ఈ రోజు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం. ఇది మీ అందరికీ తెలిసిన మొక్కే దీన్నే శంఖపుష్పం అంటారు. ఈ మధ్య కాలంలో చాలా మం...
ఈ రోజు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం. ఇది మీ అందరికీ తెలిసిన మొక్కే దీన్నే శంఖపుష్పం అంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ శంఖపుష్పం గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా మంది దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొని వాళ్ల ఇళ్లల్లో కూడా పెంచుకుంటున్నారు. మరి ఇది అంత గొప్ప మొక్కా అంటే అవుననే చెప్పాలి. శంఖు పుష్పానికి అపరాజిత, దింటెన, గిరికర్ణిక అని పేర్లు శాస్త్రీయ నామం Clitoria ternatea. సంస్కృతం లో శ్వేతాం, విష్ణూక్రాంతా అని అంటారు. ఇంకా సంస్కృతంలో ‘అస్ఫోట’, ‘గోకర్ణ’, అని కూడా అంటారు. పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన తీగ మొక్క ఈ పూల చెట్టు.
విష్ణుక్రాంత పత్రి, వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏక వింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదవది. ఈ పుష్పం నాలుగు రంగులలో ఉంటుంది. తెలుపు, నీలం, గులాబీ రంగులో ఉంటుంది. మనం ఎక్కువగా నీలం రంగు పుష్పాన్నే చూస్తాము. ఇది శంఖు ఆకారం లేదా స్త్రీ యోని ఆకారం లో కనిపిస్తుంది. కొద్దిగా ఆకులకు గరుకు వుంటుంది. ఇది గుబురు గా పాకే తీగ.
చాలా కాలంగా ఆయుర్వేదంవైద్యంలో వివిధ రకాలైన రోగాల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. వైద్యపరమైన ప్రయోజనాలున్నాయి. శంఖు పుష్పం ఒక్క ఆరోగ్య ప్రయోజనాలు. ఈ శంఖు పూలు అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ మధ్య దీన్ని ఫుడ్ కలర్ లో కూడా వాడుతున్నారు. శంఖు పువ్వు లోని organelle అనే పదార్థం మెదడు యొక్క పనితీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మతిమరుపు లాంటి జబ్బులను బాగా తగ్గిస్తుంది.
దగ్గు జలుబు ఆస్తమాతో బాధపడేవారు శంకు పూలతో టీ కాచి ఇస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు తెల్లబడటాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది మన శరీరంలో కొల్లజైన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మ సాగుదలను పెంచి ముడతలను రానివ్వకుండా చూస్తుంది. ఇది అద్భుతమైన శృంగార ప్రేరిపితగా కూడా పనిచేస్తుంది అంటే భార్యాభర్తల మధ్య దాంపత్య విలువను పెంచుతుంది. పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తిని పెంచుతుంది.
రక్తంలో గ్లూకోజ్ విలువలను పెరగకుండా చూస్తుంది. శంకు పూల ఆకులతో వేర్లతో చేసిన పొడిని జ్ఞాపకశక్తిని తెలివి తేటలను పెంచుతుంది. నిద్రలేమికి డిప్రెషన్ కి మందులా పనిచేస్తుంది. ఈ ఆకు లేదా పూలను నోట్లో వేసుకుని నమిలినా కూడా చాలా మంచిది లేదా దీనిని టీ లాగ కాచుకుని తాగితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది.
ఆడవారికి నెలసరి ఇబ్బంది ఉంటే ఈ పూలతో తయారుచేసిన కషాయాన్ని తాగితే చక్కగా పనిచేస్తుంది. విషపదార్థాలను విరుగుడుగా వేళ్ళ తో చేసిన మందులు పూర్వకాలంలో ఇచ్చేవారు. మద్యపానం అలవాటు నుండి తరచూ అలసటకు గురయ్యేవారు బలహీనంగా ఉండే వారు ఈ మొక్కలోని ఏ భాగం అయినా నీళ్లలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. తెలుపు రంగు రంగు పూలు పాము కాటుకు కూడా మందుగా ఇచ్చేవారు.
ఈ శంఖు రూపంలో వుండే పువ్వును థాయ్‌లాండ్, చైనా వంటి ఆసియా దేశాల్లోని స్టార్ హోటల్స్‌లో రాయల్ ఫుడ్స్‌లో చేరుస్తున్నాయి. ఈ పువ్వును అక్కడ బటర్ ఫ్లై ఫ్లవర్ (Butterfly Pea Flower) అని పిలుస్తున్నారు. ఈ పువ్వును మాసంలో రెండుసార్లు ఆహారంగా తీసుకోవడం ద్వారా మానసిక ఆందోళన మాయమవుతుంది.
ఇది శరీరంలోని ఆమ్లాన్ని తొలగించే యాంటీ యాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు, హృద్రోగాలన నయం చేస్తుంది. ఒక గ్లాసుడు నీటిలో ఐదు నీలపు శంఖుపువ్వులను వేసి పది నిమిషాల పాటు నాన బెట్టి.. ఆ నీటిని తేనెతో కలుపుకుని తాగితే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అయితే ఈ పానీయాన్ని మాసానికి ఒకసారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా చిన్నపిల్లలు, గర్బిణీ స్త్రీలు ఈ పుష్పాలు ఉపయోగించకూడదు అని ఆయుర్వేదం చెబుతుంది.
ఇదండీ శంఖు పుష్పాల గొప్పతనం, ఇంకెందుకు ఆలస్యం తులసి మొక్క ఎలాగూ ఉంది... దానితో పాటుగా ఈ పాకే తీగమొక్కనీ పెంచుదాం ఆరోగ్యం గా ఉందాం. ఆరోగ్య భారత్~సమర్ధ భారత్.
No comments