![]() |
RSS Sir Sanghachalak Shri Mohanji Bhagwat |
- స్వయంగా చైతన్యంగా ఉండడం,
- ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఉదా॥ ప్రాణాయణమం, ఓంకారం, దీర్ఘశ్వాసలు, సూర్య నమస్కారాలు, వీటిని ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకోగలము. వీటిని చెప్పేవారు. నేర్పించేవారు చాలా మంది ఉన్నారు. ఇవి కఠినమైనవికావు. చాలా సులభమైనవి. వీటిని మనం రోజూ చేయాలి.
- మన ఆహారం – శుద్ధ, సాత్వక భోజనం చేయడం, శరీర శక్తిని పెంపొందించే భోజనం చేయడం. దీని గురించి కూడా అంతర్జాలంలో సమాచారం కోకొల్లలుగా లభిస్తుంది. శాస్త్ర సమ్మతమైన మాటలనే నమ్మండి. చెప్పుడు మాటలను నమ్మకండి. ఈ ఉత్తమ విషయాన్నైనా పరిశీలించి స్వీకరించండి. మన ఆప్తులు, స్వీయ అనుభవం, శాస్త్ర సాంకేతిక అంశాలు వీటిని పరిశీలించాలి. మన తరపు నుండి ఎలాంటి ఆధారాలు లేని మాటలు సమాజంలో వెళ్లరాదు. సమాజంలోని నిరాధార మాటలకు మనం బలి కాకూడదు. ఇది మనం ఆలోచించాలి. మన ఆయుర్వేదం ఒక శాస్త్రం. వాటిలో ఎన్నో చిట్కాలు ఉన్నాయి. అనుభవాలు ఉన్నాయి. పరంపరాగతంగా ఇవి మనకు లభిస్తూనే ఉన్నాయి. శాస్త్రం ఆధారంగా ఇవి సమ్మతంగా ఉంటే వీటిని తీసుకోవడంలో తప్పు లేదు. శరీరాన్ని, మనస్సును అస్థిరపరిచే వాటిని వదిలేయాలి.