శ్వాసముద్ర చిటికెన వేలు చివరను బొటన వేలు మొదట, ఉంగరం వేలు చివరను బొటన వేలు మధ్యలో, మధ్య వేలు చివరను బొటనవేలు అంచున పెట్టాలి. చూప...
చిటికెన వేలు చివరను బొటన వేలు మొదట, ఉంగరం వేలు చివరను బొటన వేలు మధ్యలో, మధ్య వేలు చివరను బొటనవేలు అంచున పెట్టాలి. చూపుడువేలు తిన్నగా ఉంటుంది. రెండు చేతులను తొడలమీద పెట్టి, నిటారుగా వెనక్కి కూర్చుని కళ్లు మూసుకుని నెమ్మదిగా శ్వాస పూర్తిగా తీసుకుని వదులుతూ లోపలి కల్మషాలు, దుఃఖాలు బయటకు పోవాలనుకుంటూ చేయాలి. ఐదు నిమిషాలు ఈ ముద్రలో కూర్చుంటే వెంటనే ఫలితం ఉంటుంది. కింద లేదా కుర్చీలో, ఆరోగ్యం బాగోకుంటే పడుకునీ చేయొచ్చు. దీనివల్ల ఊపిరితిత్తుల్లో నిమ్ము వెళ్లిపోతుంది. ప్రాణవాయువును బాగా తీసుకోగల్గుతాం. ఇది నూరుశాతం సురక్షితం. శ్వాస ఇబ్బందులుంటే రెండు గంటలకోసారి చేస్తే తగ్గిపోతాయి. సమస్య లేనివాళ్లు రోజుకు మూడుసార్లు చేస్తే శ్వాస ఇబ్బందులు రావు. పాజిటివ్ వచ్చినవాళ్లు తప్పక చేయాల్సిన అద్భుత ముద్ర.
కళ్లు మూసుకుని రెండుమూడుసార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలండి. అదయ్యాక రెండు చేతుల మధ్య వేళ్లను మడిచి దగ్గరగా చేర్చి, తక్కిన వేళ్లను దూరంగా ఉంచాలి. చేతులను ఉదరం వద్ద ఉంచాలి. మోచేతులను శరీరానికి కాస్త దూరంలో ఉంచాలి. వెన్నెముక నిటారుగా ఉంచి, కళ్లు మూసుకుని శ్వాస మీద కేంద్రీకరించండి. మామూలు వాళ్లు రోజుకు రెండుసార్లు, పాజిటివ్ వచ్చిన వాళ్లు నాలుగు సార్లు చేస్తే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
ఈ ముద్రలు చేసిన తర్వాత కుంభక ప్రాణాయామం చేయాలి. ఇది కూడా అంతే కింద లేదా కుర్చీలో లేదా సమస్య ఉంటే పడుకుని చేయొచ్చు. నిటారుగా కూర్చోవాలి. రెండు పాదాలూ సమాంతరంగా ఆనించి ఉంచాలి. రెండు చేతులూ బొటనవేలు, చూపుడు వేలు కలిపి తొడలమీద ఉంచి ప్రశాంతంగా శ్వాస తీసుకుని నోటితో వదిలేయాలి. ఇలా ఐదుసార్లు చేసి, ఆరోసారి రెండు ముక్కులతో శ్వాస తీసుకుని, ఐదు సెకన్లు శ్వాస నిలిపి, తిరిగి ముక్కుతోనే వదలండి. ఇలా మూడుసార్లు చేయాలి. ఊపిరితిత్తులు బలపడతాయి, రోగనిరోధకశక్తి పెరుగుతుంది. గ్లైసిన్ వృద్ది చెందుతుంది. గ్లైసిన్ లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మెదడుకు సంకేతాలు అందవు. వాసనలు తెలీవు. నిమ్ము పేరుకుపోతుంది. రక్తం గడ్డకడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ ప్రాణాయామం చేయాలి. ఊపిరితిత్తులే కాదు మన శరీరమంతా శక్తిమంతమవుతుంది. మెదడు చురుగ్గా ఉంటుంది.
వీటితో బాటు ఆహారం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడున్న వైరస్ మన శరీరంలో ఉన్న గ్లైసిన్‌ను నాశనం చేస్తుంది. దీన్ని వృద్ధిచేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ నువ్వులనూనె, నువ్వుండ, నువ్వుకారం, నువ్వుల మొలకలు- ఇలా ఏదో రూపంలో నువ్వులు తినాలి. తెలగపిండి కూర తినాలి. పాజిటివ్ వచ్చినవాళ్లు రోజుకు రెండు స్పూన్లు నువ్వుల నూనె తాగండి లేదా ఆయిల్ పుల్లింగ్ చేయండి. ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్టయి ఉన్నప్పుడు కడుపు నిండా తినకూడదు. సాయంత్రం ఐదున్నర లోపే తినేయాలి. సి-విటమిన్ ఉండే పండ్లు రెండు, ఉడికించిన కూరలు తినాలి.
అలాగే కోవిడ్ బాధితులు ఆహారం ఇలా తీసుకోవాలి కొంత మంది అనుభవాల సారాంశం...
మొదటగా కోవిడ్ అనగానే జ్వరం, జలుబు, ఒళ్ళునొప్పులు వీటితో పాటుగా రుచి, వాసనలు రావని చెబుతున్నారు డాక్టర్ లు. ఈ సందర్భంలో బాధితులు జ్వరానికి, జలుబుకి, ఒళ్ళునొప్పులకి మందులు ఉన్నాయి కాబట్టి వాడుతారు అలా ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఆహారం తినే విషయం లో రుచి వాసనను బట్టి తినే మనం ఎన్నో ఏళ్ళగా మన నాలుక కూడా వాటినే కోరుకుంటుంది కనుక రుచి, వాసన లేపోవడం వలన మనం సరిగా ఆహారం తీసుకోము దానివలన మనలో నీరసం వస్తుంది... ఇదే అదనుగా వైరస్ మనపై విజృంభణ చేస్తుంది.
ఇలా జరిగే సమయంలో నే మనం మన ఆహార నియామాన్ని మార్చుకోవాలి. ఎలా అంటే మనం ఎలాగైనా బ్రతికి తీరాలని నిర్ణయించుకుని ఆహారాన్ని బలవంతంగా తినడం ఎంతగా అంటే వీలైనంత ఎక్కువ ఆహారం అదీ తేలికగా అరిగే ఆహారం రుచీ పసీ లేనిదైనా తినాలి. అలాగే మనముందు ఇంతకంటే గొప్ప ఆహారం మనకు లభించదు అని తినాలి. మనం కేరళా వెళ్ళాము అక్కడ కొబ్బరి నూనేతో వండుతారు అది రుచి ఉండదు అయినప్పటికీ ఎలా తింటామో అలా తినాలి. అలాగే మనకు అన్నము కూర వండే వారికి వంటచేయడం రాదు అనే భావనతో తినాలి. ఇకపోతే కొత్తగా పెళ్ళయ్యింది ఆధునిక యువతి వంటరాదు అయినా భార్యమీద ప్రేమతో ఆహా ఓహో అంటూ పొగుడుతూ అన్నం తింటాము చూడండి అలా తినాలి. చివరిగా మనం అన్నం తినేముందు ఈ దేశం లో అన్నం లేక ఆకలితో ఇబ్బంది పడే కడు పేద ఎలా దొరికిన దాన్నే పరమాన్నంగా తింటాడో వారిని గుర్తు తెచ్చుకుని తినాలి.
ఇలా మనం కోవిడ్ బాధితులం అయ్యాము అని తెలిసిన రోజు నుండి వారం రోజులు ఓపికతో గనుక తింటే ఆ మందులు పనిచేసి ఈజీగా కోలుకునే అవకాశం ఉంది అని తెలిపారు. కాబట్టి మిత్రులారా కోవిడ్ వచ్చినప్పటికీ రాకముందు ఎలా అన్నం తిన్నామో అలా కాకుండా కాస్త సాత్విక ఆహారం కనుక వారం రోజులు తింటే చాలు ఈ కోవిడ్ నుండి బయటపడటం తేలిక....
No comments