Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మంత్రం గురించి తెలుసుకుందాం - About Mantram in Telugu

మంత్రం అంటే అది ఒక ‘శబ్దం’. ఈనాటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈ విశ్వమంతా ఒక ప్రకంపన అని అంటోంది. ఎక్కడైతే ప్రకంపన ఉంటుందో, అక్కడ కచ్చితంగా శబ్ద...

Mantram



మంత్రం అంటే అది ఒక ‘శబ్దం’. ఈనాటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈ విశ్వమంతా ఒక ప్రకంపన అని అంటోంది. ఎక్కడైతే ప్రకంపన ఉంటుందో, అక్కడ కచ్చితంగా శబ్దం ఉంటుంది. అంటే దానర్ధం, ఈ విశ్వమంతా ఒక రకమైన శబ్దం అని - లేదా అది వివిధ రకాల శబ్దాల సంక్లిష్ట అల్లిక అని. అంటే, ఈ విశ్వమంతా అనేక మంత్రాల సమ్మేళనమే. వీటిలో, తాళంచెవిలా పనిచేయగల కొన్ని మంత్రాలను లేదా శబ్దాలను గుర్తించడం జరిగింది. వాటిని ఒక నిర్దిష్ట విధానంలో ఉపయోగిస్తే అవి మీలో సరికొత్త జీవపు కొణాలను, ఇంకా అనుభూతులను తెరిచే తాళం చెవులుగా పనిచేస్తాయి.

మంత్రాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఒక్కొక్క మంత్రం శరీరంలోని నిర్దిష్ట భాగంలో నిర్దిష్ట రకమైన శక్తిని ఆక్టివేట్ చేస్తుంది. ఈ విషయంలో సరైన అవగాహన లేకుండా, ఊరికే ఆ శబ్దాన్ని పదేపదే పలకడమనేది మీ మైండ్‌ని మందకొడిగా చేస్తుంది. ఏ శబ్దాన్నైనా పదే పదే పలకడమనేది, ఎప్పుడూ కూడా మైండ్‌ని మందకొడిగా చేస్తుంది. కేవలం సరైన అవగాహనతో, అదేంటో అర్ధం చేసుకొని చేసినప్పుడు మాత్రమే, మంత్రం శక్తివంతమైన సాధనంగా పని చేస్తుంది. ఒక శాస్త్రంగా అది ఎంతో శక్తివంతమైన శాస్త్రం. కానీ సరైన మూలం లేకుండా, లేదా అవసరమైన పరిస్థితులను నెలకొల్పకుండా, మంత్ర దీక్ష ఇవ్వడం అనేది, ఎంతో నష్టానికి దారి తీస్తుంది.

మంత్రాలకు మూలం సంస్కృత భాష నుండే వస్తుంది. అలాగే సంస్కృత భాషలో శబ్ద ఉచ్చరణకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కానీ వివిధ వ్యక్తులు సంస్కృతం మాట్లాడినప్పుడు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉచ్చరిస్తారు. బెంగాలీలు మంత్రం చదివితే, తమదైన శైలిలో ఉచ్చరిస్తారు. తమిళులు మరోలా ఉచ్చరిస్తారు. అమెరికన్లు మంత్రం చదివితే, వారు పూర్తిగా భిన్నమైన రీతిలో ఉచ్చరిస్తారు. ఇలా, ఇతర భాషలు మాట్లాడేవారు, సరైన శిక్షణ పొందితే తప్ప, వారి మాతృభాషలోని ఉచ్చారణ ప్రభావం వల్ల, మంత్ర ఉచ్చారణలో వక్రీకరణలు తలెత్తుతాయి. అయితే ఈ శిక్షణ చాలా శ్రమతో కూడుకుని ఉంటుంది. ఈ రోజుల్లో ప్రజలకు అంతటి ఓర్పు గానీ, అంకితభావం గానీ లేవు, ఎందుకంటే దీనికి ఎంతో సమయం ఇంకా నిబద్ధత అవసరం.

మంత్ర ఉచ్చారణ అనేది ఒక సన్నాహక దశగా చాలా బాగా పనిచేస్తుంది. కేవలం ఒక్క మంత్రం పటించడమనేది ప్రజలకు ఎన్నోఅద్భుతాలు చేయగలదు. ఏదైనా సృస్టించడంలో మంత్రాలు బలమైన శక్తి కాగలవు, అయితే ఉచ్చరించే వారికి శబ్దం అంతటి గురించి పూర్తి అవగాహన ఉండాలి. “శబ్దం అంతటి గురించి” అన్నప్పుడు, దానర్ధం, ఈ సృష్టి మొత్తం గురించి అని. మంత్రం అనేది అటువంటి వారి నుండి వస్తే, వారికి ఆ స్థాయి అవగాహన ఉంటే, అలాగే దీక్ష ఇవ్వడమనేది స్వచ్చంగా జరిగితే, అప్పుడు మంత్రాలు ఎంతో ప్రభావవంతమైన శక్తిగా పనిచేస్తాయి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments