సిక్కుల గురువు గురుగోవింద్ సింగ్ కుమారులైన ఫతే సింగ్, జొరావర్ సింగ్ లు ఇద్దరు ఒకరు ఐదు సంవత్సరాల మరొకరు ఏడు సంవత్సరాల వయస్సులో దేశం కోసం, ధర...
సిక్కుల గురువు గురుగోవింద్ సింగ్ కుమారులైన ఫతే సింగ్, జొరావర్ సింగ్ లు ఇద్దరు ఒకరు ఐదు సంవత్సరాల మరొకరు ఏడు సంవత్సరాల వయస్సులో దేశం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన వీర పుత్రులు.
ఒకసారి గురు గోవింద సింగ్ ఆనందపూర్ కోటలో ఉండగా ఆ కోటపై ముగలాయిలు దాడి చేశారు. గురుగోవింద్ సింగ్ పుత్రుడైన అజిత్ సింగ్, జడు ఝూర్ సింగ్ లు (ఫతే సింగ్, జొరావర్ సింగ్ ల కంటే పెద్దవాళ్ళు) ఆయుద్ధంలో మొఘలులతో పోరాడి వీర మరణం పొందారు, దాంతో గురుగోవింద్ సింగ్ కుటుంబం ఆనందపూర్ ను వదలాల్సి వచ్చింది. ఆనందపూర్ ను వదిలిపెట్టే క్రమంలో గురుగోవింద్ సింగ్ కుటుంబం విడిపోయింది. ఆయన చిన్న కుమారులు జొరావార్ సింగ్ ఫతే సింగ్ లు వారి నానమ్మ గుజరీమాతతో కలిసి ఒక కార్మికుడి ఇంట్లో కొంతకాలం పాటు నివసించారు. తరువాత వారి పాత సేవకుడైన గంగూ పండితుడి ఇంటికి మకాం మార్చారు. సహజంగానే గుజరీమాత సిక్కు గురువుల త్యాగం, వీరత్వం, బలిదానం గూర్చిన గాధలు పిల్లలకు చెబుతూ ఉండేది. పిల్లలు కూడా తమ నానమ్మ చెప్పే తమ పూర్వీకుల వీరగాధలు శ్రద్ధగా వినేవారు. గంగూ పండితుడు ధనాశతో వారిని మొఘలులకు పట్టించాడు. గుజరీమాతకు, పిల్లలకు ఆహారం కూడా పెట్టకుండా డిసెంబరు నెల చలిలో ఒక బురుజులో ఉంచారు. పిల్లలు తమ నానమ్మతో కలిసి భగవత్ భజన చెయ్యడం మొదలు పెట్టారు.
గుజరీమాత రాత్రంతా పిల్లలకు వీరగాథలు చెబుతూ గడిపింది. ఈ క్లిష్టమైన పరిస్థితులలో వారు తమ ధర్మం పట్ల నిప్టను కోల్పోకుండా ఉండేలా వారికి తగిన బోధలు చేసింది. తమ పూర్వీకుల మరియు తండ్రి పేరు నిలబెడతామని, ఏ విధమైన ప్రలోభాలకు గాని, ప్రాణ భయానికి గాని తలొగ్గమనీ ఆ బాలురు వాళ్ళ నాన్నమ్మకు వాగ్దానం చేశారు. పొద్దున నవాబు ఆ పిల్లలను ఇస్లాం మతం స్వీకరించమని ఒత్తిడి చేశాడు. కానీ పిల్లలు నిర్భయంగా పెద్ద గొంతుతో మేం గురు గోవింద సింగ్ పుత్రులం, మా తాత గురు తేజ్ బహదూర్ హిందూ ధర్మాన్ని రక్షించడానికి బలి దానం చేశారు. మేము వారి సంతానం. మేము మా ధర్మాన్ని ఎప్పటికీ వదులుకోము. మాకు ధర్మం ప్రాణాల కంటే ప్రియమైనది అని పలికారు. పిల్లలూ మిమ్మల్ని వదిలి పెడితే మీరు ఏం చేస్తారు?" అని ప్రశ్నించిన మంత్రి సచ్చానందునికి మేం సైనికులను సమకూర్చుకుంటాం మీరు