మన దేశం అసలు పేరు ఏమిటీ ?: మన దేశానికి ఎన్నో పేర్లు..! బహుశా ప్రపంచంలో మరే దేశానికి ఇన్ని పేర్లు ఉండకపోవచ్చు! మధ్యప్రాచ్యంలోని దేశాలు భారత్ ...
ఆధునిక ప్రపంచ రాజ్యాంగాల్లోకెల్లా భారత రాజ్యాంగం ఎంతో విశిష్టమైంది. అనేక చారిత్రక పరిణామాల అనంతరం భారత రాజ్యాంగం ఆవిర్భవించింది. ఆర్టికల్ వన్ లోనే ఇండియా....దట్ ఈజ్ భారత్ అని పేర్కొంది.
ఇంతకీ ఒక్కటే దేశం అయినప్పుడూ ప్రపంచంలో ఎక్కడలేని విధంగా మనకు మాత్రం రెండు పేర్లు ఎందుకు? మన దేశం వందల ఏళ్ల బానిసత్వాన్ని అనుభవించింది. ఎందరో వీరులు, ప్రజలు భారత స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘ పోరాటమే చేశారు. సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన మన దేశానికి ఏ పేరు ఉండాలనే అంశంపై 1949 సెప్టెంబర్ 18న రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా భారత్, హిందుస్తాన్, హింద్, భారత భూమి, భరతవర్ష్ , వంటి పేర్లు పరిశీలనకు వచ్చాయి.
అయితే మన రాజ్యాంగ సభలోని పెద్దలు మాత్రం ...ఇండియా దటీజ్ భారత్ అంటూ రాజ్యాంగం తొలి అధికరణంలోనే మన దేశానికి నామకరణం చేయడం జరిగింది. మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయులకు... మన భారతీయ పదాలను, పేర్లను పలకాలంటే..., ఒక పట్టాన కూడా.., వారికి నోళ్ళు తిరిగేవి కావు. దీంతో ఉన్న పేర్లను తమ ఇంగ్లీష్ యాసలో పలికేవారు..., అలాగే వ్రాయడం కూడా జరిగేది. మన దేశంలో చాలా నగరాలకు బ్రిటీష్ వారు... పాత పేర్లను మార్చి తమ యాసలో పలికేలా కొత్త పేర్లు పెట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాలు ఇప్పటికే మార్చివేశాయ్ కూడా..! బ్రిటీష్ వారు పెట్టిన పేర్లను వలసవాద బానిస చిహ్నాలుగా భావించాయి. అందుకే ఆయా నగరాలకు తిరిగి భారతీయ పేర్లను పెట్టడం జరిగింది.
మన దేశానికి ఇండియా అనే పేరును పాశ్చాత్యులు పెట్టారు. ప్రాచీన కాలం నుంచి వందల ఏళ్లుగా మన దేశాన్ని భారత్ ... పిలిచేవారు భారత్ అంటే జ్ఞానం అని అర్థం. కాని వలసవాద బానిస చిహ్నమైన ఇండియా పేరును మన రాజ్యాంగ నిర్మాతలు మాత్రం మార్చలేకపోయారు. ఇండియా దట్ ఈజ్ భారత్..., యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొన్నారు. సాధారణ ఏ భాషాలోనైనా నామవాచకం మారదు...! పేరు ఒకేలా గానే ఉంటుంది. అయితే ఇండియా దట్ ఈజ్ భారత్ ఎలా అయ్యిందో...దాని నిర్వచనం మాత్రం మన రాజ్యాంగంలో ఉండదు.
అమెరికాలో నివసించే వారందరిని అమెరికన్లు అంటారు. అలాగే చైనాలో నివసించేవారిని చైనా జాతీయులు అంటారు. అలాగే హిందుస్తాన్ లో నివసించేవారందరని హిందువులేనని అనాలి. మన దేశంలో మార్క్స్, మెకాలే మానస పుత్రులకు ఇక్కడే తమదైన వితాండవాదం మొదలు పెడతారు. వారి దృష్టిలో హిందూ అనగానే అదో మతోన్మాద పదంగా దుష్ర్పచారం మొదలుపెడతారు. ఈ దేశం యొక్క ఆత్మ అయినా హిందూ ఐడెంటిటిని రూపుమాపేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు.
కొంతమంది సాంస్కృతిక జాతీయవాదులు... ఒకే దేశానికి అధికారికంగా రెండు పేర్లు ఉంటాయా...? అని ప్రశ్నిస్తే.... తప్పేంటనే వారు కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ రెండు పేర్లే ఎందుకు ? హిందుస్తాన్, కర్మభూమి, పుణ్యభూమి, వేద భూమి మొదలైన పేర్లు కూడా ఉంటే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తే మాత్రం మార్స్, మెకాలే, సెక్యులర్ మేధావుల నుంచి సమాధానం ఉండదు. జై హింద్
No comments