Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిజాబ్ కు జవాబు - Hijab controversy explained in telugu - megaminds

విద్య కుసుమాలు పూయ్యాల్సిన చోట మత చందసవాదుల కోరలలో విద్యాలయాలలో మత తత్వపు ఆలోచనలను కల్గిన విద్యార్థులను తయారు చెయ్యడమే ఈ హిజాబ్ ...

విద్య కుసుమాలు పూయ్యాల్సిన చోట మత చందసవాదుల కోరలలో విద్యాలయాలలో మత తత్వపు ఆలోచనలను కల్గిన విద్యార్థులను తయారు చెయ్యడమే ఈ హిజాబ్ ఉద్యమం యొక్క లక్ష్యం గా కనబడుతుంది. నిజంగా కేవలం వస్త్రధారణ మాత్రమే సమస్యే అయితే ఈ దేశం లో ఉన్న వాళ్ళు ఎవరు ఏ రకమైన వస్త్రాలను ధరించే స్వేచ్ఛ ఉన్నది, కాని కొన్ని ప్రదేశాలలో అంటే అందరూ కలిసి వుండే చోటు అక్కడి పని లేదా అక్కడి వ్యవస్థ కు తగినట్టు గా వేష దారణ ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశాలను బట్టి అక్కడ ఉన్న వ్యవస్థలను బట్టి ఆ దుస్తు లనే ధరించాలి అక్కడి నియమాలను పాటించాలి. అంతే కానీ నాకు ఇష్టం అయినట్టు గా ఉంటాను అంటే కుదరదు. ఇక పాఠశాలలో విద్యార్థులు అందరూ ఎదిగే వయస్సు మరియు భావి భారత పౌరులుగా నిర్మాణం కావాల్సిన ప్రదేశం, అక్కడ అందరి మధ్య ఎలాంటి బేద భావాలు లేకుండా అందరూ సమానం అనే భావన కల్పించే విధంగా యూనిఫామ్ వుంటుంది.

స్కూల్స్ లో హిజాబ్ వేసుకోవచ్చా లేదా అన్నది అంత సులువైన చర్చ కాదు, సైన్యం ఎందుకు యూనిఫామ్ దరిస్తుంది, డాక్టర్స్, లాయర్లు, నర్స్ లు ఎందుకు యూనిఫామ్ ధరిస్తారు ఈసంస్థలలో యూనిఫామ్ ధరించడం ఎలాగైతే వ్యక్తిగత స్వచ్ఛ కు ఇబ్బంది కలగలేదు అదే విధంగా పాఠశాలలో కూడా విద్యార్థులు యూనిఫామ్ దరిచండం వలన వ్యక్తిగత స్వేచ్ఛ కు ఇబ్బంది కలగదు. నా దృష్టి లో పాఠశాల ల లో కానీ ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలలో కానీ ఎక్కడైతే డ్రెస్ కోడ్ ఉంటుందో అక్కడ వారి వ్యక్తిగత ఇష్టాల మేరకు దుస్తులు దరిస్తాము అనడం అది అక్కడి సామూహికతకు, ఏకత్వం కు విఘాతం కలిగిస్తుంది.

గత సంవత్సరం వరకు uniform వేసుకువచ్చిన విద్యార్థులకు ఈ సంవత్సరమే ఎందుకు ఇబ్బంది వచ్చింది,  ఇది ఆలోచించాల్సిన విషయం. ఈ హీజాబ్ ఉద్యమానికి కి ఆజ్యం పోసింది నలుగురు ముస్లిం విద్యార్థినులు, ఇన్ని సంవత్స రాలు వీళ్ళు ఎప్పుడు కూడా పాఠశాలలో హీజాబ్ వేసుకోలేదు కానీ ఇప్పుడే ఎందుకుపట్టుబడుతున్నారు, వీళ్ళ వెనుక కొన్ని స్వార్ధపర శక్తులు అంటే PFI యొక్క విద్యార్థివిభాగం ఆయిన CAMPUS FRONT OF INDIA లాంటి మత చాందసవాద సంస్థలు ఒక ప్రణాళిక బద్దంగా మొదలుపెట్టాయి. వాళ్ళ ఉద్దేశం దేశం లో మత పరమైన కుట్ర కు తెరలేపాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతున్నది ముందుగా అసలు ఈ PFI అనే సంస్థ యొక్క అసలు రంగు ఏమిటో చూద్దాం.

PFI అనే సంస్థ isisi కు తీవ్రవాదులను రిక్రూట్ చేసేది అని కేరళ పోలీస్ అనేక సందర్భాలలో చెప్పడం జరిగింద, ఢిల్లీ లో జరిగిన అల్లర్లకు కారణము కూడా ఇదే అని పోలీస్ విచారణ లో తెలిసింది రాజకీయ హత్యలు చెయ్యడం, హత్యలు చేసిన వారికి సహకరించే పని చేస్తూ వస్తుంది. 2011 లో కేరళ ప్రభుత్వం PFI ఉగ్రవాదులకు ఊతం ఇచ్చే విధంగా పని చేస్తుంది అని కోర్ట్ లో చెప్పింది. సిమి అనే ఇస్లాం సంస్థ లా గానే PFI కూడా పని చేస్తుంది ఎప్పుడైతే సిమి ని దేశ వ్యాప్తంగా నిషేదించారో అప్పుడు 2006 లో PFI కి పురుడు పోశారు. దీని యొక్క కళాశాల విభాగం ఆయిన్ CFI అంటే క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2021 లో ఉడిపి మరియు మంగుళూరు పరిసర ప్రాంతాలలో ఉన్న అన్ని కాలేజీ లలో సభ్యత్వం చేయించడం జరిగింది.

ఆ తరువాత ఒక నెలకు హీజాబ్ అనే కుట్రకు తెరతీసిన నలుగురు అమ్మాయిలు ట్విట్టర్ లో CFI యొక్క టూల్ కిట్ ను అనుసరిస్తూ హిందువుల ను నేపాల్ వెళ్లమంటూ, సంఘీ అంటూ హిందు సంస్థ ల పై ద్వేషం వెళ్లగక్కారు. ఈ వివాదం లో అరెస్ట్ అయిన రౌఫ్ షరీఫ్ కు మద్దతు ఇస్తూ ట్విట్టర్ ట్రేండింగ్ లో ఈ విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ రౌఫ్ షరీఫ్ఎవరు అంటే ఢిల్లీ అల్లర్ల లో జరిగిన వాటి లో బాద్యుడి గా తేల్చారు అల్లర్లలో పాల్గొన్న వారికి డబ్బులు సమకూర్చారు అనే ఆరోపణ ఉన్నది, హత్రాస్ కేసు లో ఇతని పెరు ఉన్నది. ఇతనిని ఒక సంవత్సరం క్రితం యూపీ పోలీస్ లు కూడా అరెస్ట్ చెయ్యడం జరిగింది. అయితే ఈవిద్యార్థినులు వీళ్లకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు అనేది అంతు చిక్కని ప్రశ్న.

31 డిసెంబర్ 2021 మస్జిద్ మున్నా ఈ కాలేజీ క్యాంపస్ ల నుండి హీజాబ్ కు వ్యతిరేఖంగా ప్రచారం ప్రారంభించారు వీరిని వామపక్ష బావ జాలం కు మద్దతు కలిగిన THE WIRE లాంటి సంస్థలు వీరి ఇంటర్వ్యూ తీసుకుని ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఆ తరువాత మిగతా కొన్ని వామపక్ష బావ జలం కలిగిన మీడియా మరియు రాజకేయ పక్షాలు ఈ ఉద్యమానికి ఊతం ఇవ్వడం జరిగింది.

సరిగ్గా ఉత్తరప్రదేశ్ లో లో జరిగే ఎలక్షన్ ల కు కు ఒక రోజు ముందుగానే విద్యార్థి ని లు కోర్ట్ లో కేస్ వెయ్యడం జరిగింది అంటే దేశం యొక్క మీడియా దృష్టి మరల్చడం తద్వారా ఎలక్షన్ ల లో భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం లో కూడా ఒక భాగం అని చెప్పుకోవచ్చు, ఇంకో వైపు దేశం లో ఉమ్మడి పౌరస్మృతి చట్టం గురుంచి చర్చ జరుగుతున్నది. ఇదే హీజాబ్ విషయం లో 2018 లో కేరళలో తిరువనంతపురం హైకోర్టు మత పరమైన దుస్తులు వేసుకురావడానికి అనుమతి ఇవ్వలేమని చెప్పింది.

ఇంకో వైపు ఈ ఉద్యమానికి పాకిస్థాన్ లో ఉన్న ISI సహకారం తో నడిచే నిషేధిత సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ కు ఆధ్యక్షుడు అయిన గురుపత్వంత్ సింగ్ పన్ను తో చేతులు కలిపి దేశం లో ఉర్దూస్థాయిన్ అనే చీలిక కోసం ఉద్యమాన్ని నడపమని దీనికి నిధులు ఇవ్వడానికి సిద్ధము అని తాను ఆన్లైన్ ఒక సమాచారం చేరవేస్తున్నారు. ఈ 21 వ శతాబ్దం లో ఆధునిక ఆలోచనాలవైపు గా ప్రయాణించాల్సిన తరుణం లో మధ్యయుగపు చాందసవాద ఆలోచనలు ఇంకా అమలు చెయ్యాలని చూస్తున్నారు.

సౌదీ అరేబియా, జోర్దాన్ వంటి ఆధునిక ముస్లిం దేశాల లో ఆదునికత వైపు నడుస్తున్నాయి కానీ భారత దేశం లో ని ముస్లిం సమాజం మాత్రం ఈచాందసవాద ఆచారాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు గా లేదు. ప్రముఖ తెలుగు రచయిత్రి షాజహానా - "ముసుగు తీసి చూడు" రచనలో "ఈ_క్షణమే_నా_నిశ్శబ్దాన్ని_మీకు_బదలాయిస్తున్న, మా_బురఖా_దుప్పట్టాల్ని_పీలికలుగా_చేసి_నీ_మీద_విసిరేస్తున్న" అంటూ బురఖా విధానాన్ని తప్పు బట్టింది.

మరొక ఇంగ్లీష్ రచయిత్రి, సామాజిక ఉద్యమకర్త "అయాన్_హిర్సి_అలి" రాసిన "THE CAGED VIRGIN" ( మత పంజరంలో కన్య) పుస్తకంలో ప్రపంచ వ్యాప్తంగా ముస్లీం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రధాన మూల కారణం సాంప్రదాయం వంకతో బురఖా, సున్తి విధానాలను ప్రవేశపెట్టి మహిళలను సజీవంగా ఎంత చిత్రవదలకు గురిచేస్తున్నారో వందలకొద్ది ఉదాహరణలతో తన పుస్తకంలో వివరించింది.

JEREMY GUY అనే సినిమా దర్శకుడు 2018 సంవత్సరంలో "పర్దా" డాక్యుమెంటరి తీశాడు. అందులో "2011 KAIKASH MIRZSAHA అనే ముస్లీం అమ్మాయి క్రికెట్ ఆడాలనే కోరికతో బురఖా తీసి బయటికి వచ్చినప్పుడు ఆమెపైన మత చాందస శక్తులు ఎలా దాడి చేశారో, వాటి నుండి ఆమె కుటుంబ సభ్యుల సహయంతో ఎలా బయటపడింది, తనకు ముస్లీం సమాజంలో ఎదురయ్యే ఆటంకాలను దాటుకొని ఎలా విజయం సాధించింది." లాంటి అనే విషయాలను కళ్ళకుకట్టినట్లుగా చిత్రీకరించాడు.
 
"హిజాబ్" వివాదం గురించి మాట్లాడుతున్న ప్రగతిశీల వాదులు, రంగు రంగు ల లోకం లో జీవిస్తున్న వారు ఎవరు కూడా వారి నిజ జీవితంలో తల మీది ముసుగు ధరించి ఉండరు. ధరించి ఉండి ఉంటే ఆ తెర వెనకాల ఉన్న వేదన వారికి అర్ధమై ఉండేది. మతం వ్యక్తిగతమైనప్పుడు వాళ్ళ ఆచారాలు, అలవాట్లకు ఒక హద్దు ఉంటుంది కదా? నిజంగా సామాజిక సమస్యలకు స్పందించాలనుకుంటే ముస్లీం సమాజంలో మహిళలు అనేక సమస్యలతో భాదపడుతున్నారు వాటిపై పోరాటం చెయ్యాల్సిన అవసరం ఉన్నది. - సామాజిక కార్యకర్త, త్రిలోక్.

సావర్కర్ వ్రాసిన అండమాన్ లో ఆజన్మాంతం పుస్తకం కొరకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి:
మా వాట్సాప్ నెంబర్ : +91 8500-5819-28

or Directly Buy

No comments