Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మిల్ఖాసింగ్ జీవితంలో ఓ ముఖ్య సంఘటన - Milkha Singh The Flying Sikh

అవమానించడానికి పిలిచి, బిరుదిచ్చి పంపారు ! 1958 టోక్యో లో ఆసియన్ గేమ్స్ 100 మీటర్ల పరుగులో పాకిస్తాన్ ఆటగాడు అబ్దుల్ ఖాలిఖ్ గెలిచాడు. అప్పటి...


అవమానించడానికి పిలిచి, బిరుదిచ్చి పంపారు !
1958 టోక్యో లో ఆసియన్ గేమ్స్ 100 మీటర్ల పరుగులో పాకిస్తాన్ ఆటగాడు అబ్దుల్ ఖాలిఖ్ గెలిచాడు. అప్పటికే ఖాలిఖ్ 'ఆసియా తుఫాన్' అని పేరొందాడు. ఆ మరుసటి రోజున 200 మీటర్ల పరుగుపందెం. అబ్దుల్ ఖాలిఖ్ తో ఓ నవ యువకుడు పోటీపడ్డాడు. పోటీ రసవత్తరంగా జరిగింది. ఇద్దరూ ఒకేసారి గమ్యం చేరుకున్నట్లుగా ప్రేక్షకులు భావించారు. అయితే నిర్వాహకులు ఫోటో షూట్ లో పరిశీలించినపుడు, ఖాలిఖ్ ను కాదని,  నవ యువకుడు వెంట్రుకవాసిలో మొదటిస్థానం పొందినట్లు తేలింది. అప్పటి నుండి పాకిస్తాన్ ఆ యువకుడి మీద కన్నేసింది. ఆ నవ యువకుడే మిల్ఖాసింగ్.

1960 లో రోమ్ ఒలింపిక్స్ ముగిశాయి. ఆ తర్వాత పాకిస్థాన్ మిలిటరి జనరల్ అయూబ్ ఖాన్ ,లాహోర్ లో ఒక పోటీ నిర్వహించాలనే ప్రస్తావన ముందుకుతెచ్చాడు. అయితే మిల్ఖాసింగ్, తాను పాకిస్తాన్ లో అడుగుపెట్టలేనని 'ఆ నేలలో నా వారి రక్తపు వాసన ఉంది. దాన్ని నేను పీల్చలేను' అని నేరుగా చెప్పేశాడు. కానీ ప్రధాని నెహ్రూ ఒత్తిడికి లొంగి లాహోర్ వెళ్ళడానికి ఒప్పుకున్నాడు.

ఆ జ్ఞాపకాన్ని మిల్ఖాసింగ్ ఇలా పేర్కొన్నాడు : మేము వాఘా సరిహద్దు ద్వారా పాకిస్తాన్ లోకి ప్రవేశించాం. అన్నిచోట్లా భవ్య స్వాగతం లభించింది. ప్రజలంతా పాక్ - భారత పతాకాలను చేబూని ఉన్నారు. నేను వారందరివైపు చేతులూపుతూ,  జీప్ లో పయనించాను. దారిపొడవునా 'మిల్ఖా- ఖాలిఖ్ కీ టక్కర్' , 'ఇండియా - పాకిస్తాన్ కీ టక్కర్' అని బ్యానర్లు కట్టిఉన్నాయి. వాటన్నింటినీ చూస్తూ హోటల్ రూమ్ చేరుకున్నాను. కాసేపటికి నాకు అంతా అర్థమైంది. పాకిస్తాన్ టోక్యో లో ఎదుర్కొన్న పరాభవానికి బదులు తీర్చుకోవడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించింది. పాక్ కు భారత్ తో స్నేహం కన్నా, నేను అబ్దుల్‌ ఖాలిఖ్ కన్నా శక్తివంతుడినా కాదా అనేది చూడటమే పాకిస్తాన్ అసలు ఉద్దేశ్యం అనిపించింది.'

