డిసెంబర్ మాసం మొదలయ్యిందంటే చలి విపరీతంగా పెరుగుతుంది. ఇది భారత్ లో కాలానుగుణంగా జరిగే ఒక మార్పు కానీ డిసెంబర్ నెల వచ్చిందంటే దే...
డిసెంబర్ మాసం మొదలయ్యిందంటే చలి విపరీతంగా పెరుగుతుంది. ఇది భారత్ లో కాలానుగుణంగా జరిగే ఒక మార్పు కానీ డిసెంబర్ నెల వచ్చిందంటే దేశంలో ఒక మూక ఇంటి చుట్టూ తిరిగి మా మతంలోకి రండి, మా మతంలోకి రండి అంటూ కరపత్రాలతో ప్రత్యక్షమవుతారు. అలా వచ్చి నిన్ను మొదట నీ కుటుంబం నుండి, ఆ తరువాత నీ మతం, నీ జాతి, నీ దేవుళ్ళ నుండి దూరం చేస్తూ దేశం మీద, ధర్మం మీద అసహ్యమైన పదజాలంతో నీవే విమర్శలు చేసేట్లు మార్చి, ఏమార్చి నీసంపాదనలో దశమ భాగాన్ని దోచేస్తారు.
థ్యాంక్స్ గివింగ్ డే పేరుతో మొదలయి ఈ అరాచకం జనవరి ఒకటితో ముగుస్తుంది. సుమారు నలబై ఐదు రోజుల పాటు ఈ ప్రచారం కరపత్రాలతో, మైకులతో, అనేక పేర్లతో కూటములు నిర్వహిస్తూ సామాన్య ప్రజలను వారి యొక్క బలహీనతను ఆసరా చేసుకుని పాస్టర్లు మన దేశానికి, ధర్మానికి దూరం చేస్తారు. ఇది మీకు తెలియనిది కూడా కాదు ఈ వ్యాసం క్రైస్తవుడు చదువుతున్నప్పటికీ మిమ్మల్ని కూడా ఇలాగే ఏదో ఒక బలహీనత కారణంగానే మతం మార్చారు అనేది సత్యమని ఒప్పుకోక తప్పదు. లేదు మేము భగవద్గీత చదివాము, అది అర్దము కాలేదు, అందుకని ఇక బైబిల్ చదివి నిజమైన దేవుడిని తెలుసుకున్నాము అని అబద్దం చెప్పాలనుకోకండి. ఒకవేళ బైబిల్ నిజంగా చదివితే అందులో ఉన్న వాక్యాలు మీరు సమ్మతించలేరు ఒక భగవద్గీత చదివిన జ్ఞానిగా.
మతం మారిన సామాన్య క్రైస్తవులకు నా విన్నపం: మీరు ఏ కారణం చేత మతం మారారు? మతం మారిన తరువాత నిజంగా మీరనుకున్నది సాధించగలిగారా? సాధిస్తే అది మీ శ్రమ, తెలివి లేకుండా మీరనుకున్నది సాధించారా? ఏసు మీకు ఏ విధంగా ఈ పనిలో సహకరించాడు? ఇలా ఒక చైతన్యం కలిగిన క్రైస్తవుడిగా ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు మీకు నిజానిజాలు తెలుస్తాయి, ఆ తరువాత మీరు మీ చైతన్యం ద్వారా నేను క్రైస్తవుడిని కాదు హిందువునని అర్దమవుతుంది. ఆ తరువాత ఒకసారి వెనుతిరిగి ఆలోచన చేయండి. నా కుటుంబం ఏమిటి? నా తల్లిదండ్రులు, తాతలు మతం మారలేదు నేను ఏదో చిన్న చిన్న కారణాల వలన తల్లిలాంటి మతాన్ని ధర్మాన్ని వదిలేసి నాతోటి వ్యక్తిని నేను పూజిస్తున్న ఏసుని నమ్మకపోతే నీవు నరకానికి పోతావు. నీవు సైతాన్ వు అని నిందించే నీచానికి దిగానా? అని గుర్తెరుగుతావు. లే నీ జాతియొక్క వెలుగుని తెలుసుకో, నీ కుటుంబం యొక్క గౌరవం తెలుసుకో. నీ పూర్వీకుల యొక్క పౌరుష పరాక్రమాలు గురించి జ్ఞప్తికి తెచ్చుకో ఎవడో డబ్బులకు ఆశపడి ఎక్కడో నాలుగు ముక్కలు ట్రైనింగ్ తీసుకుని వచ్చి నిన్ను మతం మార్చాడా? అని బాధపడకు. తిరిగి నీ ధర్మం లోకి రా. అమ్మ ఒడిలో సేదతీరు. తోటివారిని గౌరవించే నీ సంస్కృతిని నీవే నిందిస్తే ఎలా? నీ ధర్మంలో ఉన్న లోటుపాటులని నీవే సరిదిద్దు. సమరసతను పెంచు. సద్బావన కలిగించు. నీవే ఒక వివేకుడవు, నీవే అంబేద్కరుడవు.
ఓ హిందువా! నీకే చెప్పేది. నువ్వు కూడా తెలుసుకో: రోజూ పొద్దున లేస్తే తెలిసో తెలియకో ఎవడో ట్రైనింగ్ పాస్టర్ మాయలో పడి మతం మారిన సాటి హిందువుని గొర్రె గొర్రె అని నిందిస్తున్నావు. ముందుగా అలా గొర్రె అనడం మాని ఆ సాటి మతం మారిని క్రైస్తవుడిని ప్రేమించు. ఎందుకు తను మతం మారాడో ఏనాడన్నా అడిగావా? లేదే ఇప్పుడు అడుగు, తెలుసుకో. ఆ సమస్య నీవు పరిష్కరించగలిగేదే అయితే ప్రయత్నం చేయి, పరిష్కరించు. వీలుకాకపోతే తనకి ఉత్సాహాన్నిచ్చి తనలో ఉన్న మత్తుని వదిలి చైతన్యపరిచి తన సమస్యను తనే పరిష్కరించే విధంగా తయారుచేయి. ఏం నీ సోదరుడు ఆపదల్లో ఉంటే ఆదుకోవా? సలహా ఇవ్వవా? అలాగే మసలుకో. నీలో ఉన్న స్నేహితుడిని తనకి పరిచయం చేయి. మన ధర్మం యొక్క గొప్పతనాన్ని వివరించు. అలా నీవు ఆ క్రైస్తవుడిని చేరదీస్తే నీవలన అతను తిరిగి మన ధర్మంలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అలాకాక గొర్రె గొర్రె అంటే తిరిగి మారకపోగా మన ధర్మాన్ని ఇంకా కించపరుస్తూ, తూలనాడుతూ తనకు ఏహ్యభావం కలిగేలా ప్రవర్తించకు. సంవత్సరంలో కనీసం ఒక నలుగురిని అయినా మన ధర్మం లోకి వచ్చే విధంగా తయారుచేయి. ఎందుకంటే అది నీ బాధ్యత. నీవు కాకపోతే ఎవరాపని చేస్తారు? నీవే చేయాలి. నీవు మాత్రమే చేయాలి.
"భారతదేశంలో కులనిర్మూలన జరగాలి" అంటూ ఉంటారు. నిజానికి నిర్మూలించాల్సింది కులాన్ని కాదు. వ్యక్తులలోని కుల భావనను, కుల తత్వాన్ని నిర్మూలించాలి. కులాల మధ్య సమరసత, సద్బావన, బందుభావన తీసుకురావచ్చు. అది కూడా నీవే చేయాలి. ఈ విషయం నిజంగా చెప్పాలంటే మనం తెలుసుకోలేకపోయాం. భారతదేశంలో కులాల నిర్మూలన అసంభవం అన్న విషయాన్ని క్రైస్తవులు తెలుసుకున్నారు. అందుకే కులాల వారీగా చర్చిల నిర్మాణం మరలా అందులో కూడా అగ్రకులాల చర్చిలకి, చిన్న కులాల వాళ్ళు వెళ్ళే పరిస్థితులు లేవు. చూడండి, పెద్ద పెద్ద పాస్టర్లు కూడా అగ్ర కులాల వాళ్ళే ఉండి చిన్న కులాల వాళ్ళను అక్కడా తొక్కేస్తున్నారనే వాదన క్రైస్తవులు కూడా చెబుతూనే ఉన్నారు. కల్వరి సతీష్, విజయ ప్రసాద్ రెడ్డి, అనీల్, పాల్, మోజెస్ చౌదరి ఇలా ఎందరో అగ్రకులాల వాళ్ళు మతం మారి అక్కడ కూడా కుల దురంహాకారానికి అనేకమంది క్రైస్తవులు బలవుతూనే ఉన్నారు. కాబట్టి మతం మారడం వలన ఏ విషయంలోనూ ఉపయోగం లేదు. కేవలం ఒక పాస్టర్ కి మాత్రమే విదేశీ నిధులు, దశమ భాగాలు అందుకుంటూ పేద అమాయకపు ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తూ జల్సాలు చేస్తున్నారే తప్ప క్రైస్తవులలో కూడా నిమ్న కులాల వారు ఎటువంటి ఉన్నతినీ సాధించలేదు.
మతం మారిన హిందువులు తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేస్తున్నారు, అలా నెల్లూరులో కమలానంద భారతీ స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ ధన్వి శ్రీనివాస్ గారి పరిశ్రమ, ప్రేమల కారణంగా యానాదులు వందమంది పైబడి ఒకే రోజున అందరూ హోమగుండాల సాక్షిగా అమ్మఒడికి చేరారు. మరియు శెట్టి బలిజ కులస్తులు పశ్చిమగోదావరి జిల్లాలో పోడూరు మండలం మట్టపర్రుపాలెం గ్రామస్తులు తోటి కులం వారైనా శెట్టి బలిజలను వారి కులం యొక్క సాంప్రదాయాలు, చరిత్ర, గాథలు చెప్పి నలబై మందిని మతం మారకుండా ఆపుకున్నారు. ఇది కదా మనం చేయాల్సినపని? అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎన్నో గ్రామాలలో చైతన్యం కలిగిన యువకులు "మా గ్రామంలో క్రైస్తవ ప్రచారానికి అనుమతి లేదు" అని బోర్డులు పెడుతున్నారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఒక చైతన్యవంతమైన వాతావరణం వుంది కనుక ప్రతి ఒక్కరూ మతం మారిన సాటి హిందూ క్రైస్తవుడిని పునరాగమనం అయ్యే విధంగా ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మీరు క్రైస్తవులతో స్నేహం చేసేప్పుడు మశ్చీంద్రుని వలే కాక కచునివోలే ప్రయత్నం చేయాలి, అవసరం అయితే గోరఖ్ నాథ్ ద్వారా ప్రేరణ పొందాల్సిన అవసరం ఉంది. మశ్చీంద్రుడు నా అంతటివాడు లేడని స్త్రీ లోకానికి వెళ్ళి అక్కడే ఉండిపోతాడు అప్పుడు గురువుగారైన మశ్చీంద్రునికి గోరఖ్ నాథ్ జరిగిన విషయం చెప్పి వెనక్కు తీసుకువస్తాడు. మరియు కచుడు మృతసంజీవని విధ్యనేర్చుకోడానికి శుక్రాచార్యుడు దగ్గరకు వెళ్ళి విద్య పూర్తయ్యక శుక్రాచార్యుడు కూతురి ప్రేమను తిరస్కరించి తిరిగి దేవతలవైపు వచ్చేస్తాడు అలా ప్రతి హిందూ కార్యకర్త ఏ పనిచేసినా మన అంతిమ లక్ష్యాన్ని గుర్తెరిగి పనిచేయాలి. సమరసతను సాదిద్దాం దేశభక్తులుగా, ధర్మసేవకులుగా జీవిద్దాం. హిందువుగా జీవిద్దాం-హిందువుగా మరణిద్దాం. -రాజశేఖర్ నన్నపనేని.
అసలైన హిందువుల మనస్సులో మాట రాశారు.
ReplyDeleteశుభాకాంక్షలు 👍
tq sir
Delete