Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ స్థలంగా మారి దర్శనీయ క్షేత్రమైన దండి

స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ స్థలంగా మారి దర్శనీయ క్షేత్రమైన దండి: దండి, గుజరాత్ లోని నవ్ సారి జిల్లా నుండి 16 కిలోమీటర్ల దూరంలో...

స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ స్థలంగా మారి దర్శనీయ క్షేత్రమైన దండి: దండి, గుజరాత్ లోని నవ్ సారి జిల్లా నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారతదేశంలోనే అత్యధిక ప్రాచుర్యం పొందిన గ్రామం మాత్రమే కాదు, ఎప్పటికీ గుర్తింపు తగ్గని విధంగా 92 ఏళ్ళుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతూనే ఉంది. భారతదేశ స్వాతంత్య ఉద్యమంలో ఇది ఒక "తీర్ధయాత్రా స్థలం". "నేను ఈ గుప్పెడు ఉప్పుతో బ్రిటీష్ పాలన మూలాలను కదిలించడం ప్రారంభించాను" అని తన చేతిలో గుప్పెడు ఉప్పుని చూపిస్తూ బాపు అన్నారు.

బ్రిటీష్ వారు ఉప్పు మీద పన్ను విధింపు చట్టాన్ని ఆమోదించినప్పుడు బాపు దేశవ్యాప్తంగా ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చి నాయకత్వం వహించారు. అది కూడా అహింసా మార్గాన్ని ఆచరిస్తూ, దండి మార్చ్ లేదా శాసనోల్లంఘన ఉద్యమం.. పేరు ఏదైనా కానీ, బ్రిటీష్ ప్రభుత్వం చేస్తున్న ఉప్పు మీద పన్ను అనేది "ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన పన్ను విధింపు" అని దాన్ని దిక్కరించడానికే మహాత్మ గాంధీ నిర్ణయించుకున్నారు. బ్రిటీష్ వారు ఉప్పు మీద విధించిన పన్ను ఆ సమయంలో చాలా అసమంజసమైనదిగా, చాలా ఎక్కువగా ఉండేది. 1930 మార్చి 11న 10,000 మంది ప్రజలు సాయంత్రపు ప్రార్ధన కోసం అహ్మదాబాద్ లోని సబర్మతి వద్ద ఇసుక మీద గుమిగూడారు. అప్పుడు ఆయన తాను చేపట్టనున్న చారిత్రక యాత్ర గురించి అద్భుత ప్రసంగం చేశారు.

ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా బావు బ్రిటిషు పాలనను ధిక్కరించారు. ఈ యాత్రలో మహాత్మ గాంధీ కోసం ఒక గుర్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ యాత్ర పొడుగునా గాంధీ పాదాలు బొబ్బలెక్కినా లెక్కచేయకుండా నడకతోనే ప్రయాణం కొనసాగించాడు తప్ప తన కోసం ఏర్పాటు చేసిన పల్లకిగానీ, గుర్రం కానీ ఉపయోగించుకునేందుకు నిరాకరించారు.

గాంధీ తనతోపాటు ప్రయాణం చేసే వారిని స్వయంగా ఎంపిక చేసుకున్నారు. కార్యకర్తలతో స్వయంగా మాట్లాడి వారి వివరాలు తెలుసుకున్నారు. ఈ యాత్రలో పాల్గొన్న అందరిలోకి గాంధీనే వయసులో పెద్దవారు అప్పుడు ఆయన వయసు 61. సంవత్సరాలు, విఠల్ లీలాధర్ థక్కర్ అనే 16 ఏళ్ళ అబ్బాయి ఈ యాత్ర సభ్యులందరిలోకీ చిన్నవాడు. గాంధీ దండీకి చేరుకునే సమయానికి మొత్తం 50 వేల మందికి పైగా ఈ అహింసా ఉప్పు సత్యాగ్రహ యాత్రతో జత కలిశారు. గాంధీజీ ఈ యాత్రలో ప్రతి సోమవారం మౌనవ్రతం, ఉపవాసం వంటివి చేశారు.. బాపు దండి యాత్ర జరిగి 91 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా చారిత్రక అమృత్ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 12, 2021న స్వాతంత్య్ర సమరయోధులు త్యాగనిరతికి నివాళులు అర్పించే ఉద్దేశంతో 80 మందిని దండి యాత్రకు పంపించారు. స్వాతంత్య్ర అమృత్ మహోత్సవంలోని ఈ వ్యాసంలో ఉప్పు సత్యాగ్రహం, దండియాత్రలో పాల్గొన్న స్వాతంత్య సమరయోధుల గురించి తెలుసుకుందాం.

