ఇది చదివితే కన్నీళ్లు ఆగవు.... ఒక్కసారి ఈ వృత్తాంతం చూడండి. ఈ సంఘటన గురించి విన్న తర్వాత నాకు నోట మాట రాలేదు. నాగపూర్లోని నారాయణ...
ఇది చదివితే కన్నీళ్లు ఆగవు....
ఒక్కసారి ఈ వృత్తాంతం చూడండి. ఈ సంఘటన గురించి విన్న తర్వాత నాకు నోట మాట రాలేదు. నాగపూర్లోని నారాయణ్ దబోల్కర్ అనే స్వయం సేవక్ కథ ఇది.. ఆయన వయసు 85 సంవత్సరాలు. కోవిడ్ ఉధృతంగా ఉన్న ఈ తరుణంలో ఆయన కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఆయన కుమార్తె ఎంతో ప్రయత్నించి తెలిసిన వారి హాస్పిటల్లో ఆయనకు ఒక బెడ్‌ని ఏర్పాటు చేయగలిగారు. అప్పటికే ఆయనకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉన్నాయి..
తర్వాత రోజు ఆయన తన మనవరాలితో కలిసి హాస్పిటల్‌కి వెళ్ళారు. అప్పటికి శ్రీ దబోల్కర్ ఊపిరి అందక ఇబ్బంది పడుతున్నారు. తన మనవరాలు హాస్పిటల్ అడ్మిషన్ గురించిన ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్న తరుణంలో అక్కడ ఒక నలభై సంవత్సరాల వ్యక్తి భార్య తన భర్తకు హాస్పిటల్లో అడ్మిషన్ కావాలని కోరుతూ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఉండడం శ్రీ దబోల్కర్ కంటపడింది..
శ్రీ దబోల్కర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా హాస్పిటల్ సిబ్బందిని పిలిచి తనకు బదులుగా ఆ 40 సంవత్సరాల వ్యక్తికి హాస్పిటల్ బెడ్‌ను సమకూర్చవలసిందిగా సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. వారించబోయిన వారితో "నా వయసు 85 సంవత్సరాలు. నేను సంపూర్ణ జీవితాన్ని చూశాను. నాకే ఇబ్బందీ లేదు. కానీ ఆ అబ్బాయికి ఎంతో భవిష్యత్తు ఉంది. అతడి పిల్లలకి అతని అవసరం ఉంది. నాకేమైనా ఫర్లేదు. అతను బ్రతకాలి.." అని చెప్పి హాస్పిటల్ సిబ్బందిని, తన మనుమరాలిని ఒప్పించారు. ఆయన ఇంటికి వెళ్లిపోయారు. ఒక మూడు రోజుల తర్వాత శ్రీ దబోల్కర్ అంతిమ శ్వాస విడిచారు. తను పోతూ పోతూ “ఒక స్వయంసేవక్ ఎప్పుడూ తన కోసం కాక తన చుట్టూ ఉన్న వారి కోసమే ఆలోచిస్తాడు..” అనే సత్యాన్ని మరోసారి నిరూపించి దిగంతాలకు ఎగసిపోయాడు....!!
Post Credits: Syam Prasad Reddy Korsipati
No comments