లాహోర్ లోని ఆ స్టేడియంలో ఆనాడు 7000 మంది ప్రేక్షకులు కిక్కిరిసి ఉన్నారు. అయూబ్ ఖాన్ స్వయంగా పందెం చూడటానికి వచ్చాడు. పరుగు ప్రారంభమైంది. సహజంగానే ఖాలిఖ్ ప్రత్యర్థులకన్నా ముందున్నాడు. అయితే చివరి 50 మీటర్ల దూరంలో పరిస్థితి మారిపోయింది. మిల్ఖాసింగ్ వేగం పెంచాడు. అబ్దుల్ ఖాలిఖ్ వెనుకబడ్డాడు. భారతదేశపు మరో అథ్లెట్ మాఖన్ సింగ్ కూడా ఖాలిఖ్ ను వెనక్కు నెట్టి లక్ష్యం చేరుకున్నాడు. పాకిస్తాన్ కు గర్వభంగమైంది. అయూబ్ ఖాన్, మిల్ఖాసింగ్ వద్దకొచ్చి 'నువ్వు ఈరోజు పరిగెత్తలేదు; గాలిలో ఎగిరావు' అన్నాడు. అవమానించడానికి పిలిచినవాళ్ళు బిరుదు ఇచ్చి పంపారు. ఆనాటినుండి మిల్ఖాసింగ్ "ఫ్లయింగ్ సిఖ్ " అయ్యాడు.

మిల్ఖాసింగ్ 20 నవంబర్ 1929 లో అఖండభారత్ లో ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న గోవింద్‌పురా, పంజాబ్ లో 15 మంది సంతానం కలిగిన ఒక సిక్కు రాథోడ్ రాజపుత్రుల కుటుంబంలో మిల్ఖా సింగ్ జన్మించాడు. అందులోని 8 మంది దేశ విభజనకు ముందే చనిపోయారు. భారత విభజన సమయంలో జరిగిన హింసకాండలో తన తల్లిదండ్రులను, ఒక సోదరుడిని, ఇద్దరు సహోదరీమణులను పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రుల మరణాన్ని తన కళ్ళ ముందే ప్రత్యక్ష్యంగా చూశాడు. అనాథగా పాకిస్తాన్ నుండి భారత్ కు కాందిశీకులు వచ్చే రైలులో వచ్చాడు. 1947 లో, పంజాబ్ రాష్ట్రంలో హిందూవులు, సిక్కుల ఊచకోత తీవ్రంగా జరుగుతున్నటువంటి సమయంలో మిల్ఖా సింగ్ ఢిల్లీకు వలస వెల్లిపోయాడు. కొంత కాలం వరకు ఢిల్లీ లోని "పురానా కిలా" వద్ద ఉన్న శరణార్థ శిబిరంలో, అలాగే "షహ్దారా" లోని పునరావాస కేంద్రంలో మిల్ఖా సింగ్ నివసించాడు.

దేశ విభజన సమయంలో అనాథగా మారిన మిల్ఖా సింగ్, తరువాత కాలంలో అనేక కష్టనష్టాలకోర్చి భారతదేశపు ప్రసిద్ధ క్రీడా చిహ్నంగా అవతరించాడు. 1960 ఒలింపిక్ పోటీల్లో అతడు పాల్గొన్నాడు, 400 మీటర్ల పరుగు పందెం అతడి కెరీర్లో చిరస్మరణీయమైనది. అందులో అతడు 4 వ స్థానంలో నిలిచాడు. ఆపోటీలో అతడు చేసిన 45.73 సెకండ్ల పరుగు, భారతదేశ రికార్డుగా 40 ఏళ్ళ పాటు నిలిచింది. 2008లో రోహిత్ బ్రిజ్నాథ్ అనే ఒక పాత్రికేయుడు, మిల్ఖా సింగ్ ను "భారతదేశపు అత్యుత్తమ క్రీడాకారుడి" గా అభివర్ణించారు. 1964 లో టోక్యోలో జరిగిన ఒలింపిక్ పోటీల్లోనూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. భారత ప్రభుత్వం ఇతన్ని "పద్మశ్రీ" పురస్కారంతో సత్కరించింది. దురదృష్టవశాస్తూ 91 సంవత్సరాల యయసులో  2021 జూన్ 18 న కరోనా తో స్వర్గస్తులయ్యాడు ఫ్లయింగ్ సిఖ్....

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments