Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మన ఆధ్యాత్మిక జ్ఞానం మన వారసత్వం కు ప్రతీక వివేకానందుడు. Swami Vivekananda and Spiritual Bharath by Rampalli Mallikarjun

భౌతిక వాదం విస్తరిస్తూ వెర్రి తలలు వేస్తున్న సమయంలో శతాబ్దాలుగా చెలరేగుతున్న మతోన్మాదం, సామ్రాజ్యవాదం అటు పెట్టుబడిదారీ వ్యవస్థ ...

భౌతిక వాదం విస్తరిస్తూ వెర్రి తలలు వేస్తున్న సమయంలో శతాబ్దాలుగా చెలరేగుతున్న మతోన్మాదం, సామ్రాజ్యవాదం అటు పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి ఇటు కమ్యూనిస్ట్ వ్యవస్థ నుండి పెరుగుతున్న సమయంలో స్వామి వివేకానంద జన్మించి తన ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రపంచ మానవ నాగరికత వికాసానికి బీజం నాటారు.

వివేకానందునికి బాల్యం నుండే భగవంతున్ని దర్శించాలనే కోరిక చాలా తీవ్రంగా ఉండేది అది వయసుతో పాటు పెరుగుతూ వివేకానందుని రామకృష్ణ పరమహంస సన్నిధానానికి చేర్చింది. రామకృష్ణ పరమహంస సన్నిధిలో ఈ చరాచర సృష్టి మొత్తం భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అని తెలుసుకొన్నాడు. మానవ సేవే మాధవ సేవ అని ఆచరించి చూపించాడు. వివేకానంద జీవితాన్ని మలుపులు త్రిప్పిన సందర్భాలు మూడు మనకు కనబడతాయి.

1). చికాగో వెళ్ళటానికి పూర్వం ఒక అనామకుడుగా దేశమంతా తిరగటం, ఆ సమయంలో కన్యాకుమారిలో వివేకానంద శీలా స్మారకం ఉన్న చోట మూడురోజులు అంతర్ముఖం కావటం.
2). చికాగో వెళ్లి వచ్చిన తరువాత కొలంబో నుండి అల్మోరా వరకు చేసిన తుఫాన్ పర్యటన.
3). రామకృష్ణమఠం ఏర్పాటు చేయటం. స్వామి వివేకానంద దేనికి ప్రతీక అంటే పరంపరాగత మన ఆధ్యాత్మిక జ్ఞానం మన వారసత్వం కు ప్రతీక వివేకా నందుని స్మరించుకోవడం అంటే  మన చరిత్రలోకి తొంగి చూడటం. 

స్వామి వివేకానంద సమకాలీన పరిస్థితులను అర్థం చేసుకోవడమే కాకుండా ఆ పరిస్థితులు నిర్మాణం కావటానికి మూల కారణాలను కూడా అధ్యయనం చేసి ఈ దేశాన్ని మళ్ళీ తిరిగి జగద్గురువుగా నిలబెట్టటానికి ఏమి చెయ్యాలో ఆలోచించారు. స్వాభిమానం కోల్పోయిన జాతి ఎట్లా పతనం చెందుతుందో దానికి ప్రత్యక్ష ఉదాహరణ హిందూ జాతి. అందుకే జాతిలో స్వాభిమానం నిర్మాణం చేయటానికి తీవ్రంగా ప్రయత్నించారు. స్వామి వివేకానంద ఇంకొక విషయం కూడా హెచ్చరించారు అనుకరణ అనేది అనాగరికత,  నేను రాజముకుటం ధరించినంత మాత్రాన నేను రాజును కాను  సింహం చర్మం కప్పుకున్న గాడిద సింహం అవుతుందా? అనుకరణ పిరికితనంతో కూడుకున్నది. తన పూర్వీకుల గురించి లజ్జ ఉన్న వారికి అంత్యకాలం మూడినట్లే అందుకే నేను ఎవ్వరిని అనుకరించను. అందుకే నా జాతి గురించి నేను గర్వపడుతున్నాను నేను హిందువునని చెప్పు కోవటానికి గర్విస్తున్నా. మనమందరము మహర్షుల వంశముల వారమని కూడా గర్వపడుతున్నాను అని స్వామి వివేకానంద బోధించేవారు.

దేశ ప్రజలలో స్వాభిమానం నిర్మాణం చేయటానికి నిరంతరం కృషి చేసిన వారు. ఆధ్యాత్మిక శక్తి ద్వారా భారత్ తిరిగి ప్రపంచంలో ఒక గౌరవనీయమైన స్థానం లో నిలబడుతుంది ఆ ఆధ్యాత్మిక జ్ఞానం తోనే ప్రపంచ కళ్యాణం సాధించవచ్చును. భారతదేశం 1880 నుండి 1990 మధ్య  20 సార్లు తీవ్ర దుర్భిక్షం కరువు పరిస్థితులను ఎదుర్కొంది, అంతకు పూర్వం ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఆకలి బాధలతో ఆ రోజుల్లో దేశం అలమటించినది, మనపై మనకు విశ్వాసం కోల్పోయాం,  పరాజయం పాలైన జాతి మనది.  ఈ పరిస్థితి నుండి బయటపడ  వేయటానికి బయలుదేరాడు వివేకానంద.   అందుకు ఆయన ఎంచుకున్న మార్గం ప్రపంచ మత మహా సమ్మేళనం దానికోసం స్వామి వివేకానంద చికాగోలో జరిగిన ప్రపంచ మత మహా సమ్మేళనం లో పాల్గొన్నారు.

ఈ సమ్మేళనం ఎవరు ఏర్పాటు చేశారు అన్ని మతాల కంటే క్రైస్తవం చాలా గొప్పదని నిరూపించేందుకు చికాగోలోని ప్రెస్బిటేరియన్ క్యాథలిక్ చర్చి వారు ఏర్పాటు చేశారు ఈ సభను నిర్వహించిన నిర్వాహకుడు హెన్రీ బారోస్ సభానంతరం ఆయన కొన్ని విషయాలు తన డైరీలో రాసుకున్నాడు. స్వామి వివేకానంద క్షణాలలో సభికులను ఉల్లాస పరిచే సమ్మోహితులను చేసి కరతాళ ధ్వనులు చేయించడం ఆ సభ లక్ష్యాన్ని మార్చేశారు వాస్తవంగా వివేకానందుడికి ఇచ్చిన సమయం కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఆ రెండు నిమిషాలు ఉపన్యాసంలో అనర్గళంగా 471 పదాలు ఆయన నోటి నుండి వెలువడ్డాయి. వివేకానందుడు విశ్వ మానవత్వం గురించి మాట్లాడాడు,  క్రైస్తవ మతం గొప్పదనే  ఎజెండాను పక్కకు నెట్టేశాడు.  ఈ సమయంలో  ఆ సభను వివేకానందుడు ఆధ్యాత్మిక జ్ఞానం వైపుగా మళ్లించి వాళ్ళ కళ్ళు తెరిపించాడు. ఆ సభలో స్వామి వివేకానంద మొదటిరోజు ఉపన్యాసం సింహ గర్జన ఆ గర్జనకు యావత్ ప్రపంచం ఒక్కసారి ఉలిక్కి పడింది. అద్భుతమైన వారి జ్ఞానాన్ని చూసి పాశ్చాత్య ప్రపంచం ఆశ్చర్యానికి లోనైంది.  ఆ సభలు హిందుత్వ ఆధ్యాత్మిక కేంద్రంగా ముగిశాయి. ఆ సభల తదుపరి స్వామి వివేకానంద ప్రపంచం మొత్తానికి పరిచయమయ్యాడు. ఆ సమయంలో అమెరికాలోని అత్యంత ధనవంతుడు ప్రభావవంతుడు  అయినా రాక్ ఫెల్లర్ వివేకానందుని కలుసుకునేందుకు వచ్చాడు, వివేకానందుని చూసి ఆయన చాలా ఆశ్చర్య పోయాడు. తాను ఒక గొప్ప ధనవంతుని ముందు ఉన్నాను అనే  భావన వివేకానందలో లేకపోవటం రాక్ ఫెల్లర్ కు ఆశ్చర్యం కలిగించింది. మళ్ళి ఆ మర్నాడు వచ్చాడు ఆ సమయంలో వివేకానందుడికి  ఒక చెక్ ఇచ్చాడు, వివేకానందుడు ఆ చెక్ ను తన టేబుల్ పై పెట్టేసాడు వివేకానందుడు తనకు కృతజ్ఞతలు చెప్పకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు రాక్ఫెల్లర్, ఆగలేక అడిగేశాడు చెక్ ఇచ్చినందుకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు ఏమిటి అని అడిగాడు, దానికి వివేకానందుడు నవ్వుతూ నేను  ఎటువంటి దేశం నుంచి వచ్చానో తెలుసా? మా దేశంలో దానం స్వీకరించిన వ్యక్తికి దానం ఇచ్చిన వాడే కృతజ్ఞతలు చెబుతారు  అని  స్వామీజీ నిర్భయంగా చెప్పాడు. ఆ తర్వాత వివేకానందుడు రాక్ఫెల్లర్ తో ఎందుకు సముద్రమంత సంపదలు పోగేస్తున్నావు? అని ప్రశ్నించడం ఆ ప్రశ్న రాక్ ఫెల్లర్ ను  కదిలించింది రాక్ ఫెల్లర్ తన సంపదనంతా ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి దానికి తరలించడం అది నోబుల్ బహుమతులుకు  దారి తీసింది.

భారతదేశం బలహీనమైనదని  ఐసియులో ఉన్నదని అందరూ అంటున్న సమయంలో వివేకానంద భారతదేశం వైభవాన్ని దర్శించడం, దర్శించడమే కాదు ప్రకటించాడు. ఎందుకని చేయగలిగాడు అంటే భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క గొప్పదనం తెలుసు కాబట్టి. ఆ సమయంలో అమెరికాలో భోగ వాదము వెర్రితలలు వేస్తున్నది వివేకానందుడు వారితో తో ఈరోజు కాకపోతే రేపు ఏ రోజు అయినా మీరు  మా దగ్గరకు వస్తారు అని చెప్పారు. అది ఈ రోజున కనపడుతున్నది స్వామి వివేకానంద వెలిగించిన ఆధ్యాత్మిక జ్యోతి నేడు ప్రపంచాన్ని జ్ఞాన యుగం వైపు తీసుకొని వెళుతోంది. వేలాది సంవత్సరాలుగా మన సంస్కృతి మన జీవనం ప్రపంచ కళ్యాణాన్ని సాధించేదాన్ని గుర్తు చేశారు దాని ఆధారంగా ప్రజలను కదిలించారు.  ఆ శక్తి ద్వారా దేశ ప్రగతికి బాటలు వేయాలని స్వామి వివేకానంద ఆకాంక్షించారు.

ఆ రోజుల్లో ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన మేధావులలో ఒకరైన  కారల్ మార్క్స్  ఆయన తన రచనల ద్వారా భారతదేశాన్ని నిరంతరం ప్రభావితం చేస్తూ ఉన్నారు. భారతదేశం లోని  ప్రతి గ్రామం ఒక ఆర్థిక శక్తి,  గ్రామంలోని ప్రతి వ్యక్తి ఉత్పత్తిదారులు కొనుగోలుదారులు దోపిడీ వ్యవస్థ లేని గ్రామాలు భారత్ లోనివి సమస్య  ఏంటంటే గడిచిన రెండు వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఏమీ మార్పు రాలేదు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశ సామాజిక ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు దానికోసం ఇప్పుడు పోరాటం చేయవలసి వస్తోంది అని అన్నారు. భారతదేశాన్ని ఒక్కసారి కూడా దర్శించని అధ్యయనం చెయ్యని మర్క్స్ వ్రాతలు ఈ దేశ మేధావులను ప్రభావితం చేసేవి అని చెప్పటం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. అంగూర్ మాడిసన్ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను క్షుణ్ణముగా అధ్యనం చేసినవారు, ఆయన మాటల్లో ఒక వెయ్యి సంవత్సరాలకు పూర్వం ప్రపంచ ఆర్ధిక చరిత్ర ఒక పట్టిక తయారు చేశాడు. దానిలో భారతదేశ భాగస్వామ్యం 34% ప్రగతి లో ఉన్నది,  చైనా 28 శాతం ఉంది ఈ రెండు దేశాల ఆర్థిక శక్తి ప్రపంచంలో 62 శాతం ఇది వెయ్యి సంవత్సరాలు కొనసాగింది. ప్రపంచంలో రెండు దేశాలు తిరుగులేని ఆర్థిక శక్తి మధ్యలో ఒక రెండు వందల సంవత్సరాలు మాత్రమే భారత్-చైనా రెండు ఆర్థికంగా దెబ్బతిన్నాయి.

గడిచిన  రెండు వందల సంవత్సరాల కాల ఖండం లో భారత్ కోల్పోయినా తన సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవాడానికి జాగృతమవుతోంది అని విలియం ఆల్విన్ ఫుల్ 2007 ఆగస్టు 15న గార్డియన్ పత్రిక లో రాశాడు. అది ఇది భారతదేశం యొక్క గొప్పతనం భారతదేశం ఎప్పుడు బయట దేశాల పెట్టుబడులతో ఎదగలేదు భారతదేశంలో అంతర్గత పెట్టుబడులే ఎదుగుదలకు మూలకారణం ఈ విషయాలను విస్మరించి మన మేధావులు ఆలోచించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారతదేశం కుటుంబాలను చట్టప్రకారం నిర్మాణం చేయలేదు కుటుంబాలు సంస్కృతీ వికాసం లో ఒక భాగం అది ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉంటాయి ఒక తల్లిని చట్టం నిర్మాణంచేయ లేదు కుటుంబాలలో వ్యక్తులలో ఆత్మీయ సంబంధాలు కోర్టు ద్వారా నిర్మాణం చెయ్యలేరు, న్యాయవాదుల ద్వారా చట్టం ద్వారా ఈ పనులు చేయలేరు కుటుంబ వాతావరణం దాని భద్రత ఈ దేశంలో గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తుల నిర్మాణం జరుగుతుంది. అటువంటి కుటుంబ వ్యవస్థ భారతదేశం సామాజిక వ్యవస్థ అంతా వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. ప్రభుత్వం గానీ చట్టం గాని దానిలో జోక్యం చేసుకోలేదు అది ధర్మం ఆధారంగా ఉంటుంది అదే ఈ దేశానికి శ్రీరామరక్ష.

ప్రస్తుతం భారత్ ఎట్లా ఉంది అమెరికా దేశానికి చెందిన రహస్య సమాచార సేకరణ నిపుణులు సి.ఐ.ఎ విధాన నిర్ణేతలు కలిసి కూర్చుని రాబోయే రోజుల్లో ప్రపంచంలో శక్తివంతమైన దేశాలుగా ఏవి ఉంటాయో చర్చించారు 2012 డిసెంబర్ 12న ఒక నివేదిక తయారు చేశారు. వారి నివేదిక ప్రకారం 2030నాటికి ప్రపంచంలో 3 అగ్రరాజ్యం ఉంటాయి1|  అమెరికా 2} చైనా 3|  భారత్.  కోవిద్ 19 సమయంలో భారత్ ఒకరకంగా అంతర్ముఖం అయిందని చెప్పవచ్చు. ఈ సమయంలో దేశం గ్రామీణ వ్యవస్థను చక్క దిద్దడానికి అనేక చర్యలు చేపట్టారు. గోవును ఈ దేశ  ఆర్థికశక్తిగా గుర్తించారు. గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా దేశంలో ఈ దేశ సమగ్రాభివృద్దికి అనేకమంది అనేకరకాల ప్రయోగాలు చేసుకొంటూ వస్తున్నారు. వాటిఫలితాలు దేశ  ప్రజలలో విశ్వాసం నిర్మాణం చేస్తున్నది. ఒక ప్రక్క ఆధ్యాత్మిక శక్తి మరోప్రక్కసామాజిక ఆర్ధిక శక్తి ఒక క్రమవికాసం చెందుతున్నాయి. భారత దేశం ఎంత ఎక్కువగా తనలోపల చూసుకొంటుందో అదే ఈ దేశాన్ని అంతగా  ముందుకు తీసుకోని వెళ్ల గలుగుతుంది. ఆ విషయాలు వివేకానందుడు మరోసారి ఈ జాతికి గుర్తు చేసాడు. శ్రీ రాంపల్లి మల్లికార్జున్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment

  1. Excellent write up with historical facts and eloquent on the greatness of Sri Vivekananda and the agenda set by him. We only need to follow the path he has shown for both spiritual and economic growth,for, only economic growth devoid of spirituality is unsustainable

    ReplyDelete