మందుల కంటే మనోధైర్యం గొప్పది. ఆ మనోధైర్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని అందించే ఈ యోగాసనాల గురించి కాస్త తెలుసుకోండి! ఇంట్లో వారికీ అవగాహన కల్పించ...
మందుల కంటే మనోధైర్యం గొప్పది. ఆ మనోధైర్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని అందించే ఈ యోగాసనాల గురించి కాస్త తెలుసుకోండి! ఇంట్లో వారికీ అవగాహన కల్పించండి....
ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, జలుబు, తలనొప్పి, దగ్గు.. లాంటి సమస్యల నివారణకు ఈ ముద్రలు చాలా మంచివి. వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే దిశగా వీటిని సాధన చేయొచ్చు.
యోగా మ్యాట్‌పై చిత్రంలో చూపిన విధంగా మోకాళ్లు, మోచేతులు మడిచి, తలను కిందకు వంచి శ్వాసపై దృష్టి పెట్టాలి. లేదా కొద్దిగా దగ్గినట్లు చేయాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది. ఈ ఆసనంలో ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండొచ్ఛు దీన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల దాదాపు 75 శాతం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తగ్గుతాయి.
ము క్కు రెండు రంధ్రాలతో శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. రెండూ సమానంగా ఉండాలి. ఇలా ఇరవైసార్లు చేసి ఆగి, మళ్లీ చేయాలి. శ్వాస తీసుకునేటప్పుడు మోచేతులు పైకి, వదిలేటప్పుడు కిందికి రావాలి.
* ఈ రెండూ చేసిన తర్వాత కొంచెం సేపు శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
* చేతులను పటికతో కడుక్కుంటే ఎలాంటి వైరస్‌లూ దరిచేరవు.
కపాలభాతి
శ్వా సను వదిలేటప్పుడు ముక్కుతోనే వదలాలి. సెకనుకు ఒకసారి వదలాలి. ఇలా పది లేదా ఇరవైసార్లు చేసి విశ్రాంతి తీసుకోవచ్చు. అలసిపోతే మధ్యలో కాసేపు ఆగి మళ్లీ చేయాలి. వందసార్లు చేయాలి.
రెం డు చేతుల వేళ్లనూ ఒకదానితో ఒకటి పట్టుకోవాలి. బొటనవేలు ఆకాశం వైపు కనిపించేలా పెట్టాలి. మగవాళ్లు కుడిచేతి బొటనవేలు, ఆడవాళ్లు ఎడమచేతి బొటనవేలు పైకి పెట్టాలి. రోజూ పది నిమిషాల చొప్పున మూడుసార్లు చేయాలి. శ్వాస మీదే ధ్యాస పెట్టాలి. ఇది వేసేటప్పుడు ప్రాణశక్తిని మీ ఊపిరితిత్తులకు పంపుతున్నట్టూ, ఇబ్బందులను శ్వాసతో పాటు బయటికి పంపుతున్నట్టూ ఊహించుకోవాలి. శరీరానికి మోచేతులు దూరంగా ఉంచాలి. వెన్నెముక నిటారుగా పెట్టి సాధన చేయాలి.
* వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు ఈ ముద్ర మంచిది.
రెం డు చేతులతో చేయాలి. చిటికెన వేలుని బొటనవేలు మొదట్లో ఉంచాలి. బొటనవేలు మధ్య భాగంలో ఉంగరం వేలు ఉంచాలి. మధ్యవేలు బొటనవేలి చివరన కలపాలి. చూపుడువేలును తిన్నగా చాచి పైకి పెట్టాలి.
* శ్వాసకు సంబంధించిన అన్ని వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నాలుగు నిమిషాలు వేసి, కొంచెం విరామం ఇచ్చి మళ్లీ నాలుగు నిమిషాలు వేయాలి. మొత్తం ఎనిమిది నిమిషాలు సాధన చేయాలి. అన్ని వయసుల వాళ్లూ ఈ రెండు ముద్రలూ వేయొచ్చు.
* గొంతు పొడారిపోకుండా చేస్తుంది. ఊపిరితిత్తులకు చాలా మంచిది. త్వరగా జలుబు చేసేవాళ్లకు, ఆయాసం ఉన్నవాళ్లకు ఉపయోగపడుతుంది. ఈ ముద్రలతోపాటు కపాలభాతి, భస్త్రికా ప్రాణాయామం చేయాలి.
No comments