వృద్ధ గాంధీగా ప్రసిద్ధి మాతంగిని హజ్రా: నిజమైన గాంధేయవాది. ఆమె రాట్నం వడికేవారు. ఖాదీ ధరించేవారు, ప్రజాసేవలో హృదయ పూర్వకంగా పాల్గొనేవారు. మహిళల్లో ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ఆమె అత్యంత ప్రజాధరణ పొందిన మహిళ, ఆమెను వృద్ధ గాంధీ అని పిలిచేవారు. దేశం కోసం మరణించడానికి వయసు అడ్డురాదని ఆమె నిరూపించారు.

అది 1930వ సంవత్సరం, ఆమె గ్రామంలో కొంతమంది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు, ఆమె అప్పుడే స్వాతంత్య ఉద్యమం గురించి మొదటిసారిగా విన్నారు. బ్రిటీషు వారు తన దేశాన్ని ఎలా పాలించారో చూశారు. దాంతో శాసనోల్లంఘనను స్వాగతించిన మాతంగి హత్రా తన గుడిసెలోంచి శంఖం ఊదుతూ ఉద్యమ ఊరేగింపులో హాజరయ్యారు. అప్పుడు ఆమె వయసు 60 సంవత్సరాలు. తర్వాత స్వాతంత్య్ర్య ఉద్యమంతో అనుబంధం ఏర్పర్చుకుని భారత స్వాతంత్య్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొనేవారు. అంతేకాదు మహాత్మాగాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ, పౌర అవిధేయత, క్విట్ ఇండియా ఉద్యమాల్లో ఆమె కీలకపాత్ర పోషించారు.

మాతంగిని 1870 అక్టోబర్ 19న జన్మించింది. ఆమెది చాలా పేద కుటుంబం. ఆమె తండ్రి ఒక రైతు. పేదరికం కారణంగా ఆమె ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళలేదు. ఆమెకు 12 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది. తర్వాత కొంత కాలానికి ఆమె భర్త మరణించాడు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో మాతంగిని తమ్లుక్ లో 6,000 మంది మద్దతుదారులకు నాయకత్వం వహించారు. అందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు. సెప్టెంబర్ 29న తమ్లుక్ లో పెద్ద ర్యాలీ నిర్వహించాలని ఆమె నిర్ణయించింది. వారు పోలీస్ స్టేషన్ వైపు ఊరేగింపుగా వెళ్ళారు. బ్రిటీష్ వారు ఆ సమయంలో ఆ ప్రాంతం మొత్తం 144 సెక్షన్ విధించారు.

కానీ, మాతంగిని త్రివర్ణ పతాకం పట్టుకుని, వందేమాతరం అంటూ నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగింది. అకస్మాత్తుగా ఒక బుల్లెట్ మాతంగిని కుడిచేతిలోకి. దూసుకుపోయింది. అయినా ఆమె చలించకుండా ముందుకు అడుగులు వేసింది. ఈసారి రెండవ బుల్లెట్ ఆమె నుదుటికి తగిలింది. కానీ, ఆమె తన చేతిలోని త్రివర్ణ పతాకం గట్టిగా పట్టుకుని వందేమాతరం అని తుది శ్వాస విడిచేవరకూ నినాదం చేస్తూనే ఉంది. మాతంగిని హజ్రా చూపించిన అద్భుతమైన ధైర్యం, ఉత్సాహం, స్వాతంత్య్ర్య కాంక్ష యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15 2021న ఎర్రకోట వేదిక మీద మాతంగిని హజ్రాను గుర్తు చేసుకున్నారు.

కమలా దేవీ ఉప్పు సత్యాగ్రహంలో మహిళలను కూడా చేర్చుకోవాలని మహాత్మా గాంధీని అభ్యర్ధించిన ధీరవనిత: ఉప్పు మీద బ్రిటీష్ పాలకులు విధించిన పన్ను చట్టాన్ని నిరసిస్తూ మహాత్మ గాంధీ దండి మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. మహిళలు రాట్నం వడకడంలోనూ, మద్యం దుకాణాలు సీజ్ చేసే ఉద్యమాలలో కీలక పాత్ర పోషించాలని గాంధీ భావించారు. ఈ సమాచారం తన చెవిన పడగానే కమలా దేవీ చటోపాధ్యాయ ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గాంధీని కలుసుకుని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనే అవకాశం.. మహిళలకు కూడా తప్పనిసరిగా కల్పించాలని కోరారు. గాంధీతో జరిగిన సమావేశంలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో మహిళలను కూడా చేర్చుకోవాలని గాంధీని ఒప్పించేందుకు ప్రయత్నించి ఆమె సఫలీకతులయ్యారు. ఇది ఒక చారిత్రక నిర్ణయంగా అభివర్ణించాలి. మహిళలను కూడా ఉద్యమంలో చేర్చుకునేందుకు గాంధీ అంగీకరించడంతో కమలాదేవి, అవంతిక గోఖలే వంటి ఏడుగురు స్త్రీలు ఒక జట్టుగా ఏర్పడి ముంబైలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు.

కమలా దేవి ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆమెను అరెస్టు చేశారు. కమలా దేవి చటోపాధ్యాయ 1903, ఏప్రిల్ 3న కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. భారతదేశానికి తిరిగి రావడానికి ముందు ఆమె లండన్ విశ్వవిద్యాలయం నుంచి సోషల్ సైన్స్ లో డిప్లమా అందుకున్నారు. ఇండియా తిరిగి వచ్చాక భారత స్వాతంత్య పోరాటంలో పాల్గొన్నారు. గాంధేయవాద సంస్థ అయిన సేవా దళ్ లో చేరారు. ఆమె 1936లో అభిల భారత మహిళా సదస్సు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

ఆమె అద్భుతమైన రచయిత్రి కూడా. భారతదేశంలో మహిళల హక్కులపై అనేక కథనాలు ప్రచురించారు. "ఇండియన్ విమెన్స్ వార్ ఫర్ ఇండిపెండెన్స్" అనేది ఆమె చివరి పుస్తకం. ఇది 1982లో ప్రచురించబడింది. అది మాత్రమే కాదు, భారతీయ హస్తకళలు, చేనేత వంటివి. పునరుద్ధరించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. అందుకే ఆమెకు 'చేనేత మాత' అనే పేరు, ఘనత దక్కాయి.. ఆమె హస్తకళలు, సహకార ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారు. అనేక జాతీయ సంస్థల నాటకాలను ప్రోత్సహించడంతో పాటు, థియేటర్, సంగీత కళ, తోలుబొమ్మలాట వంటివి ఎన్నిటికో తన సహకారాన్ని అందించి ప్రోత్సహించారు. ఆమె ప్రయత్నాల ఫలితంగా 1944లో ఇండియన్ నేషనల్ థియేటర్ (ప్రస్తుతం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా) సంస్థ ప్రారంభమైంది. 1955లో ఆమె పద్మభూషణ్ పురస్కారాన్ని 1987లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.

బీహార్ నుండి దండి మార్చ్ లో పాల్గొన్న ఏకైక ఉద్యమకారుడు గిరివర్ధరి చౌదరి: గిరివర్ధరి చౌదరి, ఎదురులేని వ్యక్తి, భారత యోధుడు. అతి చిన్న వయసులో మహాత్మ గాంధీని కలుసుకుని ఆయన మార్గాన్ని అనుసరిస్తూ సత్యం, అహింసా మార్గాల్లో జీవితాంతం కొనసాగిన మనిషి, శాసనోల్లంఘన ఉద్యమంలో బ్రిటీష్ చట్టాలను ఉల్లంఘించే ఉద్దేశంతో మహాత్మ గాంధీ ఎన్నుకున్న సత్యాగ్రహుల్లో గిరివర్ధరి చౌదరి ఒకరు. బీహార్ నుంచి దండి యాత్రలో పాల్గొన్న ఒకే ఒక్క వ్యక్తి గిరివద్దరి చౌదరి. మీరు బీహార్ ప్రతిష్టను నిలబెట్టారు అని డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఒక మీటింగ్ లో చౌదరిని ఉద్దేశించి అన్నారు.

ఈ యాత్రలో పాల్గొనే సమయంలో గిరివర్ధరి చౌదరి వయసు కేవలం 20 సంవత్సరాలు, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మ గాంధీ వైపు దృఢంగా నిలబడ్డాడు. అంతేకాకుండా, అతను గాంధేయ సూత్రాలకు, అహింసావాదానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాడు. దండి యాత్ర విజయవంతం కావడానికి గాంధీకి తన పూర్తి సహకారం అందించారు. మహాత్మ గాంధీ నిర్వహించిన దండి మార్చ్ ఫలితంగా ఉద్యమం బీహార్ లోని అనేక ప్రాంతాలకు వ్యాపించింది. దాంతో అక్కడి ప్రజలు ప్రతీకాత్మకంగా ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించి ఎందరో అరెస్టు అయ్యారు.

గిరివర్ధరి చౌదరిని కరిబాబు అని కూడా అంటారు. ఆయన తన అన్నయ్య హరిగోవింద్ చౌదరి ప్రభావంతో సబర్మతి ఆశ్రమం చేరుకున్నారని భావిస్తారు. ఆయన బాపుతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపేవారు. గిరివద్దరి చౌదరిపై గాంధీ ప్రభావం ఎక్కువగా ఉండేది. దండి యాత్ర సమయంలో అతను బాపు అహింస మార్గానికి భక్తుడైపోయాడు. అక్కడి నుండి ఆయన కేవలం ఖాదీ ధోతీతో తిరిగి వచ్చారు. ఒంటి మీద మరే దుస్తులు లేవు, కనీసం చెప్పులు కూడా లేవు. అంతే కాకుండా, మహాత్మ గాంధీ ఫోటోని తన ఇంటిలోని పూజ గదిలో ఇతర దేవుళ్ళ పక్కన ఉంచుకున్నారు. ఆ ప్రాంతంలో చౌదరిని 'మధిల్ గాంధీ కరో బాబు' అని పిలిచేవారు.

దండి యాత్రలో పాల్గొన్న మహాత్మా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి ప్యారేలాల్ నాయర్: జీవితకాలం గాంధేయవాదిగా బతికిన ప్యారేలాల్ నాయర్ మహాత్మ గాంధీ చేపట్టిన దండియాత్రలో భాగస్వామి అయ్యారు. ఆయన మహాత్మ గాంధీకి వ్యక్తిగత కార్యదర్శి, స్వాతంత్యోద్యమంలో అత్యంత చురుగ్గా పాల్గొనేవారు. జీవితమంతా గాంధీ అడుగుజాడల్లో నడిచాడు. నాయర్ 1899లో ఢిల్లీలో జన్మించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి. బి.ఎ. పట్టా పుచ్చుకున్నారు. 1920లో ఎం.ఎ చదువు విడిచిపెట్టి సహాయ నిరాకరణోద్యమంలో చేరాడు.

1931లో ప్యారేలాల్ నాయర్ మహాత్మ గాంధీతో కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కోసం లండన్ వెళ్ళాడు. మహాత్మా గాంధీ చేసిన బర్మా, సిలోన్ పర్యటనల్లో కూడా గాంధీతో కలిసి ఉన్నారు. 1946లో భారతదేశంలో మతపరమైన అల్లర్లు చెలరేగినప్పుడు ఆయన మహాత్మ గాంధీతో కలిసి బెంగాల్, ఇతర ప్రాంతాల్లో పర్యటించారు. నోయాకలి ప్రాంతంలో మత ఘర్షణలు సద్దుమణిగి సాధారణ పరిస్థితులు నెలకొనడంలో ప్యారే లాల్ కృషి మెచ్చుకోదగింది.

స్వాతంత్య పోరాటాల కాలంలో ప్యారే లాల్ ను ఏడెనిమిది సార్లు అరెస్టు చేశారు. దీనికి తోడు ఆయన మహాత్మ గాంధీ ఆలోచనలు, జీవిత విలువలకు సంబంధించిన పరిశోధనలో, రాతపూర్వకంగా వాటికి ఒక రూపాన్ని ఇవ్వడంలో ఎక్కువ కాలం గడిపేవారు. ఆయన మహాత్మ గాంధీ ప్రారంభించిన హరిజన్ వారపత్రిక ఎడిటింగ్ పనులు కూడా నిర్వహించేవారు. ఆయన గాంధీ తత్వాన్ని, జీవితాన్ని వ్యాఖ్యానించిన నిజమైన చరిత్రకారుడు, ప్యారీ లాల్ నాయర్ 1982, అక్టోబర్ 27న మరణించారు.

స్వాతంత్య్ర పోరాటం కోసం ఉపాధ్యయ వృత్తిని వదులుకున్న యోధుడు వల్జీబాయ్ గోవింద్ జీ దేశాయ్: మహాత్మ గాంధీ నాయకత్వంలో దండి యాత్ర ప్రారంభమైనప్పుడు గుజరాత్ నుంచి అత్యధికంగా 32 మంది సత్యాగ్రహంలు ఉన్నారు. వల్జీబాయ్ గోవింద్ జీ దేశాయ్ కూడా ఆ సత్యాగ్రహుల్లో ఒకరుగా ఉన్నారు. దండి యాత్ర కోసం మేధావి వర్గంగా ఎన్నిక చేయబడిన అతి కొద్ది మందిలో గోవింద్ జీ దేశాయ్ ఒకరు.

ఆయన ఆంగ్ల భాషలో నిష్ణాతులు, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడగలరు. ఒకప్పుడు గుజరాత్ కాలేజీలో ఆంగ్ల సాహిత్యం బోధించేవారు. 1916లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యేందుకు అతనికి కాలేజీ నుంచి అనుమతి నిరాకరించారు. దాంతో ఆయన ఆ సమావేశానికి హాజరవడం కోసం ఉద్యోగం వదిలేశాడు. మహాత్మ గాంధీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చాక వల్జీబాయ్ గాంధీజీని కలుసుకుని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. సబర్మతి ఆశ్రమంలోనే ఉన్నారు. స్వాతంత్య్ర్య పోరాటంలో పాల్గొన్నందుకు 1921లో ఆయన్ని అరెస్టు చేశారు. వల్జీబాయ్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు బోధన చేసేవారు.

1920 తర్వాత అహ్మదాబాద్ లో గుజరాత్ విద్యాపీఠ్ స్థాపించడంతో అక్కడ విద్యార్థులకు బోధించడం కొనసాగించారు. అంతేకాకుండా, గాంధీ ఆలోచనలతో ప్రేరణ పొంది అనేక పుస్తకాలను అనుసరించారు. దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ చరిత్ర అనే పుస్తకాన్ని అనువదించడంలో తన సహకారాన్ని అందించారు. సబర్మతి ఆశ్రమ కార్యకలాపాల్లో పాలుపంచుకునేవారు. మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో వెలువడే 'యంగ్ ఇండియా' పత్రిక ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించేవారు.

కస్తూర్బా గాంధీ, బాపు ఆమెను ఆప్యాయంగా 'బా' అని పిలిచేవారు: జాతిపిత మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీకి భార్య "కావడం మాత్రమే కాకుండా స్వాతంత్య పోరాటంలో మహిళా నాయకురాలిగా ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కస్తూరిబా బాపును ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయన ఆమెను బా అవి అప్యాయంగా పిలిచేవారు. దండి మార్చ్ సమయంలో కూడా కస్తూర్ ఒక భార్యగా తన భర్తకు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. ఆమె మహాత్మ గాంధీకి తన పూర్తి మద్దతు, సహకారం అందించారు. అందుకే ఆయన పగలూ రాత్రీ తేడా లేకుండా దేశ స్వాతంత్య పోరాటానికి తనను తాను అంకితం చేసుకోగలిగారు.

'నో ట్యాక్స్' ప్రచార స్వేచ్ఛనిచ్చి, బాధ్యతలన్నీ స్వయంగా తానే శాంతియుతంగా కార్యక్రమంలో కస్తూర్ బా కూడా పాల్గొన్నారు. అంతకు ముందు బానిలో నిర్వర్తించేవారు. దీనికి ముగ్ధుడైన మహాత్మ గాంధీ నేను అహింసా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు 1932లో అరెస్ట్ అయ్యారు. దండి యాత్ర తర్వాత మహాత్మ గాంధీ అరెస్టు అవడంతో కస్తూర్ బా ప్రజలను ప్రోత్సహించి ముందుకు నడిపించారు. అయితే, ఎంపిక చేసిన సత్యాగ్రాహుల్లో ఆమె లేరు.. గాంధీ లేని ఆ సమయంలో ఆందోళనకారులకు నిరంతరం మద్దతు తెలుపుతూ గాంధీ లేని లోటును పూరించే ప్రయత్నం చేశారు. గాంధీజీ కస్తూర్ బా స్పూర్తిదాయక విమర్శకురాలిగా భావించారు.

కస్తూర్ బా గాంధీ కంటే ముందుగానే సత్యాగ్రహంలో విజయం సాధించినట్లు భావించారు. గాంధీ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు కస్తూర్ బా దేశంలో వివాహ చట్టానికి వ్యతిరేకంగా విజయవంతంగా సత్యాగ్రహ పోరాటు నడిపించారు. ఆమె సత్యాగ్రహం మహిళలు ఇళ్ళ నుంచి బయటికి వచ్చి పోరాటంలో పాల్గొనేందుకు ప్రేరణ కలిగించింది. అంతేకాదు, ఆమె భార్యగా తన భర్తకు కుటుంబ బాధ్యతల నుండి పూర్తి స్వేఛ్ఛనిచ్చి ఆ బాధ్యతలన్నీ స్వయంగా తానే శాంతియుతంగా నిర్వర్తించేవారు.దీనికి ముగ్దుడైన మహాత్మాగాంధీ నేను అహింసా పాఠాలను కస్తూర్ బా నుంచి నేర్చుకున్నాను అనేవారు. కస్తూర్ బా 1869 ఏప్రిల్ 11నగుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు. ఆమె తండ్రి గోకుల్ దాస్ కపాడియా వ్యాపారవేత్త. 14 ఏళ్ళ వయసులో ఆమె గాంధీని వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 22, 1944లో 74ఏళ్ళ వయసులో కస్తూర్ భా గాంధీ మరణించారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments