Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మురుడేశ్వర్ గోపుర నిర్మాత ఎవరో తెలుసా? - About RN Shetti in Telugu

R.N షెట్టి గారు శాశ్వతంగా శివ సన్నిధికి చేరారు, అని తెలియజేయుటకు చింతిస్తున్నాము. వారు గురించి MegaMinds శ్రద్దాంజలి ప్రకటిస్తూ ...

R.N షెట్టి గారు శాశ్వతంగా శివ సన్నిధికి చేరారు, అని తెలియజేయుటకు చింతిస్తున్నాము. వారు గురించి MegaMinds శ్రద్దాంజలి ప్రకటిస్తూ రెండు మాటలు.

మురుడేశ్వర్ గోపుర నిర్మాత ఎవరో తెలుసా? మురుడేశ్వర్ వెళుతున్నారంటే ఈ మహనీయని గురించి తెలుసుకోవాల్సిందే.. ప్రపంచంలో ఎత్తైన గోపురం ఏదీ అంటే ఎవరైనా టక్కున చెప్పే పేరు మురుడేశ్వర్. అసలు ఆ పేరు తెలియని వారు కూడా ఆ గోపురం ఫోటో కనపడగానే పరవశించి పోతారు. అంత అద్భుతంగా కట్టారు. ఒక మహానుభావుడు కోట్ల రూపాయలతో మురుడేశ్వర్ ఆలయాన్ని మొత్తం అభివృద్ధి చేశారు. 249 అడుగులు ఎత్తు ఉండే ఆ దేవాలయ గోపురం పైకి ఎక్కడానికి లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారంటే ఆ గోపురాన్ని నిర్మించిన మహనీయుడు ఎంత పుణ్యాత్ములో కదా.

ఆయనే ఆర్_ఎన్_శెట్టిగారు (92). కర్ణాటకలో ఆయన పేరు తెలియనివారు ఉండరు. ఆగస్టు 15, 1928 న ఆయన మురుడేశ్వర్‌లో ఒక సాధారణ 2 ఎకరాల చిన్న రైతు కుటుంబంలో జన్మించారు. కష్టపడుతూ, నిజాయితీతో అంచలంచలుగా ఎదిగి భారత దేశానికి టాటా కంపెనీ ఎలాగో, కర్ణాటకలో RNS_Group అలాగా తయారు చేశారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల, ప్రాజెక్టులు, పెద్ద పెద్ద డ్యాంలు, ప్రపంచ ప్రసిద్ధ కొంకణ్ రైల్వే టన్నెల్, జాతీయ రహదారులు, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ వంటి అనేక నిర్మాణాత్మక, అభివృద్ధి కార్యక్రమాల్లో చరిత్రలో నిలిచిపోయేలా తనదైన చరగని ముద్రవేశారు..
కర్ణాటకలోని హిడ్‌కాల్ రిజర్వాయర్, తత్తిహళ్ళి రిజర్వాయర్, సూప డ్యాం, గురుసప్ప రిజర్వాయర్, మాణి డ్యాం, వారాహి హైడ్రో పవర్ ప్రాజెక్ట్.. ఇలా ఒకటేమిటి జాతికి తరతరాలు ఉపయోగపడే ప్రాజెక్టులు అందించారు.

ఆయన క్రృషికి గుర్తింపుగా 2004లో విశ్వేశ్వరయ్య మెమోరియల్ అవార్డుతో గౌరవం పొందారు. 2009లో బెంగుళూరు యూనివర్సిటీ ఆయన్ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన్ను మహాదాని (Great Philanthropist) అని కీర్తించారు.. ఆయన 17-12-2020 న గురువారం గుండెపోటు కారణంగా శాశ్వతంగా శివసన్నధికి చేరుకున్నారు....!!

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment