స్వాతంత్య్ర సమరంలో మైలురాళ్ళు: ఐక్యత, సమర్థత, నిర్ణయాత్మక విధానం అనేది భారతదేశ స్వాతంత్య సమరంలో ప్రధానమైన అంశాలు, దేశానికి స్వాత...
స్వాతంత్య్ర సమరంలో మైలురాళ్ళు: ఐక్యత, సమర్థత, నిర్ణయాత్మక విధానం అనేది భారతదేశ స్వాతంత్య సమరంలో ప్రధానమైన అంశాలు, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా మనం నిర్వహించుకుంటున్న అమృత మహోత్సవాలు ఆ స్పూర్తిని ప్రతిబింబిస్తున్నాయి. అంతే కాదు ఈ పండగలో ప్రతి భారతీయుడు భాగస్వామిగా వున్నాడు. అన్ని వర్గాలకు చెందిన భారతీయులు ఇందులో పాల్గొంటున్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం, అసమానత్వం, నిరక్షరాస్యత, బహిరంగ మల విసర్జన, ఉగ్రవాదం, వివక్షలాంటి సామాజిక సమస్యలను తొలగించుకోవడానికిగాను దేశంలోని ప్రతి పౌరుడు కృషి చేస్తున్నాడు. స్వాతంత్య్ర్య సమరం నాటి స్ఫూర్తిని ప్రతిఫలించేలా ముందడుగు వేస్తున్నారు.
మన కలల్ని నిజం చేసుకోవడానికి, జీవన విలువలకు భద్రత చేకూర్చుకోవడానికి, నూతన భారతదేశాన్ని నిర్మించడానికిగాను అమృత మహోత్సవం అనేది ఒక ముఖ్యమైన సందర్భం. ఈ కార్యక్రమం దేశ పౌరుల్లో నూతన శక్తిని, చైతన్యాన్ని నింపుతోంది. అంతే కాదు ప్రజలు దేశాభివృద్ధికోసం కృషి చేసేలా స్ఫూర్తిని ఇస్తోంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే వాటినన్నిటినీ అధిగమిస్తూ భారతమాత గౌరవ మర్యాదలను కాపాడడమే భారత స్వాతంత్ర్య పోరాట ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం అనేక మంది భారతమాత ముద్దు బిడ్డలు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారు. మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికిగాను వారు ప్రాణ త్యాగం చేశారు.
దేశానికి స్వాతంత్య్రం సాధించడమనే ముఖ్య లక్ష్యంతోపాటు వారికి మరొక కల కూడా వుండేది. స్వతంత్ర భారతదేశంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, వెనకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు, మహిళలు ..ఇలా అందరూ సమానంగా అభివృద్ధి చెందేలా పరిస్థితులు వుండాలని వారు కలలు కన్నారు. భారతదేశ గొప్పదనాన్ని దృష్టిలో పెట్టుకొని, మన స్వాతంత్య్ర పోరాట ప్రాధాన్యతను రాబోయే తరాలతో పంచుకోవడమనేది మన బాధ్యత. ఆ పని చేయడంవల్ల స్వాతంత్యం కోసం మన త్యాగమూర్తుల పడిన కష్టం గురించి రాబోయే తరాలకు అర్ధమవుతుంది. అందుకే ఈ అమృత మహోత్సవ్ వ్యాసాలలో భాగంగా దేశంకోసం ప్రాణ త్యాగం చేసి, తర్వాతి తరాలకు స్ఫూర్తిని నింపిన యోధుల జీవితాల గురించి తెలుసుకోవడం మన బాధ్యత.
బాల్యదశలోనే స్వతంత్ర భారత్ కోసం కలలు కన్న భగత్ సింగ్: ఒక రోజున ఇసుక కుప్పలు తయారు చేసి వాటిపైన గడ్డి పుల్లలు వుంచి ఓ చిన్నారి ఆడుకుంటున్నాడు. అది చూసిన ఆ చిన్నారి తండ్రి ఆ పుల్లలు ఎందుకు ఇలా నాటావు అని ఆసక్తిగా ఆ బాలుడిని అడిగారు. దానికి ఆ చిన్నారి ఇలా సమాధానం చెప్పాడు. " నేను తుపాకీని నాటుతున్నాను. నేను పెద్దయ్యే సమయానికి చెట్టు మీద తుపాకీలు మొలుస్తాయి. అప్పుడు వాటిని తీసుకొని దుష్ట బ్రిటీష్ పాలకులను తరిమి కొడతాను." ఆ బాలుడు మరెవరో కాదు, దేశం గర్వించదగ్గ విప్లవయోధుడు భగత్ సింగ్. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 18న జన్మించారు. దేశం మీద ఆయన ప్రేమ, స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం అద్భుతమైనవి. బ్రిటీషర్లు తమంతట తాము ఈ దేశాన్ని వదిలిపోరని వారికి గుణపాఠం నేర్చాలని భగత్ సింగ్ నమ్మారు.

1919లో జలియన్వాలా భాగ్ బ్రిటీషర్ల ఘాతుకం భగత్ సింగ్ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. వందలాది మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ప్రాంతానికి వెళ్లి దాన్ని స్వయంగా భగత్ సింగ్ చూశారు. అప్పుడతని వయస్సు 12 సంవత్సరాలు. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆ రోజునే ఆయన ప్రతిన బూనారు. ఆ విధంగా క్రమక్రమంగా విప్లవ పంథావైపు పయనించారు. బ్రిటీషర్లపై భగత్ సింగ్ చేసిన దారులు, తదనంతరం 23 సంవత్సరాల వయస్సులోనే ఉరిశిక్షకు గురై ఆయన మరణించడమనే ఈ రెండు అంశాలు భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన్ను జనాల హృదయాల్లో నిలిచిపోయే విధంగా చేశాయి.
అది 1928 డిసెంబర్ నెల, పాకిస్తాన్ లోని లాహోర్ లో 21 సంవత్సరాల బ్రిటీష్ పోలీస్ అధికారి జాన్ శాండర్స్ పై భగత్ సింగ్ అతని స్నేహితుడు రాజగురు కాల్పులు జరిపారు. ఆ తర్వాత భగత్ సింగ్ అజ్ఞాత వాసంలోకి వెళ్లిపోయాడు. నాలుగు నెలల తర్వాత 1929 ఏప్రిల్ నెలలో అతను అతని సహచరుడు బటుకేశ్వర్ దత్ కలిసి నాటి ఢిల్లీ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో తక్కవ సామర్థ్యంగల రెండు నాటుబాంబులను పేల్చారు. అసెంబ్లీలో ఖాళీగా వున్న చివరి బెంచీలలో అవి పేరాయి. ఆ తర్వాత వారిద్దరూ అధికారుల ముందు లొంగిపోయారు. తదనంతరం జరిగిన విచారణలో జాన్ శాండర్స్ కేసులో భగత్ సింగ్ పాత్ర వెలుగులోకి వచ్చింది.

ఆ కేసులో ఆయనకు ఆయన స్నేహితులు రాజగురు, సుఖ్ దేవ్ లకు మరణశిక్ష విధించారు. 1931 మార్చి నెలలో అమలు చేశారు. ఉరికంబానికి వెళుతూ, వారు ఇంక్విలాబ్ జిందాబాద్, హిందూస్థాన్ అజాద్ హో అంటూ నినాదాలు చేశారు. జైలులో వున్న భగత్ సింగ్ ను చూడడానికి ఒకసారి ఆయన మాతృమూర్తి వచ్చారు. ఆమెతో మాట్లాడిన భగత్ సింగ్' నా శవాన్ని తీసుకుపోవడానికి నీవు రావద్దన్న నీ బదులుగా సోదరుడు కుల్ దీప్ ను పంపు, నీవు నా శవాన్ని చూసి ఏడుస్తావు. అప్పుడందరూ భగత్ సింగ్ మాతృమూర్తి ఏడుస్తుందని అంటారు. అలా అందరూ అనుకోవడం నాకు ఇష్టం లేదు' అని మాతృమూర్తితో చెప్పాడు.
"ప్రపంచంలోని అధిక భాగాన్ని బ్రిటీషర్లు పరిపాలించారు. అందుకే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యముని దానికి ఆ రోజుల్లో పేరు వచ్చింది. అలాంటి బ్రిటీష్ సామ్రాజ్యం... 23 సంవత్సరాల యువకుడంటే భయపడింది. షహీద్ భగత్ సింగ్ కేవలం ధైర్య సాహసాలు కలిగిన వాడు మాత్రమే కాదు ఆయన తెలివైనవాడు, మంచి ఆలోచనాపరుడు. తమ జీవితాల గురించి క్షణం కూడా ఆలోచించకుండా భగత్ సింగ్ ఆయన స్నేహితులు దేశస్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. షహీద్ భగత్ సింగ్ జీవితంలోని మరొక ప్రధానమైన అంశం ఆయన టీమ్ వర్క్ ప్రాధాన్యతను గుర్తించారు.

లాలా లజపతి రాయ్ అంటే అమితమైన గౌరవం, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్ దేవ్, రాజగురు ఇంకా ఇతర స్వాతంత్య్ర్య సమరయోధులతో కలిసి పని చేశారు. వ్యక్తిగతమైన ఎదుగుదల అనేది భగత్ సింగ్ కు ముఖ్యం కాదు. ఆయన తన జీవితాంతం స్వాతంత్య్ర్య సాధన కోసం కృషి చేశారు. అందుకోసం తన జీవితాన్నే త్యాగం చేశారు. బ్రిటీషర్ల చెర నుంచి దేశాన్ని విడిపించడమే లక్ష్యంగా ఆయన పోరాటం కొనసాగింది.
త్రివర్ణ పతాకం కోసం బుటైట్ బారిన పడిన యోధురాలు భోగేశ్వరి పుకనాని: స్వతంత్ర్య పోరాటంలో భాగంగా మొదలైన క్విట్ ఇండియా ఉద్యమం దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన మహిళలకు స్ఫూర్తినిచ్చింది. అలా స్ఫూర్తి పొందిన మహిళల్లో ప్రసిద్ధి చెందినవారు భోగేశ్వరి పుకనాని. ఆమె 1885లో రాష్ట్రం నాగోన్ జిల్లాలోని లర్హంపూర్ ప్రాంతంలో జన్మించారు. భయమెరుగని పోరాట యోధురాలుగా పేరు సంపాదించుకున్నారు. ఆమె భర్త పేరు భోగేశ్వర్ వారికి ఎనిమిద మంది పిల్లలు, ఈశాన్య భారతదేశంలో జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచాడు. ఆమె భారీ స్థాయిలో కొనసాగించిన తిరుగుబాటు. కార్యక్రమాలు దేశవ్యాప్తంగా స్ఫూర్తినిచ్చి సర్వత్రా ఆందోళనలకు కారణమయ్యాయి, మహిళలు వంట ఇంటికే పరిమితమై వివక్షను ఎదుర్కొంటున్న రోజుల్లో ఒక మహిళగా స్వాతంత్య్ర పోరాటంలోకి దూకి స్థానిక ఆందోళనల్ని ముందుకు నడిపించారు.
బ్రిటన్ అధికారులకు, వారి అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. వయసు మీద పడిన సమయంలో కూడా ఆమె చురుగ్గా ఉద్యమంలో పాల్గొన్నారు. తన పిల్లల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. ఒకసారి బ్రిటీష్ సైనికులు స్థానిక కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించి స్వాధీనం చేసుకుంటే రంగంలోకి దిగిన భోగేశ్వరి తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టి తిరిగి ఆ కార్యాలయాన్ని తన నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ అపజయాన్ని తట్టుకోలేని బ్రిటీష్ అధికారులు తిరిగి బలాన్ని ఉపయోగించి కాంగ్రెస్ కార్యాలయాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. అప్పుడు స్వాతంత్య్ర పోరాట యోధులతో కలిసి భోగీశ్వరి వందే మాతర వినాదం చేసుకుంటూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బ్రిటీష్ సైనికులతో తలపడ్డారు.
అప్పుడు జరిగిన ఘర్షణలో ఓ బ్రిటీష్ అధికారి అక్కడి స్వాతంత్య్ర సమరయోధురాలు రత్నమాల చేతిలోనుంచి త్రివర్ణ పతాకాన్ని లాక్కున్నాడు. ఇది చూసిన భోగేశ్వరి రక్తం ఉడికిపోయింది. చేతిలో వున్న జెండా కర్రను తీసుకొని ఆ బ్రిటీష్ అధికారిని గట్టిగా కొట్టింది. ఊహించని ఈ పరిణామానికి విత్తరపోయిన బ్రిటీష్ అధికారులు తుపాకులతో కాల్పులు జరిపారు. గుండు తగిలి గాయపడిన భోగేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూరు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 20, 1942లో మరణించారు. భోగేశ్వరి త్యాగానికి గుర్తుగా ఆమె పోరాటాలను గుర్తు చేసుకుంటూ అస్సాం రాష్ట్రంలో ఓ ఆసుపత్రికి ఆమె పేరును పెట్టాడు.
భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక నేత విఠల్ భాయ్ పటేల్: గుజరాత్ రాష్ట్రం ఖేడా జిల్లా కరంసాద్ గ్రామంలో 1873లో విఠల్ భాయ్ పటేల్ జన్మించారు. వారి కుటుంబంలోని సోదరుల్లో విఠల్ భాయ్ మూడోవాడు. దేశ స్వాతంత్య్ర పోరాటంలోను, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ ఐక్యతమ సాధించడంలోను కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఆయన అన్న. విఠల్ భాయ్ పటేల్ తన స్కూలు విద్యను కరంసాద్. లోమ, నడియాడ్ లోను పూర్తి చేశారు. అన్నదమ్ములిద్దరు బారిస్టర్లు కావాలని కలలు కన్నారు. ఇందుకోసం లండన్ కు వెళ్లాలని భావించారు.

అయితే వీరిలో విఠల్ భాయ్ పటేల్ కు లండన్ వెళ్లే అవకాశం లభించింది. చదువుల్లో తెలివైన విద్యార్థి కావడంతో 36 నెలల్లో పూర్తి చేయాల్సిన కోర్సును 30 నెలల్లో పూర్తి చేసి తన తరగతిలో మొదటి స్థానంలో నిలిచారు. 1913లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన బాంబే, అహ్మదాబాద్ కోర్టులలో ముఖ్యమైన న్యాయవాదిగా పేరు గడించారు. న్యాయవాద వృత్తిపై పట్టు సాధించడంతో తక్కువ సమయంలోనే ఆయనకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆయన భార్య 1915లో మరణించారు. అయితే ఆయన మరో మారు పెళ్లి చేసుకోలేదు. సెంట్రల్ కానిస్టిట్యూట్ అసెంబ్లీ మొదటి అధ్యక్షునిగా ఆయన ఎన్నికయ్యారు. ముంబయి మేయర్ గా కూడా సేవలందించారు.
గాంధీతో సైద్దాంతికపరమైన అభిప్రాయ బేధాలున్నప్పటికీ ఆయున కాంగ్రెస్లో చేరి స్వాతంత్య్ర్య సమరంలో భాగమయ్యారు. 1920 నుంచీ ఆయన కాంగ్రెస్ ప్రముఖ నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్వాతంత్య్ర్య పోరాటంలో భాగంగా పలు మార్లు అరెస్టయ్యారు. చౌరీ చౌరా ఘటనతో ఆందోళన చెందిన గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేయడం జరిగింది. గాంధీజీ తీసుకున్న ఈ నిర్ణయం విఠల్ భాయ్ పటేల్ కు నిరాశను కలిగించింది. ఆయన కాంగ్రెస్ ను వదిలేసి చిత్తరంజన్ దాస్, మోతిలాల్ నెహ్రూలతో కలిసి స్వరాజ్ పార్టీని ప్రారంభించారు. విఠల్ భాయ్ 1932లో జైలు పాలయ్యారు. అనారోగ్య కారణాల రీత్యా బ్రిటీష్ పాలకులు ఆయన్ను విడుదల చేశారు.
1932 మార్చి నెలలో భారతదేశాన్ని వదిలేసి విదేశాలకు వెళ్లారు. జబ్బుపడిన ఆయన విదేశాల్లో ఉండగానే మరణించాడు. ఆయన తన ఆస్తిలో మూడింట రెండు భాగాలను సుభాష్ చంద్రబోస్ కు రాసి ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్ మనుషులు ఆ వీలునామాను తీసుకొని వల్లభాయ్ పటేల్ కు చూపారు. అయితే ఆయన ఆ వీలునామాపై వున్న సంతకంపై అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో ఈ వీలునామా కోర్టుకు వెళ్లింది. ఈ కేసులో వల్లభాయ్ పటేల్ గెలిచారు. ఆ తర్వాత ఆయన విఠల్ భాయ్ ఆస్తినంతటినీ ఒక ట్రస్టుకు మార్చారు. అనంతరం ఆ ట్రస్టును సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.
ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..
No comments