Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

టిప్పు కత్తికి బలైన హిందూ సమాజానికి పత్రికలు, వెబ్‌సైట్ లు, విగ్రహాలు పెడతాం, జయంతి నిర్వహిస్తాం అనేవాళ్ళంతా క్షమాపణలు చెప్పాలి - MegaMinds

టిప్పు కత్తికి బలైన హిందూ సమాజానికి వీరంతా క్షమాపణలు చెప్పాలి.... టిప్పు సుల్తాన్ గురించి కొన్ని పత్రికలు, వెబ్ సైట్ లు వ్రాసిన ...

టిప్పు కత్తికి బలైన హిందూ సమాజానికి వీరంతా క్షమాపణలు చెప్పాలి....
టిప్పు సుల్తాన్ గురించి కొన్ని పత్రికలు, వెబ్ సైట్ లు వ్రాసిన హెడ్డింగ్ లు ఇలా ఉన్నాయి...
బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్...
మైసూర్ టైగర్ టిప్పుసుల్తాన్.....
తండ్రిని మించిన శూరుడు టిప్పు సుల్తాన్....
మహా దేశభక్తుడు టిప్పు సుల్తాన్‌.......
మైసూరు పులిగా పేరు తెచ్చుకున్న టిప్పు సుల్తాన్....
ఒక వీరుడు మాతృదేశంకోసం నేలకొరిగాడు.....
బ్రిటీషర్స్ ని గడగడలాడించిన మైసూర్ బెబ్బులి....

ఇలాంటి హెడ్డింగ్ లతో వ్యాసాలు వ్రాసి ఎవర్ని మెప్పించాలని చూస్తున్నవి ఈ పత్రికలు.. ఈ టైటిల్స్ తో వ్రాసిన వెబ్ సైట్ లు, పత్రికలు అన్నీ తెలుగువే. నిజంగా మహమ్మదీయ సమాజం తెలుగుని వారి మాతృభాషగా చదువుతున్నారా అంటే లేదు... వారి మాతృభాష అరబిక్ నే నేర్చుకుంటారు.. ఉర్దూ కూడా మనదేశంలో అత్యధికంగా ముస్లింలు మాట్లాడుతారు. మరి అటువంటప్పుడు తెలుగు పత్రికలు, వెబ్ సైట్ లు ఎందుకు టిప్పుని ఇంతగా మోస్తున్నవి? అనేది అర్ధంకాని ప్రశ్న. నిజంగా ఈ పత్రికలన్నీ ఇలాంటి హెడ్డింగ్ లు, టైటిల్స్ తో వ్యాసాలు వ్రాసినందుకు అలాగే విగ్రహాలు పెడతాం, జయంతులు నిర్వహిస్తాం అనే మేథావులు కన్నడ సమాజానికి, దక్షిణ భారతదేశంలో ఉన్న హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి... ఎందుకంటే....

టిప్పు సుల్తాన్ ఎవరి సంతానం?: నవంబర్ 20, 1750, దేవనహళ్ళిలో మహా కౄరుడు మైసూర్ సుల్తాన్ గా వున్న హైదర్ అలీ అతని రెండవ భార్య ఫాతిమలకు మొదటి సంతానం టిప్పు. తండ్రి హైదర్ అలీ మరణానంతరం 1782 లో మైసూర్ సుల్తాన్ అయ్యాడు. అప్పటి నుండి 1792 వరకు అంటే పదేళ్ళపాటు తను మైసూర్ మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. ఆ తరువాత సమయంలో 7 ఏళ్ళపాటు పూర్తి గా బ్రిటీషర్స్ తో పోరాటం చేస్తూ మే 4, 1799 న చచ్చాడు.

చచ్చాడు అని ఎందుకనాల్సి వచ్చిందో చూద్దాం: మైసూరు దక్షిణాదిలో బలిష్టమైన రాజ్యంగా ఉండేది. దాని పాలకులు వడయార్ లు. వారి దగ్గర సైనికుడిగా ఉన్న హైదర్‌ అలీ వడయార్ లపై తిరగబడి మైసూర్ సంస్థానాన్ని దక్కించుకున్నాడు. హైదర్ అలి రాజయ్యాక ఎన్నో వేలమందిని‌ ఇస్లాంలోకి మతం మార్చాడు అతనికి సహాయంగా అతని కొడుకు టిప్పు సుల్తాన్ 15 ఏళ్ళ వయసు‌ నుండే తండ్రితో పాటు మలబార్ పై దండెత్తి యుద్ధంలో పాల్గొనేవాడు. హైదర్ అలి ఒక వైపు వడయార్ లు, అలాగే అప్పుడే దేశంలో రాజ్యాన్ని సుస్థిరం చేసుకుంటున్న బ్రిటీషర్స్ పై పోరాటం చేయాల్సి వచ్చేది. తన జీవితంలోని అత్యధిక కాలం రణభూమిలోనే గడిపాడు. శత్రువుతో కలబడుతూనే 1782 నవంబరు 6న మరణించాడు. అదే సమయంలో మలబార్‌ తీరాన కల్నల్‌ హంబర్‌ స్టోన్‌ను తరిమి కొడుతున్నాడు టిప్పు. తండ్రి కన్నుమూసిన వార్త విన్న టిప్పు సత్వరమే శ్రీరంగపట్నం చేరుకుని, తన 31వ ఏట 1782 డిసెంబర్‌ మాసంలో మైసూరుకు రాజయ్యాడు.

ఆ తరువాత టిప్పు పదేళ్ళపాటు మైసూర్ సంస్థానంలో విధ్వంసం సృష్టించాడు. 1783 నుంచి 1791 వరకు మలబార్‌లో టిప్పు సుల్తాన్ రాక్షస కృత్యాల మూలంగా 30,000 మంది బ్రాహ్మణులు, ఇంకా ఎన్నో వేలమంది నాయర్లు... ఇళ్లు, ఆస్తులు విడిచిపెట్టి ప్రాణభయంతో తిరువాన్కూరు రాజ్యానికి పారిపోయారని టిప్పు మరణానంతరం బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ వారు నియమించిన విచారణ సంఘం దర్యాప్తులో తేలింది. టిప్పు చేయించిన అత్యాచారాలు, సామూహిక సున్తీలు, ‘కత్తి లేదా టోపీ’ నినాదంతో నెత్తిన ముస్లిం టోపీ పెట్టుకోవటానికి ఒప్పుకోని వారిని వేల సంఖ్యలో నరికేసిన ఉదంతాలు, దేవాలయాలను మలిన పరిచి, బలవంతంగా ఆవు మాసం నోట కుక్కించి, స్త్రీలను చెరిచి, పసిపిల్లలనూ చంపించిన పైశాచిక కృత్యాలు ఎన్నో ఉన్నాయి.

1790లో టిప్పు యుద్ధ బీభత్సాన్ని అక్కడే ఉండి కళ్లారా చూసిన పోర్చుగిసు యాత్రికుడు Barthoelomeo తరవాత కాలంలో రాసిన 'A Voyage to East Indies' లో ఓ సంఘటన ఈ విధంగా వుంది... టిప్పు ఏనుగుకి ముందు 30 వేల మంది‌ ముస్లిం సైనికులు దారిలో కనపడ్డ వాళ్లనల్లా నరికేశారు.... టిప్పు ఏనుగు మీద ఉన్నాడు. ఇంకో 30వేల మంది సైనికులు అతడి వెనుక నడిచారు. కాలికట్‌లోని అత్యధిక సంఖ్యాకులను ఉరి తీశారు. బిడ్డలని మెడలకు కట్టి తల్లులను ఉరి తీశారు. కిరాతకుడు టిప్పు సుల్తాన్ క్రైస్తవులను, హిందువులను నగ్నంగా ఏనుగుల కాళ్లకు కట్టేయించి, వారు పచ్చడయ్యేదాకా ఏనుగుల చేత తొక్కించాడు. దేవాలయాలను, చర్చిలను తగులబెట్టి, మలినపరిచి, నాశనం చేయించాడు. ఇప్పటికైనా అర్దమయ్యిందా? లేదంటే ఇంకొన్ని తెలుసుకుందాం....

టిప్పు ధ్వంసం చేసిన దేవాలయాలు: 19వ శతాబ్దపు ‘మైసూర్ గెజిటీర్’ని చూడండి. దక్షిణ భారతంలో టిప్పు సేనలు 8000 దేవాలయాలను సర్వనాశనం చేసినట్టు కనపడుతుంది. ముఖ్యంగా మలబార్, కొచ్చిన్‌లలో జరిగిన దోపిడీలకు, దేవాలయ విధ్వంసాలకు లెక్క లేదని అర్థమవుతుంది. కుశాలానగర్ నుండి పొన్నంపేట వరకు టిప్పు నాశనం చేసిన దేవాలయాల ఆనవాళ్లు ఉన్నాయి. అతని క్రూరత్వం వలన ఎన్ని ప్రసిద్ధ దేవాలయాలు నేలమట్టమయ్యాయో లెక్కలేదు. వాటిలో కొన్ని‌ ముఖ్యమైనవి...
కుల్కేరి గ్రామంలోని ఉమామహేశ్వర ఆలయం (1956 లో పునరుద్ధరించబడింది)...
కులుకేరి మహాదేవర ఆలయం (2005 లో పునరుద్ధరించబడింది)....
పొన్నంపేట సమీపంలోని నాదికేరి గోవింద స్వామి ఆలయం (హైదర్ దాడి)....
పొన్నంపేట సమీపంలోని బేగుర్ ఒనలియప్ప ఆలయం (హైదర్ దాడి)....
అప్పంగల మధురప్ప ఆలయం (2014 లో పునరుద్ధరించబడింది).....
అరమేరియా భగవతి ఆలయం (ఇప్పటికీ నిలబడి ఉంది)...
అర్వట్టోక్కులు ఈశ్వర్ ఆలయం...
కదనూర్ భగవతి ఆలయం....
మాలతికేరి ఆలయం...
బోలుమమదు ఈశ్వర ఆలయం....
అయమంగళ ఈశ్వర ఆలయం....
కుశాలానగర్ మరియు జింజర్కోప దేవాలయాలన్నీ...
విరాజ్పేట సమీపంలోని అరామేరి భగవతి ఆలయం.....

నవంబర్ 10, 1783 దీపావళి నాడు ఏమి జరిగిందో తెలుసా?: దీపావళి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటున్న మేల్కోటలోని అయ్యంగార్లు సుమారు 800 మంది ఉన్నారు... అందరూ పండుగ జరుపుకుంటున్నారు. ఆ ఆనంద సమయంలో అటువైపుగా వెళ్తున్న టిప్పు ఒక్కసారిగా ముస్లిం సైనికులతో దాడి చేయించి ఆ 800 మందిని చంపించివేశాడు. మహిళలను, పసిపిల్లలను, వృద్ధులను ఏ ఒక్కరిని వదలకుండా ఖండఖండాలుగా నరకడం మూలాన రక్తం ఒక నదిలా ప్రవహించింది. ఆ దుర్దినం జరిగినప్పటి నుండి అక్కడి అయ్యంగార్లు నేటి వరకు దీపావళి జరుపుకోవడం లేదంటే నమ్ముతారా? ... నమ్మాలి ఇదే సత్యం.

టిప్పుకి మహిళలంటే గౌరవమా?: టిప్పు అందగాడా? మన పత్రికలు, వెబ్‌సైట్ లు అందగా చూపిస్తున్నాయి మరి... నిజం చెప్పాలంటే టిప్పు ఒక కామ పిశాచి. స్వతహాగా జన్మతః ముస్లిం కావడం మూలాన ముస్లిం మతాచారాల ప్రకారం బహు భార్యత్వంలో ఆరితేరాడు. ఇందాక అందగాడా? అన్నాను కదా? కాదు అతడో పిశాచిలా ఉంటాడు. కానీ మన తెలుగు, కన్నడ పత్రికల వాళ్ళు అతన్ని అంత అందంగా తయారుచేశారు. టిప్పు ఆడవాళ్ళను భోగ వస్తువుగానే చూశాడు. అతను ఓడిపోయిన భూభాగాల రాజవంశాల ఆడవారు మొదలుకుని, అతను కోరుకున్న ప్రతి స్త్రీనీ శ్రీరంగ పట్టణానికి తీసుకువచ్చాడు. అతను జయించిన, నాశనం చేసిన, అణచివేసిన పట్టణాల పాలకులు, మాండలిస్టులు మరియు గవర్నర్ల కుమార్తెలు కూడా తీసుకువచ్చిన వారిలో ఉన్నారు.


