పోక్సో చట్టం అంటే ఏమిటి? లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా పిల్లలపై జరిగే అనేక రకాల లైంగిక...
పోక్సో చట్టం అంటే ఏమిటి?
లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా పిల్లలపై జరిగే అనేక రకాల లైంగిక నేరాలపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు అమలు చేయవచ్చు. ఏవరైనా వ్యక్తి తన చేష్టలతో పిల్లల జీవించే హక్కును హరించి, వారి జీవితానికి, అభివృద్ధికి, శ్రేయస్సుకు తీవ్రమైన ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై ఈ చట్టం కింద కేసు నమోదు చేస్తారు. శారీరకంగా, మానసికంగా వేధించినా కూడా ఈ కేసు నమోదు చేస్తారు.లైంగికంగా ఇబ్బంది పెట్టేలా తాకడం, పిల్లలపై సెక్సువల్‍గా దాడి చేయడాన్ని కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకుని వచ్చింది ప్రభుత్వం. పిల్లల సమ్మతితోనే లైంగిక చర్య జరిగినా సరే, నేరంగానే పరిగణిస్తారు. ఎందుకంటే లైంగిక చర్యకు సమ్మతి తెలిపే మానసిక పరిణితి పిల్లల్లో ఉండదని చట్టంలో ఉంది. 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న ఎవరినైనా సరే, భారత చట్టాల ప్రకారం పిల్లలుగానే పరిగణించి, వారిని పోక్సో చట్టం కింద శిక్షిస్తారు.
బాలికపై లైంగిక దాడికి గురైందన్న సమాచారం ఉన్న ఎవరైనా POCSO చట్టం కింద నిందితుడిపై ఫిర్యాదు చేయవచ్చు. తల్లిదండ్రులు, డాక్టర్లు, స్కూల్ సిబ్బంది లైంగిక దాడిగి గురైన బాలబాలికలు పోక్సో కేసు పెట్టవచ్చు.
చిన్న వయస్సులోనే ఎంతోమంది ఆడపిల్లలు లైంగిక వేధింపులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత్‌లో పిల్లలపై జరిగే లైంగిక నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూ ఉన్నాయి. పిల్లలపై నేరాలను కట్టడి చేయడానికి 2012లో కఠిన శిక్షలతో కూడిన ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్((POCSO) Act ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తీసుకుని వచ్చింది భారత ప్రభుత్వం. చిన్న పిల్లలపై లైంగిక దాడికి పాల్పడే వారికి ఉరిశిక్ష వరకు శిక్షలు విధించేలా ప్రభుత్వం ఫోక్సో చట్టాన్ని తీసుకుని వచ్చింది.
what is pocso act pdf పీడీ యాక్టు ఫుల్ ఫారం
No comments