గోవా స్వాతంత్య్రంకోసం అసువులుబాసిన మొదటి త్యాగధనుడు బాలా రాయ మపారి: గోవా స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ ...
గోవా స్వాతంత్య్రంకోసం అసువులుబాసిన మొదటి త్యాగధనుడు బాలా రాయ మపారి: గోవా స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ బాలా రాయ మపారి ఆజాద్ గోమంతక్ దల్ సంస్థలో సభ్యునిగా పని చేశారు. పోర్చుగీసుల చేతిలోనుంచి గోవా స్వాతంత్య్రంకోసం అలుపెరగని పోరాటం ఏశారు.
గోవా స్వాతంత్ర్యం పోరాటంలో అసువులుబాసిన మొదటి త్యాగధనునిగా ఆయన పేరు సంపాదించుకుననారు. మపారీ, గోవాలోని బరైజ్ తాలూకా అసోనోరాలో జన్మించారు. పోర్చుగీసువారి కబంధ హస్తాలనుంచి గోవాకు విముక్తి కల్పించడానికిగాను ప్రారంభమైన విప్లవ సంస్థ ఆజాద్ గోమంతక్ దల్ లో ఆయన క్రియాశీల సభ్యునిగా పని చేశారు. ఒక సారి విప్లవకారులు అసోనోరాల పోలీస్ స్టేషన్ పై దాడి. చేసి పోలీసులను కిడ్నాప్ చేసి, వారి ఆయుధాలను మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.పోలీస్ స్టేషన్ పై జరిగిన ఈ దాడిలో బాలా రాయ మపారీ కీలక పాత్ర పోషించారనే విషయానని పోర్చుగీసు పోలీసులు పసిగట్టారు. ఆయన్ను పోర్చుగీసు పోలీసులు 1955లో అరెస్టు చేశారు. ఆయన్ను పోలీసులు తీవ్రంగా హింసించారు. పోలీసులు ఎంత కఠినంగా హింసించినా మపారీ నోరు విప్పలేదు. విప్లవకారులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులకు తెలియజేయలేదు. దాంతో పోలీసులు ఆయన్ను మరింత తీవ్రంగా హింసించారు. దాంతో ఆయన ఫిబ్రవరి 15, 1955లో ప్రాణాలు కోల్పోయారు.
గోవా స్వాతంత్ర్యపోరాటంలో 68 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అమర జీవులుగా నిలిచారు. అలా ప్రాణత్యాగం చేసినవారిలో మాయా మాయా రాయ మపారీ మొదటివారిగా గుర్తింపు పొందారు. పిన్న వయస్సులోనే ఆయన ప్రాణత్యాగం చేశారు. ఇప్పటికీ గోవా స్వాతంత్య్ర పోరాట చరిత్రను తలుచుకున్నప్పుడల్లా ఆయన పేరును ఎంతో గర్వంగా తలుచుకోవడం జరుగుతోంది.
గోవా స్వాతంత్ర్యపోరాటంలో 68 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అమర జీవులుగా నిలిచారు. అలా ప్రాణత్యాగం చేసినవారిలో మాయా మాయా రాయ మపారీ మొదటివారిగా గుర్తింపు పొందారు. పిన్న వయస్సులోనే ఆయన ప్రాణత్యాగం చేశారు. ఇప్పటికీ గోవా స్వాతంత్య్ర పోరాట చరిత్రను తలుచుకున్నప్పుడల్లా ఆయన పేరును ఎంతో గర్వంగా తలుచుకోవడం జరుగుతోంది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.
ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం- సూర్య నమస్కారాలు అలాగే EPF E-Nominee, jana aoushadi medical shops ఎలా అప్లై చేసుకోవాలి, Types Insurance, Types Loans ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..
No comments