Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పీడీ యాక్ట్ - ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ గురించి పూర్తి వివరాలు - Preventive Detention Act - PD Act in Telugu

ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ సింపుల్‌గా షార్ట్‌ కట్‌లో చెప్పాలంటే పీడీ యాక్ట్. ప్రివెంటివ్ డిటెన్షన్ అత్యంత వివాదాస్పదమైన అంశం. ...

ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ సింపుల్‌గా షార్ట్‌ కట్‌లో చెప్పాలంటే పీడీ యాక్ట్. ప్రివెంటివ్ డిటెన్షన్ అత్యంత వివాదాస్పదమైన అంశం. సమాజంలో అల్లర్లు, దోపిడీలు, దొంగతనాలు, విద్వంశాలు చేసేవారి వారిపై ఈ చట్టం  ప్రయోగించబడుతుంది. ఈ చట్టం కింద 3 నుంచి 12 నెలలపాటు జైల్లో పెట్టవచ్చు, లేదా నిర్బంధించవచ్చు. చట్టం ముఖ్య ఉద్దేశ్యం సమాజాన్ని రక్షించడం మాత్రమే. సాధారణంగా పీడీ యాక్ట్‌ను దొంగతనాలకు అల్లర్లకు పాల్పడే రౌడీషీటర్ల మీద మాత్రమే అమలు చేస్తారు. రాజకీయ నాయకులపై ఇలాంటివి ప్రయోగించడం తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు జరగలేదు. మొదటగా (25-08-2022) గోషామహల్ శాసనసభ సభ్యుడు రాజ సింగ్ ని ఈ చట్టం క్రింద అరెస్టు చేశారు.

ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ గురించి పూర్తి వివరాలు:

  • పీడీ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తిని మొదటి సందర్భంలో 3 నెలలు మాత్రమే నివారణ కస్టడీకి తీసుకెళ్లవచ్చు.
  • నిర్బంధ కాలం 3 నెలలు దాటితే, హైకోర్టుల న్యాయమూర్తులుగా నియామకానికి అర్హత ఉన్న వ్యక్తులతో కూడిన సలహా బోర్డుకు కేసును సూచించాలి. సలహా మండలి ఆమోదం మేరకు మాత్రమే నిర్బంధ కాలం 3 నెలలకు మించి పొడిగించబడవచ్చు.
  • ప్రజా ప్రయోజనంలో ఉంటే నిర్బంధానికి కారణాలను వెల్లడించాల్సిన అవసరం కూడా లేదు. పీడీ యాక్ట్ నమోదు చేస్తే న్యాయస్థానంలోనూ ఇబ్బందులు రావు.
  • పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం) ప్రకారం ఒక వ్యక్తిని  నిర్బంధించినట్లయితే, భారత రాజ్యాంగాలలోని కొన్ని ప్రాథమిక హక్కులు కోల్పోతారు.
భారతదేశంలో ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది 1800 ప్రారంభంలో బ్రిటిష్ పాలన నుండి మొదలై, డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1939 మరియు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950 వంటి చట్టాలతో కొనసాగింది. వివాదాస్పద అంతర్గత భద్రతా చట్టాన్ని నిజానికి 1971లో ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారత పార్లమెంటు ద్వారా రూపొందించబడింది. అయితే ఇది "ది ఎమర్జెన్సీ" (1975-1977) సమయంలో అనేకసార్లు సవరించబడింది, ఇది మానవ హక్కుల ఉల్లంఘనలకు దారితీసింది. 1977లో జరిగిన ఎన్నికలలో ఇందిరా గాంధీ ఓడిపోయిన తర్వాత  కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దానిని రద్దు చేసింది. ఈ చట్టం క్రింద ఎంతోమంది అమాయకులు అరెస్టులు జరుగుతున్నాయని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. హుమన్ రైట్స్ కి పిర్యాదులు ఎప్పుడూ అందుతుంటాయి..

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం- సూర్య నమస్కారాలు అలాగే EPF E-Nominee, jana aoushadi medical shops ఎలా అప్లై చేసుకోవాలి, Types Insurance, Types Loans  ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments