శిఖ యొక్క ప్రాముఖ్యత: శిఖ యే సిగ. నీ సిగ దరగ - అని ఒక తిట్టు. శిఖాయై వషట్ - అని సంధ్యావందన మంత్రం. సంధ్యావందనం చేసేటప్పుడు కాని...
శిఖ యొక్క ప్రాముఖ్యత:
శిఖ యే సిగ.
నీ సిగ దరగ - అని ఒక తిట్టు.శిఖాయై వషట్ - అని సంధ్యావందన మంత్రం. సంధ్యావందనం చేసేటప్పుడు కాని ఇతర మంత్రానుష్టానం చేసేటప్పుడు కానీ అంగన్యాసంలో శిఖాయైవశట్ అన్నచోట శిఖను ముట్టుకోవాలి. అది లేకపోతే ఇక అంగన్యాసం పరిపూర్ణమెలా అవుతుంది. ఒక వేళ ప్రమాదవశాత్తు క్షురకర్మ చేయించుకునేటప్పుడు శిఖ తొలిగింపబడడం కానీ, లేదా జుట్టు ఊడిపోయిన వారుకాని అనుష్టానం చేసేటప్పుడు ఒక దర్భను తలచుట్టూ చుట్టుకుని శిఖలా భావించి అనుష్టానం సాగించాలి. సంధ్యావందనం చేసేవారు తప్పక శిఖ ఉంచుకోవాలి. శిఖలేనిదే వైదిక కర్మ ఆచరించినా వ్యర్థమని శాస్త్రవాక్కు. కాబట్టి శిఖ ముఖ్యాతిముఖ్యము.
"గాయత్రాతు శిఖాం.............బద్ధ్వాతతః కర్మసమార భేత్''
అను ధర్మం ప్రకారం వైదిక కర్మ ప్రారంభమునకు ముందు శిఖను బంధించవలెను.
కాబట్టి ఉపనయనం లో వటువుకు శిఖ ఏర్పాటు చేస్తారు.
అది జీవితాంతం ఉంటుంది..అది గోష్పాదమంత ఉండాలి.ముడి వేసి ఉండాలి. విరగబోసుకో గూడదు.
కాశీఖండంలో( 4ఆ.) గుణనిధి కథలో అర్ధముండితంబైన శిరంబున (నీర్కావి దోవతి నరిమురింజుట్టి ?) అని సగానికి సగంగా శిరసున శిఖ యజ్ఞదత్తుడికున్నట్టు శ్రీ నాథుడు చెప్పాడు.
ముండనం మండనం పుంసాం - మగవాళ్ళందరికీ శిరోముండనం అలంకారం అన్నారు. ఇంగ్లీషు వాళ్లు వచ్చేదాకా మన దేశంలో అందరి కీ శిఖ ఉండేది. ప్రవరుడికి తెగబారెడు వెండ్రుకలు. (అర్ధ ముండనం పైననే ) తనకు గూడా అంత జుట్టు ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంది అప్సరఃకాంత వరూధిని.
ఎవరైనా దాయాదులు మరణిస్తే జుట్టు గొరిగించుకుంటారు . (ఎపుడూ సిగ మాత్రం తీసి వేయగూడదని కొందరి ఆచారం). కొన్ని సందర్భాల్లో మరణశిక్ష తో సమానం/ ప్రత్యామ్నాయం సిగదరగడం.
పోతన భాగవతంలో అర్జునుడు అశ్వత్థామను చంపకుండా వదలివేసినపుడు - చంపుతానని చేసిన ప్రతిన ఏదో ఒక విధంగా నెరవేర్చుకోవడముగా - ఆతడి శిరస్సును గొరిగి బయటికి గెంటేస్తాడు .." అశ్వత్థామ శిరోజముల్ తరిగి." .అని వ్రాశాడాయన.
తిరుపతిలో తలనీలాలు సమర్పించడం లో అంతరార్థం మన ప్రాణమే ఇచ్చి వేయడం. అందుచేత పూర్తిగా తిరు క్షౌరం చేసుకొంటారు.(గాట్లు పడ్డా మంచిదేలే అనుకుంటారు ఇక్కడ మాత్రం. )
సిగ లోకీ విరులిచ్చీ అనేది మగమహారాజులకూ ఉండేదే!
అలంకార ప్రియో విష్ణుః. ఆయనా, మనమూ అందరం సిగలో, మెడలో పూలు ధరిస్తూన్న వాళ్ళమే.
కనీసంలో కనీసం పన్నెండు కన్నా ఎక్కువ వెంట్రుకలను కూర్చి శిఖగా పెట్టుకోవాలి. పెద్దగాలేకున్నా మామూలు జుట్టులో కలిసిపోతుంది. అందరూ శిఖ ఉంచుకోవడం విధి, ఇప్పటి వరకూ ఎవరైనా అది ఉంచుకోక, ఇప్పటినుండి ఉంచుకోవాలనుక్కున్నా చక్కగా ఉంచుకోవచ్చు. తెలియని తనాన్ని భగవంతుడు క్షమిస్తాడు.
శిఖ యొక్క ప్రధాన్యత,వైద్యపరంగా వివరించబడింది.శరీరంలో మంత్ర-అనుష్టానలచేత గాని, అతి వాతము వలన కాని ప్రోగుపడిన అతిఎక్కువ విద్యుదావేశాన్ని బయటకు పంపే వొక యాన్తెన్నా/ఏరియల్ గా శిఖ పని చేస్తుంది .అంటే పరోక్షంగా శరీరంలో వీర్యకణాల ఉత్పత్తికికి అనువైన శారీరక ఉష్ణోగ్రతను శిఖ ఏర్పాటు చేస్తుంది. సాధారణంగా వేదం చదివే వారి వారి దేహ ఉష్ణోగ్రత కొంచం ఎక్కువగా ఉంటుంది. దీనిని సమతుల్యం చేయడానికే శిఖని పెట్టుకోమన్నారు పెద్దలు.
చాగంటి వారు తమ ప్రవచానాల్లో శిఖ గురించి తెలియజేస్తూ బ్రాహ్మణులకి శిఖా సంస్కారం (పిలక) మరియు చేవిపోగులు ఖచ్చితంగా వుండాలి. ఎవరైనా బ్రాహ్మణులు శిఖ లేకుండా బ్రాహ్మణ వృత్తి చేస్తూ వుంటే, అతనికి తన వృత్తి పట్ల, దేవతల పట్ల నమ్మకం లేదు అని తెలుసుకోవాలి. అంతే కాకుండా, అతను సమాజాన్నీ, భక్తులనీ మోసం చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. అతనిని గౌరవించవలసిన అవసరం లేదు. సంస్కారాలకి విలువ ఇవ్వనివాడు ఎంత చదువుకున్నా ప్రయోజనం లేదు.
No comments