భారతదేశంలోని ఆర్కాట్, తంజావూర్ నుండి ఆడవారు, అలాగే టర్కీ, పర్షియా, జార్జియా వంటి సుదూర దేశాల నుండి తీసుకువచ్చిన స్త్రీలు కూడా ఉన్నారు. అతని భార్య మరియు ఉంపుడుగత్తెలతో సహా మొత్తం మూడు వందలకు పైగా మహిళలను అంత:పురంలో చేర్చాడు. ప్రతి భార్యకూ గదిని, వేచి ఉండటానికి ఒక హాలుని ఏర్పాటు చేశాడు. ఈ లెక్కలో ఎంతమంది హిందూ మహిళలను చెరచి ఉంటారో ఆలోచించండి...

మలబార్ ముస్లింలు మళయాళం చదువుతారు, వ్రాస్తారు. తమిళ ముస్లింలు ఇప్పటికీ తమిళం మాట్లాడతారు. కానీ మైసూర్ ముస్లింలు నేటికీ ఉర్దూలో, అరబిక్ లో మాత్రమే మాట్లాడుతున్నారు. కన్నడ వ్యతిరేక వైఖరి కారణంగా టిప్పు పర్షియన్ భాషను కన్నడ ప్రజల మీద రుద్దాడు. టిప్పు ప్రారంభించిన ఉర్దూ విద్యా విధానం కన్నడ రాజ్యంలో మతం మారిన హిందువుల మాతృభాష అరబిక్ మరియు ఉర్దూలుగా మారిపోయింది. టిప్పు 1796 లో మైసూర్ రాజుల రాజభవనాన్ని కొల్లగొట్టినప్పుడు, ప్యాలెస్ లైబ్రరీలో విలువైన గ్రంథాలు, మతసంబంధమైన లిఖిత ప్రతులు మరియు ఫైళ్ళను తగులబెట్టించాడు. కర్ణాటక ప్రజలు గర్వించదగిన విజయనగర సామ్రాజ్యం యొక్క సంప్రదాయం టిప్పు యొక్క జీహాదీ మనస్తత్వం కారణంగా నాశనం అయినది అని కూడా మనం గమనించాలి.

ఇకపోతే చివరగా ఈ పత్రికలు లేదా వెబ్ సైట్ లు ఎందుకు వీరుణ్ణి చేశాయో చూద్దాం: తన రాజ్యంలో వరుసగా తిరుగుబాట్లు వస్తూండటంతో టిప్పు సుల్తాన్‌ ఆత్మస్థైర్యం సన్నగిల్లింది. 1792లో శ్రీరంగపట్నం యుద్ధంలో జరిగిన పరాభవం అతని స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఈ యుద్ధంలో అతడు పెద్దమొత్తంలో ధనాన్ని నష్టపోయాడు. తన రాజ్యంలో సగ భాగాన్ని కోల్పోయాడు. అతడి ఇద్దరు కుమారులూ బందీలయ్యారు. 1782-92 కాలంలో అతనిలో పెల్లుబికిన గర్వమంతా అణగారిపోయింది. తాను నిలదొక్కుకోవడమే కష్టమైపోయింది. అప్పుడు జరిగిన సంధి ప్రకారం తను సంపాదించిన రాజ్యాన్ని బ్రిటిష్‌ వారికి అప్పగించాల్సి ఉంది.

