Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

త్రికోణాసన్‌, పరివృత త్రికోణాసన్‌, పార్శకోణాసన్ యోగాసనాలు నేర్చుకుందాం - megaminds

త్రికోణాసన్‌, పరివృత త్రికోణాసన్‌, పార్శకోణాసన్ యోగాసనాలు నేర్చుకుందాం...  త్రికోణాసన్‌   త్రికోణాసన్‌   స్థితి: నిటారుగా నిలబడి ఉండాలి. రెం...



త్రికోణాసన్‌, పరివృత త్రికోణాసన్‌, పార్శకోణాసన్ యోగాసనాలు నేర్చుకుందాం... 

త్రికోణాసన్‌ 
త్రికోణాసన్‌ 

స్థితి: నిటారుగా నిలబడి ఉండాలి. రెండు పాదాలు కలిపి ఉంచాలి, రెండు చేతులు శరీరానికి పక్కనే కిందకు చాపి ఉంచాలి. చూపు ముందుకు.

1. ఎగురుతూ లేదా రెండు పాదాలను రెండు పక్కలకు జరుపుతూ రెండు పాదాల మధ్య ఒక మీటరు దూరము పెంచాలి. రెండు చేతులను ప్రక్కలకు, నేలకు సమాంతరంగా ఉంచాలి. అరచేతులు కిందకు.
2. కుడిపక్కకు వంగుతూ కుడిచేతి వేళ్ళను కుడి పాదము వేళ్ళకు తాకించాలి. వంగే సమయంలో ఎడమ చేయి పైకి ఎత్తి, సాచి ఉంచాలి. మెడ, తలను పైకి తిప్పి ఎడమచేతి వేళ్ళను చూడాలి. ఇది సంపూర్ణ ఆసన స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాసతో నిముషం వరకు ఉండాలి.
3. రెండు చేతుల్ని భూమికి సమాంతరంగా తెస్తూ 1వ స్థితికి రావాలి.
4. కాళ్ళు దగ్గరకు, చేతులను క్రిందికి తెచ్చి (స్థితికి) విశ్రాంతి తీసుకోవాలి.
ఇదేవిధంగా ఎడమ వైపుకు వంగుతూ చేయాలి.

లాభాలు: మొత్తం శరీరం సాగుతుంది, వెన్ను కండరాలు సాగుతాయి. తొడలు, భుజాలు, రొమ్ము, కాలేయం, ప్లీహం, మూత్రపిండాలకు శక్తి వస్తుంది. పిరుదులు, నడుములోని కొవ్వు తగ్గుతుంది. చక్కెర, బిపి, శ్వాసకోశ, మూత్ర సంబంధ వ్యాధులు, మలబద్ధకం తగ్గుతాయి.

సూచన: మెడ, వెన్ను నొప్పి ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి.


పరివృత్త త్రికోణాసన

పరివృత్త త్రికోణాసన:
పరివృత్త - గుండ్రంగా, త్రికోణ - మూడుమూలలు ఈ ఆసనం చివరిస్థితిలో శరీరం ముందుకి వంగి గుండ్రని త్రికోణంలాగా ఉంటుంది.

స్థితి: చక్కగా నిలబడి, కాళ్ల మడమలు దగ్గరగా ఉంచి, వేళ్లు కొంచెం దూరంగా ఉంచండి. గుండెలనిండా గాలిపీల్చి భుజాలు కిందికి జార్చి విశ్రాంతిగా నిలబడండి. మెడ నిటారుగా ఉండాలి. వేళ్లు నేలను చూస్తూ... అరచేతులు తొడలను తాకుతూ ఉండాలి. ముఖం ప్రశాంతంగా ఉండాలి.

1.కుడికాలికి ఎడమకాలికీ మధ్య ఒక మీటరు దూరం ఉంచండి.
2.అరచేతులు నేలను చూస్తూ ఉన్నట్లుగా రెండు చేతులనూ భుజం ఎత్తులో నేలకు సమాంతరంగా ఉంచండి.
3.కాళ్లు కదపకుండా... ఎడమవైపు 90° కోణంతో నడుమును తిప్పండి.
4.ఎడమ కాలిపాదాన్ని తాకేట్లుగా.... కుడిచేతిని నేలపై ఆనించండి, నడుము నెమ్మదిగా క్రిందకు వంచండి. శ్వాస విడుస్తూ... పైకెత్తిన చేతిని చూడండి.
5.నడుం పైభాగాన్ని కుడివైపు తిప్పి, చేతులు భుజం ఎత్తులో నేలకు సమాంతరంగా ఉంచి శ్వాసలోనికి తీయండి.
6. నడుముని ముందుకు తిప్పండి.
7. చేతులు నెమ్మదిగా కిందకు దించండి.
8. కుడిపాదాన్ని ఎడమపాదం ప్రక్కకి తీసుకురండి. (ఇంకోవైపు కూడా ఇలాగే చేయండి.)

లాభాలు: వెన్ను సంబంధ వ్యాధులు నయం అవుతాయి. ఉదర భాగానికి సంబంధించిన అవలక్షణాలన్నీ తొలగిపోతాయి. వెన్ను, నడుము, పిరుదులు గట్టిపడుతాయి. పొట్టభాగంలోని కొవ్వు కరుగుతుంది. మూత్రపిండాల సామర్థ్యం పెంచుతుంది. జీర్ణసంబంధ వ్యాధులకు చాలా మంచిది. తుంటి, భుజాలు, కండరాలు, మోకాళ్లు సడలించబడతాయి. రక్తప్రసరణ గుర్తించగలుగుతాం, తేలిగ్గా, స్వచ్ఛంగా, విశ్రాంతిగా అనిపిస్తుంది.

సూచన: గుండె వ్యాధులు, నడుమునొప్పి వ్యాధిగ్రస్తులు ఈ ఆసనం వేయకుంటే మంచిది.

గమనిక: మోకాళ్లు వంచకూడదు, కాళ్లు నిటారుగా ఉండాలి. పైకెత్తిన చేయికూడా వంచకుండా నిటారుగా ఉండాలి.

శ్వాస: క్రిందికి వంగినపుడు శ్వాస వెలుపలికి తీయాలి పైకి లేచేపుడు లోనికి తీయాలి. చివరిస్థితిలో సాధారణ శ్వాస తీయాలి.


పార్శకోణాసన్

పార్శకోణాసన్:
పార్శ్వ - పక్కవైపు, కోణ - కోణము - ఈ ఆసనం చివరిస్థితిలో శరీరం పక్కవైపులో కోణాకారంలో ఉంటుంది.

స్థితి: చక్కగా నిలబడి, కాళ్ల మడమలు దగ్గరగా ఉంచి, వేళ్లు కొంచెం దూరంగా ఉంచండి. గుండెలనిండా గాలిపీల్చి భుజాలు కిందికి జార్చి విశ్రాంతిగా నిలబడండి, మెడ నిటారుగా ఉండాలి. వేళ్లు నేలను చూస్తూ... అరచేతులు తొడలను తాకుతూ ఉండాలి. ముఖం ప్రశాంతంగా ఉండాలి.

1.శ్వాసను తీస్తూ... రెండుకాళ్లమధ్య 1. 1.5 మీటర్ల దూరం ఉండేట్లుగా నిలబడండి. రెండు పాదాలూ ఒకే వరుసలో ఉండాలి.
2.శరీరాన్ని కదిలించకుండా కుడిపాదాన్ని 90° కుడివైపుకు తిప్పండి. కోణంలో
3.శ్వాసను బయటికి విడుస్తూ... కుడివైపుకు వంగండి. కుడి తొడ నేలకు సమాంతరంగా ఉండాలి. కుడి అరచేతిని కుడిపాదం వైపు ఉంచండి. చేతివేళ్లు దగ్గరగా బయటికి చూస్తూ ఉండాలి. కుడివైపు శరీరం కుడి తొడని తాకుతూ ఉండాలి.
4.ఎడమ చేయి దండలు చెవిని తాకేట్లుగా చేయిని పైకి లేపండి. చేతివేళ్లు చూస్తూ... చేయిని నిటారుగా ఉంచండి. ఇదే చివరి స్థితి. సాధారణంగా శ్వాసించండి.
5.శ్వాసను లోనికి తీస్తూ ఎడమచేయిని నెమ్మదిగా ఎడమతొడపైకి తీసుకురండి.
6.శ్వాస తీస్తూనే నెమ్మదిగా నిటారుగా రండి. కుడికాలిని అలాగే ఉంచండి.
7.శ్వాసను వదిలిపెడుతూ కుడిపాదాన్ని 90° ఎడమవైపుకి జరపండి.
8.శ్వాస విడుస్తూనే... కుడికాలుని మామూలుస్థితికి తీసుకురండి. (ఎడమవైపు ఇలాగే ఇంకోసారి చేయండి.)

లాభాలు: గొంతు కండరాలు విచ్చుకుంటాయి, రొమ్ము కండరాలు గట్టిపడతాయి. చేతులు, మడమలు, మోకాళ్లు, నడుము, భుజాలు, దృఢంగా మారుతాయి. తొడ కండరాలు సాగి, విశ్రాంతిని పొందుతాయి. చక్కెర, మలబద్దకం తొలగిపోతాయి, కాళ్లు, మడమల నొప్పులు తగ్గుతాయి. విశాలత్వాన్నీ, విశ్రాంతిని కలిగిస్తుంది.

ముఖ్యాంశాలు:
1. కిందకి వంగేటప్పుడు, ముందుకు కాకుండా, పక్కకి మాత్రమే వంగాలి.
2. మొత్తం శరీరం బరువు ముందరి కాలిపైనే ఉండాలి. చేతిపై బరువు ఉండకూడదు.
3. ఎడమ అరచేయి చూడాలి.

శ్వాస: క్రిందికి వంగినపుడు శ్వాస వెలుపలికి తీయాలి పైకి లేచేప్పుడు లోనికి తీయాలి. చివరిస్థితిలో సాధారణ శ్వాస తీయాలి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments