కరోనా సెకండ్ వేవ్ మనపై ఉప్పెనలా విరుచుకుపడుతోంది. కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నా వాయువేగంతో వ్యాపిస్తూ మృత్యుఘంటికలు మోగిస్తోంది....
కరోనా సెకండ్ వేవ్ మనపై ఉప్పెనలా విరుచుకుపడుతోంది. కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నా వాయువేగంతో వ్యాపిస్తూ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ముప్పు నుంచి బయటపడేందుకు డబుల్ మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడంతో పాటు రోగ నిరోధకశక్తి పెంచుకోవాలంటూ నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సహజ సిద్ధమైన ఆహార నియమాలతో శరీరానికి అధిక పోషకాలు అందించడం ద్వారా రోగ నిరోధకశక్తిని పెంచుకోవచ్చని కేంద్రం సూచిస్తోంది. MyGovIndia ట్విటర్ ఖాతాలో ఇమ్యూనిటీని పెంచేందుకు దోహదపడే డైట్‌ను సూచించింది. మీరు తీసుకొనే ఆహారంలో ఈ కింది పదార్థాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను ఎదుర్కోవడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుకుని కోలుకోవచ్చని చెబుతోంది.
కోవిడ్ వేళ.. ఇమ్యూనిటీని పెంచే డైట్ ఇదే..
* రాగులు, ఓట్లు, అమరంత్ వంటి తృణధాన్యాలను తీసుకోవాలి.
* ప్రొటీన్లు పుష్కలంగా లభించే కోడిమాంసం, చేపలు, గుడ్లు, పన్నీర్, సోయా, కాయధాన్యాలు, గింజలు తీసుకోవాలి.
* ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు కలిగిన వాల్‌నట్స్, బాదం, ఆలివ్ నూనె, ఆవ నూనె
* శరీరానికి తగిన విటమిన్లు, ఖనిజాలను అందించేలా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
* కరోనాతో నెలకొన్న ఆందోళనను తగ్గించేందుకు 70% కోకో మిశ్రమంతో ఉన్న డార్క్ చాక్లెట్ తక్కువ మోతాదులో తీసుకోవాలి.
* పసుపు కలిపిన పాలు రోజుకోసారి తాగాలి.
* రోజులో అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి. మీరు తీసుకొనే ఆహారంలో మ్యాంగోపౌడర్ కలిపి తింటే మంచిది.
రోజూ శరీరానికి తగిన వ్యాయామం చేయడంతో పాటు శ్వాస సంబంధమైన టిప్స్ పాటిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments