి తల్లీ మనం శభరి మనుమలం, మనుమరాళ్ళం, వాల్మీకీ వంశస్తులం, రవిదాస్ బిడ్డలం అని ప్రేమతో, దయతో మనం చెప్పాలి ఒక్కసారి కాదు వందసార్లు కాదు వాళ్ళు తిరిగి మరలా హిందుత్వం లోకి వచ్చే వరకు మనం పని చేయాలి.
దీనికి ప్రతి హిందువు హిందూ సమాజం మొత్తం సంసిద్దం కావాలి ఎదో ఒకరో ఇద్దరో లేక ఎదో ఒక సంస్థనో కాదు మొత్తం మొత్తం హిందూ సమాజం ప్రయత్నం చేయాలి, ఏం సాటి హిందువు మతం మారితే చూస్తూ ఊరుకుంటావా ఒక హిందువై ఉండి, లే గమ్యం చేరే వరకు విశ్రమించకు అని స్వామి వివేకానంద పిలుపిచ్చారు యావత్ దేశం అంతా తిరిగి హిందూ ధర్మం వైపు తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ వివేకానంద కావాలి. దరిద్రుణ్ణి పూజించాలి సేవ చేయాలి.
మతం మారిన సాటి హిందువుని సూటిపోటి మాటలతో కాకుండా సాటి హిందువుగా తిరిగి హైందవం లోకి తీసుకురావాలి. మిషనరీ స్కూల్ లో మన పిల్లలను చేర్పించవద్దు అలా మీకు తెలిసిన వారు చేర్పిస్తున్నా ఆపించండి, ఈశాన్య భారతదేశంలో పునరాగమనం మొదలయ్యింది మరల హైందవీకరణ జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా జరుగుతుంది దానిలో కార్యోన్ముఖులై పనిచేస్తున్న వేలాది మంది హిదువులు ఉన్నారు కాని ఈ సంఖ్య పెరగాలి. అణగారిన వర్గాలుగా భావింపబడుతున్న వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేయాలి, ముఖ్యంగా స్వామీజీలు కూడా ఆశ్రమాలు వదిలి గ్రామాలలోకి రావాలి, కమలానంద భారతీ స్వామీజీ లాంటివారు ఆ ప్రయత్నం లో ఉన్నారనే చెప్పాలి, ఇలా పనిచేసే స్వామీజీ ల బయటకు తీసుకురావాలి.
సమాజ కార్యం లో పని చేస్తున్నటువంటి వాళ్లలో కూడా ఎన్నో బేధాభిప్రాయాలు ఉన్నాయి. ముందుగా వాటిని పక్కన పెట్టి తల్లి భారితి ఉన్నతి కోసం నడుంకట్టలేమా? ధర్మం కోసం ఎన్నో త్యాగాలు ఎందరో చేశారు, మనమూ చేస్తున్నాము, మరాలంటప్పుడు ఈ విభేదాల జెంజాటమెందుకు. సామాజిక సమరసతతో ముందుకెళ్ళాల్సిన సమయం ఇది. లే నీలో ఉన్న అనుమానాలు తొలగించుకో, అహాన్ని వీడి తోటి హిందువుతో కలిసి పనిచేయి, ధర్మం కోసం పనిచేసిన దుర్గాదాస్ రాథోడ్ లా, బందా సింగ్ భైరాగిలా శత్రువు పై విరుచుకుపడు, మన తోటి హిందువుని గర్వంగా తిరిగి హిందుసమాజంలోకి తీసుకురా! అది నీవే చేయగలవు, నీవు మాత్రమే చేయాలి కూడా...
పరస్పర ఆధారిత సర్వాంగ ఉన్నతిని సాధించినటువంటి గ్రామ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, భారతీయ సనాతన హిందూ ధర్మ వ్యవస్థలో అంతర్భాగం వాటిని కాపాడుకోవాలి. సమైక్య సంఘటన శక్తితో సమాజ నిర్మాణాన్ని చేస్తూ అట్టి లక్ష్యాన్ని సాధించడానికి మనం కలిసి పయనిద్దాం. సామాజిక సమరసతా సాధనకై పనిచేస్తున్న సంస్థలతో, అలా ముందుకు వచ్చే స్వామీజీలతో పాదయాత్రలు చేద్దాం. యావత్ హిందూ సమాజం మొత్తం, సాటి హిందువును గౌరవించిన రోజున ఈ దేశం లో మతమార్పిడీలు ఉండవు. అప్పటి వరకూ మత మార్పిడులు జరుగుతూనే ఉంటాయి. సోషల్ మీడియాలో లొల్లి చేస్తే ఆగవు, కార్యక్షేత్రంలో కార్యోన్ముఖలై సింహగర్జన చేద్దాం. జై శ్రీ రామ్... జై హిందు రాష్ట్ర... -NSK చక్రవర్తి.
Very nice message
ReplyDeleteTrue. We hindus responsible for religious conversion and love jihad, due to caste feeling...
ReplyDeleteఒక మంచి పోస్టు చదివిన ఆనందం కలిగింది బాగా చెప్పారు మేమే ఎన్నోసార్లు విలేజ్ ఇళ్లకు వెళ్లి కాన్వాస్ చేసి చూసాం. వాళ్లని మార్చడం చాలా కష్టం అక్కడే ఉండి మార్చాలి అప్పుడే వాళ్లు మారుతారు ఫాదరిలు మిషనివారులు చేసినట్లుగా..,... వారానికొకసారి వెళ్లి ప్రయత్నించడం వలన ఉపయోగం లేదు మా ప్రయత్నాలను వృధా అయిపోతుంది
ReplyDelete