విభూతి హైందవ సంప్రదాయంలో అత్యంత విశిష్టత కలిగినది. విభూతిని భస్మ అని త్రయంబకం అని కూడా అంటారు. దీని ధారణ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పలు శా...
విభూతి ఎలా తయారు చేస్తారు?
ఆవుపేడను ఎండబెట్టి రుద్ర, చండీహోమాల్లో హవనం చేస్తారు. వాటి నుంచి వచ్చిన భస్మాన్ని శుద్ధిచేసి భస్మంగా ఉపయోగిస్తారు. మరికొన్నిచోట్ల ఆవుపేడను ఎండబెట్టి కాల్చి దానికి మరికొన్ని సుగంధ పదార్థాలను చేర్చి భస్మ ఉండలను తయారుచేసి పెట్టుకొంటారు. మంచి భస్మం తేలికగా ఉంటుంది. ఉండలు తేలికగా ఉన్నప్పటికీ పగలగొట్టాలంటే మాత్రం గట్టిగా ఉంటాయి. అదే కల్తీలేని భస్మానికి పరీక్షగా చెప్పుకోవచ్చు.
ఏ వేళ్లతో భస్మధారణ చేయాలి?
మృగ ముద్రతో భస్మధారణ చేయాలి. అంటే చూపుడువేలుతో భస్మం పెట్టుకోరాదు. మృగముద్ర అంటే బొటనవేలు, మధ్యవేలు, అనామిక (ఉంగరపు) వేలుతో పెట్టుకోవాలి. భస్మాన్ని ధరించేటప్పుడు ముందుగా అంగుష్ఠము (బొటనవేలు)తో ఊర్ధపుండ్రము (నామం)ను నిలువుగా ధరించిన పిమ్మట మధ్యమ, అనామిక వేళ్లతో ఎడమ నుంచి కుడివైపునకు రెండు రేఖలను ధరించి, బొటన వేలుతో కుడి నుంచి ఎడమ లేదా ఎడమ నుంచి కుడివైపునకు మూడవ భస్మరేఖను ధరించాలి. ఈ రేఖలు అతిచిన్నవిగానీ, అతి పొడవుగా గానీ ఉండకూడదు. నేత్రయుగ్మ ప్రమాణముగా అనగా రెండు కనుల చివరి భాగమును దాటి పోకుండా నుదురు భాగంలో భస్మాన్ని ధరించాలి.
"భస్మము" ఔషధగుణాలని కలిగి ఉంది. ఇది ఎన్నో ఆయుర్వేద మందులలో వాడ బడుతుంది. ఇది శరీరములోని అధిక శీతలతను పీల్చుకొంటుంది. జలుబు, తలనొప్పులు రాకుండా కాపాడుతుంది . భస్మాన్ని నుదుట ధరించేటప్పుడు మృత్యుంజయ మంత్రము చెప్పాలని ఉపనిషత్తులు చెపుతున్నాయి .
త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్ మ్రుత్యోర్ముక్షీయ మామృతాత్
ఉర్వారుక మివ బంధనాత్ మ్రుత్యోర్ముక్షీయ మామృతాత్
No comments