పుస్తకం ఒక మంచి స్నేహితుడులాంటిదని పెద్దలు చెప్తారు. ముద్రిత అక్షరాల విస్తరి పుస్తకం. అన్ని అలవాట్లలో కన్నా పుస్తక పఠనం అత్యున్న...
పుస్తకం ఎన్నో సంగతులు చెప్తుంది.. పుస్తకం ఎన్నో అనుభవాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.. ఎన్నో అనుభూతుల్ని మిగులుస్తోంది. ఫలానా పుస్తకం ఎక్కడ దొరుకుతుందో అని అనేక బుక్ స్టాల్స్ తిరిగే అవసరం లేకుండా సమస్త భాండాగారం ఒకే చోట లభించడం అనేది పుస్తక ప్రియులకు నిజంగా పండగే. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గ్రౌండ్స్ (తెలంగాణ కళా భారతి)లో జాతీయ పుస్తక ప్రదర్శన ప్రతి సంవత్సరం డిసెంబర్ ఆఖరి వారంలో కొలువుతీరుతుంది...
అక్షర బద్ధుడైన ప్రతి వ్యక్తి విజయం వెనుక ఒక మంచి పుస్తకం ఉంటుందని అంటారు. మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పుస్తకాలు పరిష్కారం చూపుతాయి. పుస్తకాలు చదివే అలవాటున్నవారికి సమస్యలేవైనా ఎదురైతే వాటికి తరుణోపాయం వెతుక్కునే గుండెధైర్యం నిండుగా వుంటుంది. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు మానసిక వికాసాన్ని కలిగించే పుస్తకాలను కూడా చదువుతుంటే భవిష్యత్తు బాగుంటుంది.
హడావిడి జీవితాలతో, ఉరుకులు పరుగుల ఉద్యోగాలతో , సంపాదనకోసం చేసే ఆరాటంలో పుస్తక పఠనానికి దూరమవుతున్నారు. ఇలాంటి పరిణామాల వల్ల చిన్న సమస్యలకే మనుషులు కుంగిపోతున్నారని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. పుస్తకాలను బహుమతులుగా ఇచ్చే సంస్కృతిని పెంపొందించాలని మెగామైండ్స్ కూడా కోరుకుంటుంది. చిన్నారులు విజయాలు సాధించినపుడు వారిని అభినందిస్తూ పుస్తకాలు అందజేయాలి, అలా చిన్నతనం నుంచే పుస్తక పఠనాన్ని అలవాటుచేయాలి.
స్థలమ్: NTR స్టేడియం
తేదీలు: డిసెంబర్ 22 నుండి జనవరి 1 వరకు
సమయమ్: 2.00--8.30
శని,ఆది, సెలవు దినాలలో మధ్యాహ్నం.1 నుండి---9.00 వరకు
ధన్యవాదాలతో సదా మీ Mega Minds
అలాగే మా ప్రచురణల రెగ్యులర్ అప్ డేట్స్ కోసం క్రింద ఉన్న ఇమేజ్ ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి..
No comments