1971 యుద్ధం రెండు దేశాల మధ్య జరిగే సాధారణ యుద్ధం కాదు కాబట్టి దాన్ని చూసిన ప్రజల మదిలో జ్ఞాపకాలు ఇంకా నిలిచే వున్నాయి. పైగా, కేవ...
భారత సైనికుల ముందు 93,000 మంది పాకిస్థాన్ సైనికులు అత్యంత అవమానకరమైన రీతిలో లొంగిపోవడమే కాకుండా, కొత్త దేశాన్ని సృష్టించేందుకు దారితీసింది. స్వతంత్ర భారతదేశంలో భారత సైనికులు స్పష్టమైన విజయం సాధించి, శత్రు సైనికులు ఆయుధాలు విడిచి, లొంగిపోయే విధంగా చేసిన యుద్ధం ఇది ఒక్కటే కావడం గమనార్హం.
వాస్తవానికి ఆనాడు భారతదేశం ఆర్థికంగా, సైనికంగా, ఆయుధ పరంగా అనేక లోటుపాట్లను ఎదుర్కొంటున్నది. కేవలం ధృఢ దీక్ష, అసామాన్యమైన మన సైనికుల పరాక్రమం, మొత్తం దేశ ప్రజలు ఒక్కటిగా సైనికులకు అండగా నిలబడటం, అసామాన్యమైన దౌత్య విధానం ఈ చారిత్రాత్మక విజయానికి దారితీసింది. ఈ విజయాన్ని గుర్తుచేసుకుంటూ ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవక్ చుర్ఖా ముర్ము బలిదానం స్మరించుకుందాం..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రాయిగంజ్ జిల్లా అప్పటి తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) సరిహద్దు ప్రాంతం. 1971 లో భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రారంభ సమయంలో శత్రు సైన్యాలు భారత భూభాగంలోకి చొచ్చుకొని రావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని సరిహద్దులో చక్రం గ్రామంలో ఉండే చుర్ఖా ముర్ము అనే 9 వ తరగతి చదువుతున్న ఆర్ ఎస్ ఎస్ శాఖ ముఖ్యశిక్షక్ గుర్తించాడు. శత్రువుల కదలికలను దగ్గరలో ఉన్న బిఎస్ఎఫ్ స్థావరానికి తెలియచేసాడు.దానితో అప్రమత్తమైన బిఎస్ఎఫ్ జవాన్లు కొంత మందుగుండు సామగ్రిని తాము వచ్చే లోపే సరిహద్దుకు చేర్చమని కోరడంతో "చుర్ఖా ముర్ము" దాన్ని స్వయంగా అక్కడికి మోసుకెళ్ళి శత్రువులతో పోరాటం చేస్తూనే వీర మరణం పొందాడు.
అనంతరం జరిగిన పరిణామాలు: 1971 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన ముగిసిన ఈ యుద్ధం బంగ్లాదేశ్ ప్రజలను కాపాడడమే కాకుండా, రాక్షసులై వ్యవహరించిన పశ్చిమ పాకిస్తాన్ కు చెందిన ఇస్లాం మతోన్మాదులు తమ మతానికే చెందిన వారిపైననే. బంగ్లాదేశ్ లో నరమేధం సృష్టించిన 93 వేల మందికిపైగా దుష్ట సైనికులను బంధించి భారత భూభాగంలోకి తెచ్చి మోకాళ్ళ పై కూర్చుండబెట్టారు. (బహుశా ప్రపంచంలోనే ఇంత పెద్ద సంఖ్యలో యుద్ధ ఖైదీలను బంధించి తేవడం ఎవరు చేసి ఉండకపోవచ్చు.)
తమకు ఏసంబంధం లేకపోయినా భారత దేశము, భారత సైనికులు విశాలమైన దృష్టితో, మానవ సహజమైన సహకార గుణంతో బంగ్లాదేశ్ పౌరులను ఆదుకున్నారు, అన్నం పెట్టారు, అక్కున చేర్చుకున్నారు, ఆదరించారు. వాళ్ల గౌరవానికి గుర్తింపుగా ప్రత్యేక బంగ్లాదేశ్ రాజ్యం ఏర్పడేందుకు సహకరించారు.
స్వయంసేవక్ బలిదానానికి గుర్తుగా చక్రం గ్రామంలో ఒక స్మారక చిహ్నాన్ని సైతం ఏర్పాటు చేయడం జరిగింది. స్వయంసేవక్ అంటే ఒక దేశ భక్తుడు ,ఒక సైనికుడు, భారతమాత ఆరాధనయే సర్వోపరి అనేవాడు, దేశంకోసం ప్రాణాలు ఇవ్వగలిగిన తెగింపు కలిగినవాడు. అని చెప్పడానికి ఇంతకంటే మరో ఉదాహరణ ఏముంటుంది..? జై హింద్, భారత్ మాతాకీ జై.
No comments