Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అఫ్జల్ ఖాన్ ని శివాజీ ఎలా వధించాడు? - Who Killed Afzal Khan - megamindsi

17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోరణి కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన,...

17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోరణి కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేసాడు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజి అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. శివాజీ దాడులతో ఆదిల్ శా సతమతమవుతున్నాడు. కాబట్టి అతడికి తక్షణ పరిహారం అవసరం అయింది. అపుడు అతడికి గుర్తుకొచ్చిన పేరు అఫ్జల్ ఖాన్. సేనాపతి అయిన అఫ్జల్ ఖాన్  ఆదిల్ శాహి రాజకుటుంబపు ప్రముఖ వ్యక్తి. పదివేల మంది సైనికులకు నాయకుడు. 

అంతటి వీరుడైన అఫ్జల్ ఖాన్ కు ఒక దౌర్బల్యముండేది. అతడి జీవితపుటడుగులను శుభ-అశుభ శకునాలు నిర్ధారించేవి. యుద్ధాలలో పాల్గొనే ముందు అతడు భవిష్యత్తును తెలుసుకునే ముందుకెళ్ళేవాడు. శివాజీని నియంత్రించడానికి అఫ్జల్ ఖానే సరైన వ్యక్తి అని ఆదిల్ శా నిర్ణయించాడు. యథాప్రకారం అఫ్జల్ ఖాన్ జ్యోతిష్కులను కలుసుకుని తన భవిష్యత్తు ఏమిటని అడిగాడు.  "నువ్వు బయల్దేరుతున్న సమయం  సరైంది కాదు. ఈ యుద్ధంలో నువ్వు గెలవలేవు. అంతేకాదు, ప్రాణాలతో తిరిగిరావడం కూడా సందేహమే" అన్న మాటలు విని విచలితుడయ్యాడు. ఇక అఫ్జల్ ఖాన్ కున్న అరవైనాలుగు మంది భార్యలను చంపాలని నిర్ణయానికి వచ్చాడు అరవై మూడు ‌మందిని ఒకేచోట చంపించాడు, ఖతీజా బీబీ అనే భార్య మాత్రం తప్పించుకుపోబోయింది కానీ దారిలో చంపేశారు అక్కడ ఆతరువాత ఆమె పేరిట ఖతీజా పుర అనే ఊరు గా మిగిలిపోయింది. మిగిలిన అరవై మూడు మంది పేర్లు ఎవరికీ తెలీకుండా గోరీలలో మట్టిక్రింద కప్పబడిపోయాయి. ఒక జోస్యం ఇంత పని చేసింది. తాను చనిపోవడం ఖాయమని తెలిసి, భార్యలందరినీ హత్యచేసి ఒకే స్థలంలో సమాధి చేయడానికి వ్యవస్థ చేశాడంటే, అఫ్జల్ ఖాన్ ఎంత క్రూరుడో ఊహించుకోండి. 

శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకొన్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చకొట్టడానికి శివాజీ ఇష్ట దైవమయిన భవానీ దేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్దముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్‌ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి ఇద్దరూ అంగీకరించారు.

అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినపుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికాధికారులను, శివాజీ సైన్యాధికారులు అడ్డుకోనగా, శివాజీ తన దగ్గరన్న పిడి పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీనరసింహ వలె చీల్చి చెందాడుతాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటకు పారిపోతుండగా, ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు. అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమయిన అడవుల్లో అటకాయించి మెరుపు దాడులతో మట్టికరపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. కౄరుడైన, దుర్మార్గుడైనా అఫ్జల్ ఖాన్ తను చస్తానని తెలిసి సొంత భార్యలనే 64 మందిని చంపి‌న నీచుడ్ని చత్రపరి శివాజీ వదించిన రోజు 10 నవంబర్ 1659. జై శివాజీ జై హిందు రాష్ట్ర. -నన్నపనేని రాజశేఖర్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments