Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దేశ ఐక్యతకు నిదర్శనం కాశీ, తమిళ సంగమం - Celebrating the confluence of cultures Kashi Tamil Sangamam

భారతదేశం స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ సమయంలో2022 నవంబర్ 19వ తేదీ నుండి నెల రోజుల పాటు జాతీయ విద్యావిధానం - 2020 పరిధిలో విద్యా మ...

భారతదేశం స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ సమయంలో2022 నవంబర్ 19వ తేదీ నుండి నెల రోజుల పాటు జాతీయ విద్యావిధానం - 2020 పరిధిలో విద్యా మంత్రిత్వ శాఖ కాశీ తమిళ సంగమం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ కి ఇది నిజమైన సాక్ష్యం.

విభిన్న భాషలు, అభిభాషణలు, సంస్కృతుల సహజీవనంగా భిన్నత్వంలో ఏకత్వానికి సజీవ ఉదాహరణ భారతదేశం. ఈ ఐక్యతకు చెందిన సామరస్యానికి కాశీ తమిళ సంగమం ఒక నిదర్శనం. తమిళనాడు, కాశీ మధ్య తరతరాల క్రితం నాటి బంధాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా ఈ సంగమం జరిగింది.

వారణాసి పురాణేతిహాసాలలో ప్రస్తావించబడిన నగరం కాశీ, తమిళనాడు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషకు కేంద్రం. గంగానదీ తీరంలో పవిత్ర మంత్రాలు నిరంతరం ప్రతిధ్వనించే ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన నగరం ఒకటి. భారత మేథో వ్యవస్థకు అమూల్యమైన ఖని మరొకటి. మేథో, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, కళా రంగాల చారిత్రక వైభవం
హృదయాల్లో నిండిన ప్రదేశాలివి. దీర్ఘ సాంప్రదాయం విలసిల్లే ఈ రెండు ప్రాంతాలు చిహ్నమే కాశీ తమిళ సంగమం.

యువతలో ఆధునికతకు సంబంధించిన లక్షణాలతో పాటుగా దేశ సాంస్కృతిక, నైతిక విలువల మూలాలు పటిష్ఠం చేసే భావాలు గల తరాన్ని భవిష్యత్తుకి అందించాలని కేంద్రప్రభుత్వం మరియు ప్రధాని మోదీ దూరదృష్టి కి అనుగుణంగా ఈ సంగమం జరిగింది. భారత్ వంటి దేశంలో సంగమాల ప్రభావం, ప్రాధాన్యం అధికం. నదులు, వాగుల సంగమం నుంచి ఆలోచనలు ఆదర్శాల వరకు; మేథస్సు-సైన్స్; సమాజాలు - సంస్కృతులు ఇలా అన్ని సంగమాలను వేడుకలుగా నిర్వహించుకుంటారు. వాస్తవంగా భారతదేశ భిన్నత్వం, ఐక్యతల వేడుక. అలా కాశీ-తమిళ సంగమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఒక వైపు కాశీ భారత సాంస్కృతిక రాజధాని అయితే మరోపక్క తమిళనాడు, తమిళ సంస్కృతి భారతదేశ వారసత్వం, గర్వాల చిహ్నం.

“కాశీ నగర నిర్మాణం, అభివృద్ధికి తమిళనాడు కనివిని ఎరుగని సేవలందించింది”. తమిళనాడులో జన్మించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బి హెచ్ యు మాజీ వైస్ చాన్సలర్. ఆయన చేసిన సేవలను బి హెచ్ యు నేటికీ గుర్తు చేసుకుంటుంది. ప్రముఖ తమిళ వేద పండితుడు శ్రీ రాజేశ్వర్ శాస్త్రి కాశీలో జన్మించారు. ఆయన రామ్ ఘాట్ సందేద పాఠశాల స్థాపించారు. అదే విధంగా కాశీవాసులు హనుమాన్ ఘాట్ లో నివశించిన శ్రీ పట్టాభిరామ శాస్త్రీజీని కూడా గుర్తుంచుకుంటారు.

జీవితంలోని ప్రతి ఒక్క విభాగంలోను, ప్రతి ఒక్క కోణంలోను విభిన్న వర్ణాల శక్తి కాశీ, తమిళనాడుల్లో కనిపిస్తుంది. “నేటికి కూడా తమిళ (దక్షిణ భారతం) వివాహ వేడుకల్లో కాశీయాత్ర ఒకటిగా ఉంది. ఆ కాశీయాత్రను తమిళ (దక్షిణ భారతం) యువత కొత్త జీవనంతో అనుసంధానం చేశారు. తమిళుల హృదయాల్లో కాశీ పట్ల ఆధ్యాత్మిక ప్రేమ చిహ్నం ఇది. ఈ ప్రేమ గతంలో చెరిగిపోలేదు, భవిష్యత్తులో చెరిగిపోదు. ఇదే మన పూర్వీకులు ఆరాధించిన “ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్” సాంప్రదాయం. నేడు కాశీ - తమిళ సంగమం ఆ కీర్తిని మరింత ముందుకు నడుపుతోంది.

ఈ సంగమం గంగా-యయునా సంగమం అంత పవిత్రమైనది. గంగ-యమున తరహా సామర్థ్యాలు, అవకాశాలు దీనికి ఉన్నాయి. కాశీ-తమిళనాడు శివమయం, శక్తి మయం. కాశీ, తమిళనాడు సంస్కృతం, తమిళం సహా ప్రపంచంలోని ప్రాచీన భాషల నిలయాలు. కాశీలో బాబా విశ్వనాథ్, తమిళనాడులో రామేశ్వరుని ఆశీస్సులు లభిస్తాయి. కాశీ, తమిళనాడు శివమయం, శక్తిమయం. వాటిలో మొదటిది కాశీ అయితే రెండోది తమిళనాడులోని దక్షిణ కాశీ. ఈ
రెండింటికీ “కాశీ-కంచి” పేరిట సప్తపురిల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కాశీ, తమిళనాడు రెండింటికీ సంగీతం, సాహిత్యం, కళల్లో సమున్నత వారసత్వం ఉంది. కాశీలో బనారసీ చీరలు, తమిళనాడులో కాశీ, కంజీవరం సిల్కు ప్రపంచవ్యాప్త ప్రసిద్ధిని పొందాయి. ఈ రెండూ భారత ఆధ్యాత్మిక జీవనంలో సుప్రసిద్ధమైనవి. గొప్ప గురువుల జన్మస్థలం, కార్యస్థలం ఈ రెండు ప్రదేశాలు. కాశీ భక్తుడు తులసి జన్మస్థలి అయితే తమిళనాడు యోగి తిరువళ్లువార్ నివశించిన ప్రదేశం.

కాశీకి వెళ్లినప్పుడు హరిశ్చంద్ర ఘాట్ లోని తమిళ దేవాలయం కాశీ కామకోటీశ్వరాలయం దర్శించుకోండి, కేదార్ ఘాట్ లో 200 సంవత్సరాల కాలం నాటి కుమారస్వామి మఠం, మార్కండేయ ఆశ్రమం ఉన్నాయి. హనుమాన్ ఘాట్, కేదార్ ఘాట్ ల చుట్టుపక్కల ప్రాంతాల్లో నివశిస్తున్న భారీ సంఖ్యలోని తమిళ ప్రజలు తరాలుగా కాశీకి ఎనలేని సేవలు అందించారు. అంతే కాదు, మరో తమిళ ప్రముఖుడు, స్వాతంత్య్ర యోధుడు శ్రీ సుబ్రమణ్య భారతి కూడా కాశీలో నివశించారు. ఆయన మిషన్ కాలేజి, జైనారాయణ్ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. కాశీలో తాను కూడా ఒక భాగం అనే తరహాలో ఆయన కాశీతో మమేకం అయిపోయారు. అలాంటి ఎందరో ప్రముఖులు, సాంప్రదాయాలు, విశ్వాసాలు జాతీయ ఐక్యత అనే దారంతో కాశీ, తమిళనాడులను అనుసంధానం చేశారు. ఇప్పుడు బి హెచ్ యు సుబ్రమణ్య భారతి పేరు మీద ఒక చైర్ ఏర్పాటు చేసి మరింత గర్వకారణం అయింది.

కాశీ-తమిళ సంగమం పండుగ వాతావరణాన్ని సృష్టించింది భారతీయ సాంప్రదాయం అనుసంధానించడానికి, పాత కాలం నాటి అనుసంధానతను బలోపేతం చేయడానికి, మన భాగస్వామ్య సంపదను కాపాడడానికి కాశీ తమిళ సంగమం ఒక వేదికనే చెప్పాలి.

ఈ సంగమంలోని విద్యా కార్యక్రమంలో పాల్గొని లీనమైన అనుభవం సాధించడానికి 12 తమిళ బృందాలకు చెందిన 2500 మంది ప్రతినిధులు కాశీని సందర్శించారు. ప్రతి బృందంలోను పరస్పర సంభాషణలు, మేథోమార్పిడి జరిగాయి. ఆ సందర్శన సమయంలో ప్రతి ప్రతినిధి బృందాన్ని వారణాసి, సారనాథ్, ప్రయాగ్ రాజ్, అయోధ్య యాత్రలకు కూడా తీసుకెళ్లారు. ఉత్సవాలకు రంగులద్దేందుకు ప్రతి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో
భరతనాట్యం వంటి ప్రాచీన నృత్యాలు; కరగటం, పోయికల్, కుథిరాయి వంటి తమిళ జానపద నృత్యాలు, తమిళ జానపద సంగీత కార్యక్రమాలు వాటిలో ఉన్నాయి.

తమిళనాడు స్వాతంత్య్ర సమర యోధులపై నిర్వహించిన ప్రదర్శన త్యాగానికి ప్రతిబింబంగా నిలిచింది. ఈ కార్యక్రమాల తో పాటు ప్రాంతీయ చిత్రాల ప్రదర్శన, పుస్తకాల ఆవిష్కారం కూడా జరిగాయి. అంతే కాదు “ఒక జిల్లా, ఒక ఉత్పత్తి” బ్యానర్ కింద విభిన్న హస్తకళా, చేనేత ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏ సంస్కృతిలో నైనా వంటకాలు ఒక భాగం. అలాంటి వంటకాలు కూడా అందులో ప్రదర్శించారు. అవి దేనికది ప్రత్యేక రుచి కలిగి ఉన్నాయి. ప్రజల హృదయాలను చేరువ చేసిన ఈ వేడుక స్వాతంత్య్ర అమృత మహోత్సవ్ ఆదర్శంగా నిలిచింది. కాశీ-తమిళ సంగమం పదాలను మించిన భావం.

ఈ సంగమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించగా,అమిత్ షా, అన్నామలై, యోగీ జీ లు ఈ కార్యక్రమ ముగింపుసభలో పాల్గొన్నారు.. అలాగే ముందు ముందు తమిళనాడులో, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఉత్సవాలు జరగాలి, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా ప్రాంతాలకు వెళ్లి భారతదేశాన్ని తెలుసుకోవాలి. కాశీ తమిళ సంగమం ఇచ్చిన సందేశం నిస్సందేహంగా ఒక పరిశోధనాంశం అవుతుంది. అది జాతీయ ఐక్యతకు మహావృక్షంగా మారుతుంది.  -టీం మెగామైండ్స్
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments