అంబేద్కర్ ఆధునిక భారతదేశంలో "ప్రొటెస్టెంట్(నిరసన) హిందు నాయకుడు" అని ధనుంజయ కీర్ ( అంబేద్కర్ సమకాలికుడు&...
అంబేద్కర్ ఆధునిక భారతదేశంలో "ప్రొటెస్టెంట్(నిరసన) హిందు నాయకుడు" అని ధనుంజయ కీర్ ( అంబేద్కర్ సమకాలికుడు& అంబేద్కర్ జీవిత చరిత్ర రచయిత) అంటారు. అంబేద్కర్ తన జీవితాన్ని హిందూధర్మ సంస్కరణ, పునర్జీవనం కోసమే అర్పించాడు. హిందూసమాజంలోని అసమానతలు, దురాచారాల్ని దూరం చేయటానికి పోరాటం చేశాడు. హిందూధర్మంలో ఉన్న లోపాల్ని ఎత్తిచూపాడు. అహంకారంతో హిందుత్వానికి నష్టం తెస్తున్న కొందరిని మాత్రమే ఆయన విమర్శించారు.
అంబేద్కర్ ని సరిగా అర్ధం చేసుకోకుండా ఆయన హిందుత్వానికి వ్యతిరేకమని తీర్మానించేస్తుంటాం. కానీ అంబేద్కర్ కంటే అత్యంత తీవ్రంగా లోపాల్ని ఎత్తి చూపినవారు స్వామి దయానందులు, స్వామి వివేకానందులు. హిందూధర్మంలో కాలానికి అనుగుణంగా రావాల్సిన మార్పులకి వీరు ప్రయత్నించారు. అదే దిశలో అంబేద్కర్ హిందూ పునరుజ్జీవనానికి కృషి చేశారు.
హిందుత్వంలోని ప్రధాన సంప్రదాయాలు మహోన్నతమైనవి. అవి కొన్ని వర్గాల చేతిలో పడి సంకుచితమై విచ్చిన్నానికి దారితీయటం వల్ల హిందూధర్మం ఇన్ని నిందలను పొందుతుంది అని అంబేద్కర్ చెప్పేవారు. యువకుల సమావేశంలో " మతంలోని మౌఢ్యాన్ని వదిలి, మంచిని గ్రహించటమే యువతరం చేయాల్సిన పని, మతం మనిషిని హృదయం ఉన్నవాడిలా, శీలవంతుడిలా తీర్చిదిద్దుతుంది" అని స్పష్టంగా అంబేద్కర్ చెప్పారు. సామల కిరణ్, ప్రముఖ జాతీయవాది.
No comments