ఇంక ఇప్పట్నుంచి.... సమైక్యతా రాగాలు పాడుకుంటాము... మతం ముందు..దేశం తరువాత అనే వారితో...జాతి సమైక్యతా కిల కిలా రావాలు చేస్తాం... ...
ఇంక ఇప్పట్నుంచి....
సమైక్యతా రాగాలు పాడుకుంటాము...
మతం ముందు..దేశం తరువాత అనే వారితో...జాతి సమైక్యతా కిల కిలా రావాలు చేస్తాం...
విలీనం అంటే.. కలిసిపోవడం...
ప్రజలు దుష్టుల పాలన నుండి విముక్తి కదా అయ్యింది..
దుష్ట పాలకులు...కలిసిపోయారా...
ఎవరితో...
ఆ పాత రాజ్యపు అధిపతి...నిన్ననే రజాకార్లు అందరూ పాకిస్తాన్ పారిపోయారు అని వాకృచ్చారు...
మరి మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ స్థాపించిన వారూ..వారి వారసులు పరార్ అయిపోయారా...
ఇప్పుడున్న వారు...ఆంధ్రా కోస్తా నుంచి తరలి వచ్చి పాత రాజ్యపు అధిపతులు అయ్యారా...
ఓరి దీనయ్యా...
అంటే..బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం వచ్చింది అనకూడదు...
మనమూ వాళ్లమూ విలీనం అయ్యాము...
సమైక్యం అయ్యాము...
ఇకపై ఆగస్ట్ 15 నాడు... అన్ని సంస్థానాలు విలీన ఉత్సవాలు చేసుకోవాలి...
బీజేపీ విముక్తి అని...పండితులు, యజ్ఞ కర్తలు అయిన కవి రాజు గారు అంటున్నారు అంటే..
విముక్తి అర్థం బాగా తెలిసే ఉంటుంది...
అందుకే...
కొత్త పాట పాడుకుందాం...
నిజాం టైములో...పది శాతం మంది మాట్లాడే ఉర్దూ...
కన్నడని, తెలుగుని, మరాఠీ నీ తోసేసి...అధికార భాష చేసేసిన నైజాం జయహో...
ఎనభై ఐదు శాతం ఉన్న హిందువులలోంచి...ఆరువేల మందే హిందూ సైనికులు...అరవై వేల ముస్లిం సైనికులు...జయహో..
పన్నెండు శాతం జనాభాకు అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు...ఎనభై శాతానికి పదహారు వేలు...జయహో..
నల్ల అంగీల రజాకార్లు...ఎటువంటి అత్యాచారాలు చెయ్యలేదు జయహో..
నగ్నంగా..బతుకమ్మలు ఆడించలేదు జయహో...
బావిలో...నూకేసి చంపలేదు జయహో...
మొత్తం పోరాటం అంతా..భూస్వాముల మీదే జయహో...
నిజాం అంటే...దేవుడు ...
ఆయనే... హాస్పిటల్, యూనివర్సిటీ...అన్నీ పెట్టిండు జయహో...
తెలంగాణా ప్రజలకు ఆయనే గొప్పోడు జయహో...
పాటలో..శృతీ..లయా లేవని అనుకుంటున్నారా...
ఇది కొత్త పర్షియన్..అరబిక్..సెక్యులర్ స్తానీ మిక్స్డ్ రాగం...
నచ్చలేదా...పాపం..
మనం విలీన వజ్రోత్సవాలలో... పాత నవాబును...కొత్త ప్రభువును... కలిపి కీర్తించుకుందాం...
ఈ పదిహేను రోజులూ... ఇంటింటికి పోయి..ఈ క్రింది వాక్యాలు...పిల్లలకి చెబుదాం...
సమైక్యతా కిక్కు ఎట్టుంటదో... సూపిద్దం..!
మన తాతలు..ముత్తాతలు సరదాగా అబద్ధాలు చెప్పారు...
ఊరికే...వాళ్ళని వాళ్ళే హింసించుకుని... శాంతి ప్రియుడైన నైజాం మీదకి...
ప్రేమికుడైన ఖాసిం రిజ్వీ మీదకి నెట్టేశారు నెపం...
మన ముత్తాతలు, అవ్వలూ...వాళ్ళని వాళ్ళే భయపెట్టుకుని...రహస్యంగా పిల్లల్ని గన్నారు...
వాళ్ళని వాళ్ళే... గాయపరచుకునీ...నరికేసుకున్నారు..
పిలిచి అత్యాచారాలు చేయించుకున్నారు...
నువ్వు మహానుభావుడవు స్వామీ..
నీ పాత రాజ్యపు దోస్త్...
ఏది అంటే అదే...
తెలంగాణా ప్రజలు...
ఏదీ యాది పెట్టుకోరు...నువ్వెంతంటే అంతే.. ఏదిస్తే అదే...!!
గంగా జమునా తెహజీబ్... చెప్పింది విను...చరిత్ర అడగద్దు... -శ్రీహరి మంగళంపల్లి
No comments