అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1935 లో యెవలా మహాసభలో "హిందువుగా చావబోను" అని ప్రకటించాడు. హిందూసమాజంలో తాను కోరుకున్న మార్పుకోసం 2...
అంబేద్కర్
బౌద్ధమతాన్ని గూర్చి అంబేద్కర్ తన అభిప్రాయాలను 1956 మే లో లండన్ రేడియో ద్వారా ఇలా తెలియజేశారు. "మానవ జీవితానికి కావాల్సిన ముఖ్యమైనవి-ప్రజ్ఞ, కరుణ, సమత లను బోధిస్తున్న మతం బౌద్ధం ఒక్కటే". మార్క్స్ సిద్ధాంతాలకు, కమ్యూనిజానికి బౌద్ధమతమే చక్కని సమాధానమిస్తుంది. రక్తపాతంతో కూడిన విప్లవం( మార్పు)ని కమ్యూనిజం తెస్తే, రక్తపాతం లేకుండా శాంతియుత మార్పుని బౌద్ధం ఇస్తుందని అంబేద్కర్ వివరించారు.
ఆక్టోబర్ 13 న పత్రికావిలేఖరులు బౌద్ధమతాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? అని అడిగారు. సమాధానంగా అంబేద్కర్ " దేశానికి ఎక్కువ అపకారం జరగని విధంగా, నేను నావాళ్ళను ఉన్నతస్థితికి తీసుకువెళ్తున్నాను. బౌద్ధం హిందూదేశానికి పరాయిది కాదు. దీనివల్ల దేశసంస్కృతీ వికాసాలకు అంతరాయం కలుగదు'' అని చెప్పారు. భారతీయతకు దగ్గరగా ఉన్న బౌద్ధమతాన్ని స్వీకరించి హింసామార్గంలో నడిచే కమ్యూనిజం వైపు సోదరులంతా వెళ్లకుండా అంబేద్కర్ అడ్డుకట్ట వేయగలిగాడు. -సామల కిరణ్, ప్రముఖ జాతీయవాది.
Good work
ReplyDelete