చేస్తున్న అత్యాచారాలను ఆపడానికి మేము చనిపోయేవరకు యుద్ధం చేస్తాం అని జవాబిచ్చాడు జొరావర్ సింగ్ అప్పుడు పిల్లల మనో ధైర్యం పోగొట్టడానికి మీ తండ్రి, మీ అన్నలు యుద్ధంలో చనిపోయారు. ఇక మీకు ఈ లోకంలో ఎవరూ లేరు కాబట్టి నవాబు చెప్పినట్లు వినండి ఇస్లాం స్వీకరించండి. అని చెప్పాడు మంత్రి పిల్లలు మరింత గట్టిగా మాతండ్రి ఒక మహావీరుడు, ఆయనను ఎవరూ చంపలేరు అన్నారు. ఈ జవాబు విన్ననవాబు వారిని సజీవ సమాధి చేయాల్సిందిగా అజ్ఞాపించాడు.సజీవ సమాధి చేయడం కోసం పిల్లలిద్దరినీ నిర్ణీత స్థలానికి తీసుకొచ్చారు. సజీవంగా సమాది చేయండి ఆదేశం రాగానే అందరూ ఆ పిల్లలిద్దరూ బయపడతారు అనుకున్నారు కానీ అలా జరగలేదు వాళ్ళిద్దరూ ఒకర్ని ఒకరు చూసుకున్నారు సంతోషంగా ఆ నవ్వులో ధర్మం కోసం దేనికైనా సిద్దం అనే ఒక గర్వం తొణికిసలాడింది. వెంటనే రక్షకబటులు కొన్ని ఇటుకలు సున్నపు మట్టి తెచ్చి వారిద్దరు చుట్టూ పేర్చడం ప్రారంబించారు మద్యలో మంత్రి ఇప్పటికైనా చెప్పండి మతం మారుతారా? ఊహు లేదు ప్రాణం ఉండగా అది జరగదు అని ధర్మం కోసం గర్వంతో కూడుకున్న సమాదానం, ఇక ఇటుకలు మెడవరకూ పేర్చరూ అప్పుడు కూడా అదేతంతు అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు, పెద్దవాడి కళ్ళవెంట నీరుకారుతుంది అది చూసి తమ్ముడు ఏడూస్తున్నావా అన్నా అన్నాడు లేదు తమ్ముడు నాకన్నా చిన్న వాడివే అయినా ముందే ధర్మం కోసం ప్రాణత్యాగం చేస్తున్నావు అని చెప్పాడు. ఇద్దరు పిల్లలూ నవ్వుతూ నిశ్చింతగా నిలబడి అలా ధర్మం కోసం సజీవ సమాధి చేయబడ్డారే తప్ప మతం మారలేదు.
ప్రపంచ చరిత్రలో చిన్నపిల్లలను ఇంత నిర్దయగా అంతమొందించిన సంఘటన మరొకటి లేదు, అదే విధంగా ఈ వీర బాలురు చూపిన అపూర్వ సాహసం ప్రపంచంలో మరే దేశ చరిత్రలోనూ కనపడదు. మాఛివాడేలోని ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా, తన చిన్న కుమారులిద్దరూ సజీవ సమాధి చేయబడ్డారన్న వార్త గురు గోవింద్ సింగ్ కు తెలిసింది. గురు గోవిందుడు చలించలేదు. బాణంతో ఒక మొక్క పెకలించి ఇక మొగల్ సామ్రాజ్యం కూడా ఇలాగే పెకిలించి వేయబడుతుంది అని పలికాడు. గురు గోవింద్ సింగ్, అయన కుమారుల సాహసము, పరాక్రమము, త్యాగము చరిత్ర పుటలలో అజరామరంగా నిలచిపోయింది. మొఘల్ సామ్రాజ్యం ఇక ఆ రోజు నుండి పతనం కావడం మొదలయ్యింది దేశం అంతా ఉవ్వెత్తున్న ఒక జ్వాలలా స్వతంత్ర కాంక్ష మొదలయ్యింది శివాజీ హిందూ సామ్రాజ్య స్థాపన చేశాడు.
No comments