వెనకటి సామ్రాజ్యాన్నీ, వైభవాన్నీ పొందటమే ఇప్పుడు టిప్పు ముందున్న లక్ష్యం. ఈ పరిస్థితుల్లో తనకన్నా బలవంతులైన బ్రిటిష్‌ వారితో తలపడాలంటే తన రాజ్యంలో అధిక సంఖ్యాకులైన హిందువుల విశ్వాసాన్ని చూరగొనాలి. హిందువుల ఆగ్రహానికి గురైతే తన ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని గ్రహించాడు. నాటి నుంచి హిందువులను మచ్చిక చేసుకోవటం కోసం రకరకాల వేషాలు వేశాడు. అవే టిప్పూ రోడ్లు వేశాడు, శృంగేరి పీఠానికి‌ ధన సహాయం చేశాడు. అసలు ఇక్కడ ఇంకో‌ ప్రశ్న ఎవడి ధనాన్ని పీఠానికి ఇచ్చాడు? అలాగే రోడ్లు వేశాడు అంటే హిందువులపై వేసిన విచ్చలవిడి పన్నులతో చేశాడు. బాగ్దాద్ నుండో ఖలీఫాల దగ్గర నుండో అరబ్బుల నుండో తెచ్చి ఇక్కడి దేవాలయానికి ఇవ్వలేదు. అది అర్దంకాని పత్రికలు ఈ రకంగా కీర్తిస్తు‌న్నాయి. అలాగే దీని వెనుక ద్రవిడ, కమ్యునిష్ట్, ముస్లింల‌ కుట్రలు, స్వాతంత్ర్యానంతరం దేశాన్ని, కర్ణాటకను అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ యొక్క ముస్లిం సంతుష్టీకరణ విధానాలు ఉన్నాయనే చెప్పాలి.

టిప్పు జయంతిని జరుపుకుంటే తప్పేంటి అని కారు కూతలు కూస్తు‌న్న సమాజానికి సూటి ప్రశ్న. వేల సంఖ్యలో మతమార్పిడులు చేసినవాడు ఈ దేశీయుడు ఎలా అవుతాడు? వాడి కారణంగా చనిపోయిన ఆ కుటుంబాలు ఎలా ఉంటాయి? వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఆ గొప్ప వ్యక్తులు అందరూ టిప్పు, హైదర్ల దుష్ట పాలన నుంచి విముక్తి కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడారు. వాళ్ళ త్యాగాలను అవమానిద్దామా? టిప్పుని కీర్తిద్దామా? కేవలం తన స్వార్థం కోసం బ్రిటిషు వారిని ఎదిరించిన టిప్పు సుల్తాన్‌ని మనదేశంలోని సెక్యులర్‌ మేథావులు దేశభక్తుడిని చేసేశారు! అసలైన యోధులను మరిచారు! అందుకే టిప్పు చచ్చాడు అని వ్రాశాను. ఆ తరువాత తిరిగి వడయార్ ల పాలన మొదలయ్యింది. కనుక‌ ఒకటే మాట. ఈ దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను నాశనం చేయజూసినవాడు, మహిళలపై‌ అత్యాచారాలు చేసినవాడు ఎంతడివాడైనా సరే విగ్రహాలు పెట్టడానికి, జయంతులు నిర్వహించడానికి అనర్హుడు.

పరమ క్రూరుడు టిప్పును చరిత్ర పుటలలో బ్రిటిష్ వారిని ఎదిరించిన యోధుడిగా చిత్రించిన చరిత్రకారులు, ఆ తప్పుడు భావనను పెంచి పోషించి టిప్పును 7 దశాబ్దాలు నెత్తికెత్తుకుని ఊరేగిన కుహనా సెక్యులర్ కాంగ్రెసు, కమ్యూనిష్టులు, టిప్పును వీరుడిగా, స్వాతంత్ర్య సమర యోధుడిగా యథాశక్తి కీర్తిస్తూ వస్తున్న వివిధ పత్రికలు, వెబ్ సైట్లు, తమ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా టిప్పు జయంతులు నిర్వహిస్తాం, విగ్రహాలు పెడతాం అంటూ తెగ ఉత్సాహపడుతున్న చౌకబారు రాజకీయ నేతలు తదితరులంతా టిప్పు కత్తికి బలైపోయిన, తమ పవిత్ర దేవాలయాలను, సాహిత్యాన్నీ కోల్పోయిన, టిప్పు దుర్మార్గ పాలనలో ఎన్నో అవమానాలకు, అఘాయిత్యాలకు గురైన అమాయక హిందూ సమాజాన్ని క్షమాపణలు వేడాలి. లేదంటే ఏదో ఒకరోజు జాగృత హిందూ సమాజపు ఆగ్రహ జ్వాలల్లో వీరంతా దహించుకుపోక తప్పదు. -రాజశేఖర్ నన్నపనేని.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments